ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ల కొనుగోలుకు కేంద్రం కొత్త ఆర్డర్లివ్వ‌డం లేదంటూ మీడియాలో వ‌చ్చిన‌ నివేదికలు తప్పు, పూర్తిగా అవాస్తవం

Posted On: 03 MAY 2021 1:50PM by PIB Hyderabad

కోవిడ్‌-19 వ్యాక్సిన్ల నిమిత్తం కేంద్రం ఎలాంటి సరికొత్త ఉత్తర్వులివ్వలేదని కొన్ని మీడియాల‌లో వివిధ  రిపోర్టులు ఇచ్చాయి. రెండు వ్యాక్సిన్ తయారీదారు సంస్థ‌ల‌తో (ఎస్ఐఐతో దాదాపు 100 మిలియన్ మోతాదులు, భారత్ బయోటెక్‌తో 20 మిలియన్ మోతాదులు) చివరి ఆర్డర్ మార్చి 2021లో చేసుకోవ‌డం జ‌రిగింద‌ని వార్తా రిపోర్టులు సూచిస్తున్నాయి. ఆయా మీడియా సంస్థ‌ల నివేదికలు పూర్తిగా తప్పు. పూర్తిగా వాస్తవ దూర‌మైన‌వి. మే, జూన్, జూలై నెలల్లో 11 కోట్ల మోతాదుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా నిమిత్తం నూటికి నూరు శాతం అడ్వాన్స్ రూపంలో దాదాపు రూ.1732.50 కోట్ల‌ (టీడీఎస్ రూ.1699.50 కోట్లు) సొమ్మును 28.04.2021వ తేదీన ప్ర‌భుత్వం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) కు విడుదల చేసింది. ఈ మొత్తం సొమ్మును ఎస్ఐఐ 28.04.2021న ఈ సొమ్మును అందుకుంది. 10కోట్ల మేర కోవీషీల్డ్ మోతాదుల వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా నిమిత్తం చేసిన చివరి ఆర్డర్‌లో భాగంగా.. 03.05.2021 నాటికి 8.744 కోట్ల మోతాదుల వ్యాక్సిన్‌ పంపిణీ జ‌రిగింది. దీనికి అద‌నంగా మే, జూన్, జూలై నెలల అవ‌స‌రాల‌ మేర‌కు 05 కోట్ల కోవాక్సిన్ స‌ర‌ఫ‌రాకు గాను భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్‌ (బీబీఐఎల్) సంస్థ‌కు ప్ర‌భుత్వం 28.04.2021న 100% అడ్వాన్స్‌గా దాదాపు రూ. 787.50 కోట్ల‌ (టీడీఎస్ తరువాత రూ. 772.50 కోట్లు) సొమ్మును విడుదల చేశారు. దీనిని సంస్థ 28.04.2021న అందుకున్నారు. దాదాపు 02 కోట్ల మోతాదుల కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ సరఫరాకు ఇచ్చిన ఆర్డర్‌లో భాగంగా 03.05.2021 నాటికి 0.8813 కోట్ల మోతాదుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఈ నేప‌థ్యంలో భారత ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలు నిమిత్తం తాజాగా ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పడం సరైనది కాదు. ఈ నెల 2వ తేదీ (మే 2, 2021) నాటికి ప్రభుత్వం రాష్ట్రాలు/ కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు దాదాపు 16.54కోట్ల టీకాల మోతాదులను ఉచితంగా అందించింది. రాష్ట్రాలు / యుటీల వ‌ద్ద‌ ఇంకా 78 లక్షలకు పైగా మోతాదుల‌లో వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే 3 రోజుల్లో అదనంగా 56 లక్షలకు పైగా మోతాదులలో రాష్ట్రాలు / యూటీలకు చేర‌నున్నాయి. లిబరలైజ్డ్ ప్రైసింగ్ & యాక్సిలరేటెడ్ నేషనల్ కోవిడ్-19 టీకా వ్యూహం కింద భారత ప్రభుత్వం నెలవారీ సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ (సీడీఎల్) క్లియర్ చేసిన వ్యాక్సిన్లలో 50% వాటాను స‌ర్కారు కొనుగోలు చేస్తోంది. దానిని పూర్తిగా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులోకి తెస్తోంది. 

***

 



(Release ID: 1715859) Visitor Counter : 252