ప్రధాన మంత్రి కార్యాలయం

జపాన్ ప్రధాని శ్రీ సుగా యోశీహిదే తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


Posted On: 26 APR 2021 2:13PM by PIB Hyderabad

జపాన్ ప్రధాని శ్రీ సుగా యోశీహిదే తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న, అంటే సోమవారం నాడు, ఫోన్ ద్వారా మాట్లాడారు.

నేత లు ఉభయులూ వారి వారి దేశాల లో కోవిడ్-19 స్థితి ని గురించి చర్చించడమే కాకుండా ఈ విశ్వమారి ప్రాంతీయ స్థాయి లో, ప్రపంచ స్థాయి లో రువ్వుతున్న వివిధ సవాళ్ల ను గురించి ఒకరి అభిప్రాయాల ను మరొకరి కి తెలియజెప్పుకొన్నారు కూడా. ఈ సవాళ్ల ను అధిగమించడం కోసం భారతదేశం, జపాన్ ల మధ్య సన్నిహిత సహకారం ప్రముఖ పాత్ర ను పోషించగలదంటూ వారు ప్రస్తావించారు. ప్రతిఘాతకత్వాన్ని, వివిధత్వాన్ని కలిగివుండేటటువంటి, విశ్వసనీయం అయినటువంటి సప్లయ్ చైన్ లను ఏర్పాటు చేయడం కోసం, మహత్వపూర్ణమైన సామగ్రి ని, టెక్నిక్ ల ను ఆధారపడదగిన రీతి లో ఇచ్చి పుచ్చుకొంటూ ఉండడం కోసం, తయారీ లోను, నైపుణ్యాల వికాసం లోను కొత్త భాగస్వామ్యాలను అభివృద్ధిపరచడం వంటి కార్యాల సాధన కు కలసి పనిచేయాలి అని నేత లు స్పష్టం చేశారు. ఈ సందర్భం లో, ఇద్దరు నేత లు వారి వారి బలాలను మేళవించడం కోసం, ఇరుపక్షాల కు లాభదాయకమైన ఫలితాల ను దక్కించుకోవడానికి స్పెసిఫైడ్ స్కిల్ డ్ వర్కర్ స్ (ఎస్ఎస్ డబ్ల్యు) అగ్రిమెంటు ను త్వరగా కార్యరూపం లోకి తీసుకు రావలసిన అవసరం ఎంతయినా ఉందన్నారు. ముంబయి-అహమదాబాద్ హై స్పీడ్ రైల్ (ఎమ్ఎహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టు ను వారి సహకారం తాలూకు ఒక ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణ గా కూడా వారు ప్రముఖంగా పేర్కొన్నారు; ఆ ప్రాజెక్టు క్రమయుక్తంగా పురోగమిస్తూ ఉండడాన్ని వారు స్వాగతించారు.

కోవిడ్-19 మహమ్మారి కాలం లో ఒక దేశ పౌరుల కు మరొక దేశం అందించినటువంటి సాయాన్ని, సౌకర్యాలను నేత లు ఇరువురు అభినందించారు; ఈ విధమైన సమన్వయాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని వారు సమ్మతి ని వ్యక్తం చేశారు.

విశ్వమారి తో పోరాడడం లో భారతదేశానికి సహాయాన్ని అందిస్తున్నందుకు ప్రధాని శ్రీ సుగా యోశీహిదే కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలను కూడా తెలియజేశారు. సమీప భవిష్యత్తు లో కోవిడ్-19 స్థితి ఒక కొలిక్కి వచ్చిందా అంటే ప్రధాని శ్రీ సుగా యోశీహిదే భారతదేశానికి విచ్చేసే సందర్భం లో ఆయన కు తాను స్వాగతం పలుకగలుగుతానన్న ఆశాభావాన్ని సైతం శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

***



(Release ID: 1714191) Visitor Counter : 265