ప్రధాన మంత్రి కార్యాలయం

ఒలంపిక్స్ కోసం సన్నాహాల ను సమీక్షించడానికి జరిగిన ఒక సమావేశానికి అధ్యక్షత వహించిన ప్ర‌ధాన మంత్రి


క్రీడ లు అనేవి మన జాతీయ స్వభావానికి కేంద్ర బిందువు స్థానం లో ఉన్నాయి; మరి మన యువత ఒక బలమైనటువంటి, హుషారైనటువంటి క్రీడా సంస్కృతి కి రూపు రేఖల ను దిద్దుతున్నారు: ప్ర‌ధాన మంత్రి

135 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్ష లు ఒలంపిక్స్ లో పాల్గొనే మన యువజనుల కు అండ గా ఉంటాయి: ప్ర‌ధాన మంత్రి
 

టీకా మందు ను వేయించడం నుంచి శిక్షణ సదుపాయాల వరకు, మన క్రీడాకారుల ప్రతి ఒక్క అవసరాన్ని అగ్ర ప్రాధాన్యం గా ఎంచి, దాని ని తీర్చి తీరవలసిందే: ప్ర‌ధాన మంత్రి

ప్రపంచ రంగస్థలం మీద సఫలత ను సాధించే ప్రతి ఒక్క యువ క్రీడాకారుడి ని/ప్రతి ఒక్క క్రీడాకారిణి ని చూసి, మరో వేయి మంది క్రీడల లోకి ప్రవేశించేందుకు ప్రేరణ ను పొందుతారు: ప్ర‌ధాన మంత్రి


క్రీడాకారులను, క్రీడాకారిణులను ప్రోత్సహించడం కోసం, గౌరవాన్విత దేశం వారి కి వెన్నంటి నిలచిందనే విశ్వాసాన్ని కలిగించడం కోసం, నేను ఒలంపిక్స్ లో భాగం పంచుకొనే మన దళం సభ్యుల తో జులై లో ఓ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడుతాను: ప్ర‌ధాన మంత్రి

Posted On: 03 JUN 2021 4:31PM by PIB Hyderabad

టోక్యో ఒలంపిక్స్ మొదలవడానికి మరో 50 రోజులే మిగిలి ఉన్నటువంటి సందర్భం లో ఒలంపిక్స్ కు భారతదేశం సన్నాహాలు ఎలా ఉన్నాయో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమీక్షించారు.  రాబోయే టోక్యో ఒలంపిక్స్ కు నిర్వహణపరమైన సన్నద్ధత తాలూకు వివిధ దృష్టికోణాల పై అధికారులు ఒక సమర్పణ ను అందించారు.  మహమ్మారి నేపథ్యం లో క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు అంతరాయాలు ఏవీ ఎదురవకుండా శిక్షణ అందేటట్టు జాగ్రత లు తీసుకొనే దిశ లో చేపడుతున్న వివిధ చొరవల ను గురించి, ఒలంపిక్ కోటా ను గెలుచుకోవడం కోసం అంతర్జాతీయ పోటీల లో భాగం పంచుకోవడాన్ని గురించి, ఎథ్ లీట్ లకు టీకా మందు ను ఇప్పించడాన్ని గురించి, వారికి పద్ధతి ప్రకారం అందజేస్తున్నటువంటి ఊతాన్ని గురించి సమీక్ష సాగిన క్రమం లో మాన్య ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు రావడం జరిగింది.

టీకా మందు ను సహాయక సిబ్బంది సహా ఎంత మందికి ఇప్పించిందీ వివరాల ను అధికారులు తెలియజేశారు.  టోక్యో ఒలంపిక్స్ కు అర్హత ను సాధించినటువంటి, అటువంటి అర్హత సాధించే అవకాశం ఉన్నటువంటి క్రీడాకారుని కి, క్రీడాకారిణి కి, సహాయక సిబ్బంది కి, టోక్యో ఒలంపిక్స్ కు ప్రయాణించేటటువంటి అధికారులకు ఎంత త్వరగా సాధ్యపడితే అంత త్వరగా టీకా మందు ను వేయించి తీరాలి అని ప్రధాన మంత్రి ఆదేశించారు.


 




ఒలంపిక్స్ లో భాగం పంచుకొనే మన దళం సభ్యుల ను ప్రోత్సహించడం కోసమే కాకుండా, వారికి భారతీయులందరి పక్షాన శుభాకాంక్షల ను తెలియజేయ
డం కోసం జులై లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా క్రీడాకారుల బృందాన్ని ఉద్దేశించి నేను మాట్లాడుతాను అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  క్రీడ లు అనేవి మన దేశ ప్రజల స్వభావం లో కీలకం గా ఉన్నాయని, అంతే కాకుండా మన యువత ఒక బలమైనటువంటి, హుషారైనటువంటి క్రీడా సంస్కృతి ని నిర్మిస్తున్నారని ఆయన అన్నారు.  135 కోట్ల మంది భారతీయుల శుభ అభిలాష లు ఒలంపిక్స్ లో పాల్గొనే మన యువజనుల కు అండగా ఉంటాయని ఆయన అన్నారు.  ప్రపంచ రంగస్థలం మీద సఫలత ను సాధించే ప్రతి ఒక్క యువ క్రీడాకారుడి ని/ప్రతి ఒక్క క్రీడాకారిణి ని చూసి, మరో వేయి మంది క్రీడల లో ప్రవేశించేందుకు ప్రేరణ ను పొందుతారు అని కూడా ప్ర‌ధాన మంత్రి అన్నారు.

క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు ప్రేరణ ను అందించే దిశ లో, వారు ఒలంపిక్స్ లో భాగం పంచుకొనే క్రమం లో వారి లో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని పెంచడానికి సైతం ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడం జరుగుతుందని అధికారులు అన్నారు.  ఈ కారణం తో, పోటీ లు సాగే సందర్భం లో భారతదేశం లో వారి తల్లితండ్రులతోను, కుటుంబ సభ్యుల తోను క్రమం తప్పక వీడియో కాన్ఫరెన్సుల ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.  

11 క్రీడా పోటీల లో మొత్తం 100 మంది క్రీడాకారులు, క్రీడాకారిణులుల టోక్యో ఒలంపిక్స్ కు అర్హత ను పొందారని, మరో సుమారు 25 మంది ఎథ్ లీట్ లు కూడా టోక్యో ఒలంపిక్స్ కు అర్హత ను సంపాదించేందుకు అవకాశం ఉందని, ఆ వివరాలు 2021 జూన్ నెలాఖరు కల్లా వెల్లడి అవుతాయని ప్రధాన మంత్రి కి వివరించడం జరిగింది.  2016 లో రియో డీ జనేరియో లో జరిగిన కిందటి పేరాలింపిక్స్ లో మొత్తం 19 మంది ఎథ్ లీట్ లు పాలుపంచుకొన్నారు.  టోక్యో ఒలంపిక్స్ కు 26 మంది పేరా ఎథ్ లీట్ లు అర్హత ను సాధించగా, మరో 16 మంది ఎథ్ లీట్ లు ఈ అర్హత ను పొందగలరన్న అంచనా ఉంది.  


 

***



(Release ID: 1724165) Visitor Counter : 192