ప్రధాన మంత్రి కార్యాలయం
టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ శ్రీమతి ఇందూ జైన్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
13 MAY 2021 11:06PM by PIB Hyderabad
టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ శ్రీమతి ఇందూ జైన్ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో- ‘‘టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ శ్రీమతి ఇందూ జైన్ గారు తుదిశ్వాస విడిచారన్న వార్త నాకెంతో విచారం కలిగించింది. వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం, భారతదేశ ప్రగతిపైగల ప్రగాఢ ఆకాంక్ష, మన సంస్కృతిపై నిండైన ఆసక్తి తదితరాలకుగాను ఆమె చిరస్మరణీయులు. లోగడ ఆమెతో నా సంభాషణ సందర్భాలను గుర్తుచేసుకుంటూ, ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను... ఓం శాంతి’’ అని ప్రధాని పేర్కొన్నారు.
*****
DS/AKJ
(रिलीज़ आईडी: 1718538)
आगंतुक पटल : 116
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam