ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

టీకా డోసుల అందుబాటుపై జూన్ 15 వరకు రాష్ట్రాలకు కేంద్రం ముందస్తు సమాచారం


జిల్లావారీ టీకా కేంద్రాలు, పంపిణీ సమాచారాన్ని ప్రచారం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

టీకా కేంద్రాల దగ్గర రద్దీ నివారణకోసం కోవిన్ పోర్టల్ లో టీకా కేంద్రాలు ముందుగానే కాలెండర్లు ప్రచురించాలి

Posted On: 19 MAY 2021 12:13PM by PIB Hyderabad

సరళీకరించిన వేగవంతపు మూడోదశ  టీకాల కార్యక్రమం అమలు చేయటం మే 1 న ప్రారంభమైంది. ఈ వ్యూహంలో భాగంగా కేంద్ర ఔషధ ప్రయోగశాల ఆమోదం పొందిన టీకా తయారీదారులనుంచి 50%  డోసులు భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మిగిలినవి అంతకు ముందులాగానే పూర్తిగా ఉచితంగా రాష్ట్రాలు తీసుకోవటానికి వీలుంది. ఇది కాకుండా ప్రతి నెలా కేంద్ర ఔషధ శాల ఆమోదం పొందిన 50% టీకా డోసులను రాష్ట్రప్రభుత్వాలు, ప్రైవేట్ ఆస్పత్రులు నేరుగా కొనుగోలు చేయవచ్చు.

నెలలో రెండు పక్షాలూ టీకా డోసుల అందుబాటుపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ముందస్తు సమాచారం అందజేస్తోంది. అదే విధంగా తయారీదారులనుంచి నేరుగా కొనుగోలు చేసుకోవటానికి వీలున్న డోసుల సమాచారం కూడా ఇస్తోంది. నిన్న రాష్టాలు, జిల్లాల అధికారులతో కోవిడ్ పరిస్థితి మీద జరిగిన సమాలోచనల సందర్భంగా ప్రధాని ఈ విషయం ప్రత్యేకంగా వెల్లడించారు.

మే నెలలోను, జూన్ మొదటి పక్షంలోను అందుబాటులో ఉండే టీకా డోసుల ( కొవాక్సిన్, కోవిషీల్డ్) కేటాయింపు సమాచారంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మరోమారు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖరాసింది. అందులో భారత ప్రభుత్వ ద్వారా ఉచితంగా అందే టీకాల పరిమాణాన్ని, నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆస్పత్రులు కొనుగోలు చేసుకోవటానికి అవకాశమున్న పరిమాణాన్ని అందులో ప్రస్తావించింది. ఇలా ముందస్తు సమాచారం అందుబాటులో ఉండటం వలన రాష్టాలు తగిన విధంగా తమ నిల్వలను సమర్థంగా నిర్వహించుకునే అవకాశముంటుంది. 

రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు భారత ప్రభుత్వం ముందుగా అందజేసిన సమాచారం ప్రకారంమే 1 నుంచి జూన్ 15 వరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు  భారత ప్రభుత్వం ఉచితంగా 5,86, 29,000 అందజేస్తుంది. ఇవి కాకుండా టీకాల తయారీదారులనుంచి 4,87,55,000 డోసులు జూన్ ఆఖరులోగా రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేసుకోవటానికి అవకాశముంది.  

ఈ విధంగా స్పష్టంగా కాలపట్టిక ప్రకారం జూన్ చివరి దాకా అందుబాటులో ఉండే టీకా డోసుల సంఖ్య తెలియటం వలన అందుబాటులో ఉన్న డోసులను సమర్థంగా వినియోగించుకునే వీలుంటుంది. ఈ విషయంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు  ఈ విధంగా సూచించటమైనది:

1.      జిల్లావారీ కోవిడ్ టీకా కేంద్రంవారీగా టీకాలిచ్చే కార్యక్రమ ప్రణాళికను సిద్ధం చేయటం 

2.      ఈ సమాచారం పట్ల ప్రజలలో అవగాహన కల్పించటానికి అందుబాటులో ఉన్న బహుళ ప్రచార వేదికలను వాడకోవటం

3.      రాష్ట ప్రభుత్వ టీకా కేంద్రాలతోబాటు ప్రైవేట్ ఆస్పత్రుల టీకా కేంద్రాలు కూడా టీకాల కాలెండర్ ను కొవిన్ పోర్టల్ ప్రచురించటం ద్వారా అందరికీ ముందస్తు సమాచారం అందుబాటులో ఉంచటం 

4.      రాష్ట్రాలు, ప్రైవేట్ కోవిడ్ కేంద్రాలు ఏరోజుకారోజు  కాలెండర్ ప్రకటించకూడదు

5.      కోవిడ్ టీకా కేంద్రాల దగ్గర రద్దీ లేకుండా చూడాలి.

6.      కోవిన్ పోర్టల్ లో నమోదు చేసుకోవటం సునాయాసంగా సాగిపో వాలి

రాష్టాలు, కేంద్ర పాలితప్రాంతాలు తమ అధికారులు జూన్ 15 వరకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసేలా చూడాలనిఉ సూచించటమైనది.  .

దేశంలో వ్యాధి బారిన పడే అవకాశం మెండుగా ఉన్నవారిని కాపాడేందుకు ఎంచుకున్న ఒక ఆయుధం - టీకాల కార్యక్రమం. అందుకే దీన్ని ఒక ఉన్నత స్థాయి బృందం క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంటుంది

******



(Release ID: 1719913) Visitor Counter : 252