ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ హోమెన్ బోర్గోహైన్ కన్నుమూతపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 12 MAY 2021 12:52PM by PIB Hyderabad

   శ్రీ హోమెన్ బోర్గోహైన్ కీర్తిశేషులు కావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో ‘‘అస్సామీ సాహిత్యం, జర్నలిజానికి శ్రీ హోమెన్ బోర్గోహైన్ చేసిన ఎనలేని సేవలు, ఆయన కృషి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన రచనలు అస్సామీయుల జీవనం- సంస్కృతిలోని భిన్నకోణాలను ప్రతిబింబిస్తాయి. ఆయన తుదిశ్వాస విడిచారాన్న వార్త తీవ్ర విచారం కలిగించింది. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను... ఓం శాంతి!’’ అని ప్రధాని పేర్కొన్నారు.

 

 

***

DS/SH


(Release ID: 1718080) Visitor Counter : 135