ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఒక రోజులో 21.23 లక్షల కోవిడ్ పరీక్షలతో భారత్ సరికొత్త రికార్డ్ రోజుకు 20 లక్షల పరీక్షలు దాటటం వరుసగాఇది ఐదో రోజు


36 రోజుల తరువాత 2.4 లక్షల స్థాయికి తగ్గిన కొత్త కేసులు
రోజువారీ పాజిటివిటీ 11.34% కు తగ్గుదల

Posted On: 23 MAY 2021 11:25AM by PIB Hyderabad

గత 24 గంటలలో  21.23  లక్షలకు పైగా కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరపటంతో భారతదేశం ఒకరోజులో అత్యధిక కోవిడ్ పరీక్షలలో మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది.  పైగా వరుసగా రోజుకు 20 లక్షలకు పైగా పరీక్షలు జరపటం ఇది ఐదవ రోజు. భారత్ 2020 జనవరి తరువాత పరీక్షల సామర్థ్యం పెంచి రోజుకు 25 లక్షలు చేయగలిగే స్థితికి వచ్చింది.  గత 24 గంటలలో మొత్తం 21,23,782 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00159GH.jpg

రోజువారీ పాజిటివిటీ క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 11.34% కు చేరింది. వారం రోజుల పాజిటివిటీ 10 వతేదీ నుంచి తగ్గటం ఈ క్రింది చిత్రపటంలో చూడవచ్చు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0023I10.jpg

వరుసగా గడిచిన మూడు రోజుల్లో రోజుకు కొత్త కేసులు 3 లక్షలలోపే ఉండటం మరో సానుకూల పరిణామం. గత 24 గంటలలో  2,40,842 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 17న మాత్రమే ఈ స్థాయిలో 2.34 లక్షలమ్ కేసులు వచ్చాయి. అదే విధంగా కొత్తకేసుల కంటే కోలుకుంటున్నవారే ఎక్కువ ఉంటున్న పరిస్థితి వరుసగా తొమ్మిది రోజులుగా కనబడుతోంది. గత 24 గంటలలో 3,55,102 మంది కోలుకున్నారు. భారత్ లో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2,34,25,467 కు చేరుకోగా జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం  88.30% అయింది.

మరోవైపు దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య  28,05,399 కి తగ్గింది. గత 24 గంతలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా 1,18,001 తగ్గింది. ఇది దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో   10.57% . చికిత్సలో ఉన్న కేసులన్నిటిలో 66.88% వాటా ఏడు రాష్ట్రాలదే.   

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003B96N.jpg

జాతీయ స్థాయిలో కోవిడ్ కేసులలో మరణాల శాతం 1.13%. గత 24 గంటలలో 3,741 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇందులో పది రాష్ట్రాల వాటా 73.88% కాగా మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 682 మంది, కర్నాటకలో 451 మంది చనిపోయారు. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004XDJA.jpg

 మూడో దశ టీకాల కార్యక్రమం కూడా పుంకుకోవటంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన టీకాడోసుల సంఖ్య 19.5 కోట్లు దాటింది. మొత్తం 28,00,808 శిబిరాల ద్వారా  19,50,04,184 టీకా డొసులివ్వగా అందులో ఆరోగ్య సిబ్బంది అందుకున్న  97,52,900 మొదటి డోసులు, 67,00,614 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,49,52,345 మొదటి డోసులు, 83,26,534 రెండో డోసులు,  18-44 వయోవర్గపు లబ్ధిదారులు తీసుకున్న 99,93,908 మొదటీ డోసులు, 45-60 ఏళ్ళవారు తీసుకున్న  6,06,90,560 మొదటి డోసులు,  97,87,289 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,65,55,558 మొదటి డోసులు, 1,82,44,476 రెండో డోసులు ఉన్నాయి.  

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

97,52,900

రెండో డోస్

67,00,614

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,49,52,345

రెండో డోస్

83,26,534

18-44 వయోవర్గం

మొదటి డోస్

99,93,908

45-60 వయోవర్గం

మొదటి డోస్

6,06,90,560

రెండో డోస్

97,87,289

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,65,55,558

రెండో డోస్

1,82,44,476

మొత్తం

19,50,04,184

 

మొత్తం ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసులలో 66.27% కేవలం 10 రాష్ట్రాలే వాడుకున్నాయి. 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005AEIV.jpg

 ****



(Release ID: 1721048) Visitor Counter : 188