ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో చికిత్సలో ఉన్న కరోనా కేసులు 22,28,724 కు తగ్గుదల; గత 24 గంటల్లో తగ్గిన కేసులు 1,14,428

1.73 లక్షలతో గత 45 రోజుల దిగువకు చేరిన కొత్త కేసులు
రెండు రోజులుగా రోజువారీ కొత్త కేసులు 2 లక్షలలోపే

16 రోజులుగా కొత్తకేసుల కంటే కోలుకుంటున్నవారే అధికం
కోలుకున్నవారి శాతం మరింత పెరిగి 90.80% కి చేరిక

రోజువారీ పాజిటివిటీ 8.36%; 5 రోజులుగా 10% లోపు
పరీక్షల సామర్థ్యం పెంపు; ఇప్పటిదాకా దాదాపు 34.1 కోటి పరీక్షలు

Posted On: 29 MAY 2021 10:20AM by PIB Hyderabad

భారతదేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 22,28,724 కు తగ్గింది. గత 24 గంటలలో తగ్గిన సంఖ్య మే 10 తరువాత నమోదైన అతి పెద్ద సంఖ్య. గత 24 గంటలలో నికరంగా 1,14,428 కేసులు తగ్గాయి. ప్రస్తుతం ఇవి మొత్తం పాజిటివ్ కేసులలో  8.04% మాత్రమే. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0012N41.jpg

 రోజువారీ కొత్త కేసులు తగ్గుతూ ఉన్న క్రమంలో వరుసగా 13వ రోజుకూడా రోజుకు 3 లక్షలలోపు కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి. గత రెండు రోజులుగా రెండు లక్షలలోపే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో  1,73,790 కేసులు వచ్చాయి 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0022SIH.jpg

వరుసగా 16 రోజులుగా దేశంలో కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా నమోదవుతున్నారు. గత 24 గంటల్లో  2,84,601 మంది కోలుకోగా ఈ సంఖ్య అంతకు ముందు రోజుకంటే  1,10,811 ఎక్కువ కావటం గమనార్హం. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030KT2.jpg

కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా 2,51,78,011 కోవిడ్ బారి నుంచి బైటపడ్దారు. గత 24 గంటలలో  2,84,601  మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా కోలుకున్నవారి శాతం 90.80% గా నమోదైంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004S1NJ.jpg

గత 24 గంటలలో  20,80,048 కోవిడ్ పరీక్షలు జరగ్గా ఇప్పటిదాకా జరిపిన మొత్తం పరీక్షలు  34.11 కోట్లు.  ఒకవైపు పరీక్షల సంఖ్య పెరుగుతూ ఉండగా వారపు పాజిటివిటీ తగ్గుతోంది. ప్రస్తుతం అది 9.84% కాగా రోజువారీ పాజిటివిటీ ఈరోజు 8.36% గా నమోదైంది. వరుసగా ఐదు రోజులుగా ఇది 10% కంటే దిగువన ఉంది.   

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005CYV0.jpg

దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం వేగం పుంజుకోవటంతో మొత్తం టీకా డోసుల సంఖ్య  20.89 కోట్లు అయింది. 20 కోట్ల మైలురాయి వేగంగా దాటిన దేశాల్లో అమెరికా తరువాత స్థానం భారత దేశానిదే.  ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం  29,72,971 శిబిరాల ద్వారా ఇప్పటిదాకా 20,89,02,445 టీకా డోసుల పంపిణీ జరిగింది. అవి:

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

98,43,534

రెండో డోస్

67,60,010

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,54,62,813

రెండో డోస్

84,63,622

18-44 వయోవర్గం

మొదటి డోస్

1,67,66,581

 

రెండో డోస్

298

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

6,45,90,833

రెండో డోస్

1,03,52,228

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,81,15,492

రెండో డోస్

1,85,47,034

మొత్తం

20,89,02,445

 

 

***


(Release ID: 1722638) Visitor Counter : 164