ప్రధాన మంత్రి కార్యాలయం
వారాణసీ లో కోవిడ్-19 పై ప్రాంతీయ ప్రజా ప్రతినిధులతో, అధికారులతో మాట్లాడిన ప్రధాన మంత్రి
పాలన యంత్రాంగం అత్యంత సూక్ష్మ దృష్టి తో
వారాణసీ ప్రజలకు సాధ్యమైన అన్నివిధాలుగాను సహాయాన్ని అందించాలి: ప్రధాన మంత్రి
‘రెండు గజాల దూరం.. మాస్క్ ధరించడం’ అనే నియమాల ను పాటించాలి; 45 ఏళ్ల వయస్సు పైబడిన అందరికీ టీకామందును వేయించడానికి పాలనయంత్రాంగం చొరవ తీసుకోవాలి: ప్రధాన మంత్రి
‘ట్రాకింగ్, ట్రేసింగ్ ఎండ్ టెస్టింగ్’ పట్ల మళ్లీ శ్రద్ధ వహించడం ముఖ్యం, తొలి వేవ్ మాదిరిగానే ఈ రెండో వేవ్ తో పోరాడటం కూడా ఎంతో ముఖ్యం
కోవిడ్ సంక్రమణ నుంచి రక్షణ కు ప్రభుత్వం, సమాజం.. రెండిటి సహకారం తప్పనిసరి: ప్రధాన మంత్రి
Posted On:
18 APR 2021 1:07PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వారాణసీ జిల్లా లో కోవిడ్-19 స్థితి పై వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమీక్ష ను నిర్వహించారు. సమావేశం సాగిన క్రమం లో కరోనా బారి నుంచి కాపాడుకోవడం తో పాటు కరోనా సోకిన రోగులకు సముచిత చికిత్స ను అందించడానికి గాను నిర్ధారణ పరీక్షలు, పడక ల అందుబాటు, మందులు- టీకాలు, మానవ వనరుల గురించి ప్రధాన మంత్రి కి వివరాలను తెలియజేయడమైంది. ఆయన ప్రజల కు అన్నివిధాలుగాను అవసరమైన సహాయాన్ని త్వరగా అందించవలసిందిగా అధికారులకు ఆదేశించారు.
ప్రతి ఒక్కరు ‘‘రెండు గజాల దూరం, మాస్కు ను ధరించడం’’ అనే నియమాలను తప్పనిసరిగా పాటించాలని చర్చ లో భాగం గా ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. టీకాకరణ కార్యక్రమం ప్రాధాన్యాన్ని వివరిస్తూ, 45 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్కరి కి తప్పకుండా టీకామందును ఇచ్చేలా చూసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వారాణసీ జిల్లావాసులందరికీ అత్యంత సూక్ష్మదృష్టి తో అవసరమైన అన్ని రకాల సహాయం అందించాలని ఆయన సూచించారు.
దేశం లోని వైద్యుల కు, వైద్య సిబ్బంది కి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో కృతజ్ఞతలను వ్యక్తం చేస్తూ ఇటువంటి సంక్షోభ సమయంలోనూ వారు వారి కర్తవ్యాన్ని నిష్ఠ తో నిర్వర్తిస్తున్నారన్నారు. మనం కిందటి ఏడాది లో ఎదురైన అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకొని, అప్రమత్తం గా ఉండూ ముందుకు సాగిపోవాలి అని ఆయన అన్నారు.
వారాణసీ కి ప్రతినిధి అయిన తాను, సాధారణ ప్రజానీకం నుంచి కూడా నిరంతరం సమాచారాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రధాన మంత్రి వెల్లడించారు. వారాణసీలో గడచిన 5-6 సంవత్సరాలు వైద్యపరంగా మౌలిక సదుపాయాల విస్తరణ-ఆధునికీకరణ చేపట్టడం వల్ల కరోనా పై పోరు లో తోడ్పాటు లభించింది అని ఆయన పేర్కొన్నారు. వారాణసీ లో వైద్య సదుపాయాల మెరుగుదల సహా పడక ల ను, ఐసీయూ సౌకర్యాన్ని, ఆక్సిజన్ లభ్యత ను కూడా పెంచడం జరుగుతోందన్నారు. వ్యాధి పీడితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నందున అన్ని స్థాయులలోనూ ఒత్తిడి ని తట్టుకునేలా అన్ని చర్యలనూ ముమ్మరం చేయవలసి ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. వారాణసీ పాలన యంత్రాంగం ‘‘కాశీ కోవిడ్ రిస్ పాన్స్ సెంటర్’’ ఏర్పాటు లో ఏ విధమైన వేగాన్ని ప్రదర్శించిందో, అదే మాదిరి వేగాన్ని ప్రతి ఒక్క పని లో కూడాను ప్రదర్శించాలి అని ఆయన అన్నారు.
మహమ్మారి వంటి వైరస్‌ల పై విజయం దిశ గా తొలి దశ తరహా లోనే మలి దశ లోనూ ‘టెస్ట్, ట్రాక్ ఎండ్ ట్రీట్’ వ్యూహం తో పోరు ను కొనసాగించవలసి ఉందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. అదే సమయం లో వ్యాధిగ్రస్తులను కలసిన వారందరి జాడ ను వీలైనంత వేగం గా కనుగొని, పరీక్షల నిర్వహణ కు ప్రాధాన్యాన్ని ఇవ్వాలి అని ఆయన స్పష్టం చేశారు. వ్యాధి పీడితులు, ఇంటి వద్ద నిర్బంధ వైద్య పర్యవేక్షణ లో గల వారి కుటుంబ సభ్యుల విషయంలో అన్ని బాధ్యతలనూ నిర్వర్తించాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. ఈ చర్యల సమయం లో అత్యంత సూక్ష్మదృష్టి తో వ్యవహరించవలసిన అవసరాన్ని గుర్తించాలని మరీ మరీ చెప్పారు.
వారాణసీ లో స్వచ్ఛంద సంస్థ లు ప్రశంసనీయమైన విధం గా ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి అని ప్రధాన మంత్రి కొనియాడుతూ, అలాంటి సంస్థల ను అధికార యంత్రాంగం మరింత ప్రోత్సహించాలని సూచన చేశారు. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దడంలో పటిష్ఠమైన నిఘా, నిశిత దృష్టి అవసరం అని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ బారి నుంచి కాపాడుకోవడం- చికిత్స లకు సంబంధించి చేసిన వివిధ ఏర్పాటులను గురించి వారాణసీ ప్రాంతీయ ప్రజా ప్రతినిధులు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాన మంత్రి కి నివేదించారు. వ్యాధిగ్రస్తుల తో సంబంధాలు ఉన్న వారి జాడ తీసేందుకు కంట్రోల్ రూములతో పాటు నిర్బంధ గృహ వాసం లో చికిత్స పర్యవేక్షణ కు గాను కమాండ్ కంట్రోల్ సెంటర్ ల ను ఏర్పాటు చేసిన సంగతి ని ప్రధాన మంత్రి దృష్టి కి వారు తీసుకువచ్చారు. అలాగే ఏమ్ బ్యులన్స్ వసతి కల్పన కు ప్రత్యేకమైనటువంటి ఫోన్ నంబరు, కంట్రోల్ రూము ల నుంచి టెలిమెడిసిన్ సదుపాయం, పట్టణ ప్రాంతాల లో అదనం గా ర్యాపిడ్ రిస్ పాన్స్ టీమ్ నియామకం వగైరాలను గురించి ప్రధాన మంత్రి కి తెలియజేయడమైంది. కోవిడ్ నియంత్రణ లో భాగంగా ఇప్పటి వరకు 1,98,383 మంది వ్యక్తులకు ఒకటో మోతాదు టీకామందు ను, 35,014 మంది వ్యక్తులకు టీకా మందు తాలూకు రెండో మోతాదు ను ఇవ్వడం పూర్తి అయిందని ప్రధాన మంత్రి కి తెలియజేయడం జరిగింది.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్ ఎల్ సి/ కోవిడ్ వారాణసీ ఇన్ చార్జి శ్రీ ఎ.కె.శర్మ, జోనల్ హెడ్ శ్రీ దీపక్ అగ్రవాల్, పోలీస్ కమిషనర్ శ్రీ ఎ. సతీశ్ గణేశ్, జిల్లా కలెక్టర్ శ్రీ కౌశల్ రాజ్ శర్మ, మ్యూనిసిపల్ కమిశనర్ శ్రీ గౌరాంగ్ రాఠీ, ముఖ్య చికిత్స అధికారి డాక్టర్ ఎన్.పి. సింహ్, ఐఎమ్ ఎస్- బిహెచ్ యు సంచాలకులు ప్రొఫెసర్ బి.ఆర్. మిత్తల్ , రాష్ట్ర మంత్రులు శ్రీ నీలకంఠ్ తివారీ, శ్రీ రవీంద్ర జాయస్ వాల్, రోహనియా ఎమ్ ఎల్ ఎ శ్రీ సురేంద్ర నారాయణ్ సింహ్, ఎమ్ ఎల్ సి శ్రీ అశోక్ ధవన్, ఎమ్ ఎల్ సి శ్రీ లక్ష్మణ్ ఆచార్య పాల్గొన్నారు.
***
(Release ID: 1712565)
Visitor Counter : 246
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam