రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

బ్యాటరీ వాహనాల నమోదు ధృవపత్రం జారీ లేదా పునరుద్ధరణ రుసుమును మినహాయించేందుకు ప్రతిపాదిస్తూ ముసాయిదా ప్రకటన జారీ చేసిన కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

Posted On: 01 JUN 2021 10:45AM by PIB Hyderabad

బ్యాటరీ వాహనాల (బీవోఏ) నమోదు ధృవపత్రం (ఆర్‌సీ) జారీ చేయడానికి లేదా పునరుద్ధరణకు, నూతన నమోదుకు రుసుమును మినహాయించే ముసాయిదా ప్రకటనను ఈ నెల 27వ తేదీన కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. 'కేంద్ర మోటారు వాహన నిబంధనలు-1989'కు సవరణ తెస్తూ, ఈ-రవాణాను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదన పట్ల ప్రజలకుగానీ, సంబంధిత వర్గాలకుగానీ అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే ప్రకటన విడుదలైన రోజు నుంచి 30 రోజులలోపు తెలియజేయాలని కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ కోరుతోంది. 
 

*****(Release ID: 1723365) Visitor Counter : 175