ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లు, ఆక్సిజెన్ ప్లాంట్లు, 3 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు సహా అంతర్జాతీయ సాయం రాష్ట్రాలకు పంపిణీ
దేశవ్యాప్తంగా 17 కోట్ల మైలురాయి దాటిన కోవిడ్ టీకా డోసులు
అత్యంత వేగంగా 17 కోట్ల టీకాలిచ్చిన దేశంగా భారత్
18-44 వయోవర్గంలో 20.31 లక్షలమందికి టీకాలు
రోజువారీ కోలుకుంటున్నవారి సంఖ్య గత 10 రోజుల్లో 3.28 లక్షలు
Posted On:
10 MAY 2021 10:49AM by PIB Hyderabad
కోవిడ్ మీద పోరుకోసం భారత్ కు సాయంగా ప్రపంచవ్యాప్తంగా అందుతున్న సాయంలో భాగంగా ఇప్పటివరకూ 6,738 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్ల్లు, 3,856 ఆక్సిజెన్ సిలిండర్లు, 16 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు, 4,668 వెంటిలేటర్లు, 3 లక్షలకు పైగా రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు రాగా వాటిని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందజేశారు. ఈ క్రమంలో కస్టమ్స్ శాఖ అనుమతులు, రవాణామార్గాల అనుమతులు వేగంగా లభించేలా చర్యలు తీసుకున్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 17 కోట్ల మైలురాయి దాటింది. మూడో దశ తీకాలు కూడా ప్రారంభం కావటంతో వేగం పుంజుకుంది. అత్యంత వేగంగా టీకాలిస్తున్న దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. 17 కోట్ల టీకాలకు చైనాకు 119 రోజులు, అమెరికాకు 115 రోజులు పట్టిన సంగతి తెలిసిందే.

ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 24,70,799 శిబిరాల ద్వారా మొత్తం 17,01,76,603 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో ఆరోగ్య సిబ్బంది అందుకున్న 95,47,102 మొదటి డోసులు, 64,71,385 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,39,72,612 మొదటి డోసులు, 77,55,283 రెండో డోసులు, 18-45 వయోవర్గం వారు తీసుకున్న 20,31,854 మొదటి డోసులు, 45-60 వయవర్గం వారు తీసుకున్న 5,51,79,అ217 మొదటీ డోసులు, 65,61,851 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,36,74,082 మొదటి డోసులు, 1,49,83,217 రెండో డోసులు కలిసి ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
1వ డోస్
|
95,47,102
|
2nd Dose
|
64,71,385
|
కోవిడ్ యోధులు
|
1వ డోస్
|
1,39,72,612
|
2వ డోస్
|
77,55,283
|
18-44 వయోవర్గం
|
1వ డోస్
|
20,31,854
|
45 -60 వయోవర్గం
|
1వ డోస్
|
5,51,79,217
|
2వ డోస్
|
65,61,851
|
60 పైబడ్డవారు
|
1వ డోస్
|
5,36,74,082
|
2వ డోస్
|
1,49,83,217
|
|
మొత్తం
|
17,01,76,603
|
Ten states account for 66.79% of the cumulative doses given so far in the country.

ఆదివారం నాడు 18-44 వయోవర్గానికి చెందిన 2,46,269 మంది లబ్ధిదారులు కోవిడ్ టీకాలు తీసుకున్నారు. మొత్తం ఇప్పటిదాకా 30 రాష్టాలు, కేంద్రపాలితప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు 20,31,854 అందుకున్నట్టయింది. ఆ మొత్తం టీకాల వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.
సంఖ్య
|
రాష్గ్ట్రం
|
మొత్తం
|
1
|
అండమాన్- నికోబార్ దీవులు
|
904
|
2
|
ఆంధ్ర ప్రదేశ్
|
520
|
3
|
అస్సాం
|
80,796
|
4
|
బీహార్
|
88,743
|
5
|
చందీగఢ్
|
2
|
6
|
చత్తీస్ గఢ్
|
1,026
|
7
|
ఢిల్లీ
|
3,02,153
|
8
|
గోవా
|
1,126
|
9
|
గుజరాత్
|
2,94,785
|
10
|
హర్యానా
|
2,54,811
|
11
|
హిమాచల్ ప్రదేశ్
|
14
|
12
|
జమ్మూ-కశ్మీర్
|
28,658
|
13
|
జార్ఖండ్
|
82
|
14
|
కర్నాటక
|
10,782
|
15
|
కేరళ
|
209
|
16
|
లద్దాఖ్
|
86
|
17
|
మధ్యప్రదేశ్
|
29,322
|
18
|
మహారాష్ట్ర
|
4,36,302
|
19
|
మేఘాలయ
|
2
|
20
|
నాగాలాండ్
|
2
|
21
|
ఒడిశా
|
42,979
|
22
|
పుదుచ్చేరి
|
1
|
23
|
పంజాబ్
|
3,531
|
24
|
రాజస్థాన్
|
3,16,767
|
25
|
తమిళనాడు
|
14,153
|
26
|
తెలంగాణ
|
500
|
27
|
త్రిపుర
|
2
|
28
|
ఉత్తరప్రదేశ్
|
1,18,008
|
29
|
ఉత్తరాఖండ్
|
21
|
30
|
పశ్చిమ బెంగాల్
|
5,567
|
మొత్తం
|
20,31,854
|
గత 24 గంటలలో 6.8 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది. టీకాల కార్యక్రమం మొదలైన 114 వ రోజైన మే 9న 6,89,652 టీకాల పంపిణీ 5,685 శిబిరాల ద్వారా జరగగా, 4,05,325 మందికి మొదటి డోస్, 2,84,327 మందికి రెండో డోస్ ఇచ్చారు.
తేదీ : మే 9, 2021 (114వ రోజు)
ఆరోగ్య సిబ్బంది
|
1వ డోస్
|
4,897
|
2వ డోస్
|
7,192
|
కోవిడ్ యోధులు
|
1వ డోస్
|
26,082
|
2వ డోస్
|
21,599
|
18-44 వయోవర్గం
|
1వ డోస్
|
2,46,269
|
45 -60 వయోవర్గం
|
1వ డోస్
|
92,769
|
2వ డోస్
|
1,38,198
|
60 పైబడ్డవారు
|
1వ డోస్
|
35,308
|
2వ డోస్
|
1,17,338
|
మొత్తం
|
1వ డోస్
|
4,05,325
|
2వ డోస్
|
2,84,327
|
దేశంలో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,86,71,222 కు చేరింది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం
82.39%. గత 24 గంటలలో 3,53,818 మంది కోలుకోగా పది రాష్ట్రాలవాటా 74.38% ఉంది.

గత 10 రోజులుగా వరుసగా రోజుకు 3 లక్షలకు పైగా కోలుకున్నవారి సంఖ్య నమోదవటం చూడవచ్చు.

గడిచిన 24 గంటలలో 3,66,161 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో పది రాష్ట్రాల వాటా 73.91% కాగా మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 48,401, కర్నాటకలో 47,930, కేరళలో 35,801 కేసులు వచ్చాయి.

దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 37,45,237 కు చేరింది. ఇది దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో 16.53%. ని చికిత్సలో ఉన్నవారి సంఖ్య గత 24 గంటలలో నికరంగా 8,589 కేసుల పెరుగుదల నమోదు చేసుకుంది.ఇందులొ 13 రాష్ట్రాల వాటా 82.89%

జాతీయ స్థాయిలో కోవిడ్ కేసులలో మరణాల శాతం తగ్గుతూ ప్రస్తుతం 1.09% కు చేరింది. గత 24 గంటలలో 3,754 మంది కోవిడ్ తో చనిపోయారు. వీరిలో పది రాష్ట్రాలలో 72.86% మంది ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 572 మంది చనిపోగా కర్నాటకలో 490 మరణాలు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మూడు ఉండగా అవి డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, అరుణాచల్ ప్రదేశ్, లక్షదీవులు
****
(Release ID: 1717494)
Visitor Counter : 302
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam