ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

9.43 కోట్లు దాటిన మొత్తం కోవిడ్ టీకాలు

గత 24 గంటలలో 36 లక్షలకు పైగా టీకాలు
10 రాష్ట్రాలలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
చికిత్సపొందుతున్న కేసులలో 5 రాష్ట్రాలవాటా 73%

Posted On: 09 APR 2021 12:07PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాలు తీసుకున్నవారి సంఖ్య 9.43 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 14,28,500 శిబిరాల ద్వారా 9,43,34,262 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో 89,74,511 మొదటి డోసులు తీసుకున్న ఆరోగ్య సిబ్బంది, 54,49,151 రెండో డోసులు తీసుకున్న ఆరోగ్య సిబ్బంది. 98,10,164 మొదటి డోసులు తీసుకున్న కోవిడ్ యోధులు,   45,43,954  రెండో డోస్ తీసుకున్న కోవిడ్ యోధులు, 3,75,68,033 డోసుల మొదటి డోస్ తీసుకున్న 65 ఏళ్లు పైబడ్డవారు,  13,61,3672 డోసులు రెండో డోస్ గా తీసుకున్న 60 ఏళ్ళు పైబడ్డవారు ఉన్నారు. అదే విధంగా 45-60 ఏళ్ళ మధ్య ఉన్న వారి  2,61,03,814 మొదటి డోసులు, 5,23,268 రెండో డోసులు ఉన్నాయి.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య వయసులు

 60 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

89,74,511

54,49,151

98,10,164

45,43,954

2,61,03,814

5,23,268

3,75,68,033

13,61,367

9,43,34,262

 

ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలలో 60 శాతం కేవలం 8 రాష్ట్రాలలోనే ఉండటం గమనార్హం.  

 

గత 24 గంటలలో 36 లక్షలకు పైగా కొకోవిడ్ టీకాలిచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన 83వ రోజు ఏప్రిల్ 8న  36,91,511 టీకా డోసులివ్వగా అందులో  32,85,004 మంది లబ్ధిదారులు  శిబిరాలద్వారా 49,416 మొదటి డోస్ అందుకోగా  4,06,507 మంది రెండో డోస్ తీసుకున్నారు. 

తేదీ: ఏప్రిల్ 8, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళమధ్య ఉన్నవారు

 60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

5,792

28,897

41,462

1,26,651

21,67,078

51,231

10,70,672

1,99,728

32,85,004

4,06,507

 

ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన రోజువారీ కోవిడ్ టీకాల దృష్ట్యా చూస్తే భారతదేశం రోజువారీ సగటు  37,94,328టీకా డొసులతో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉంది.  

భారత దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. గత 24 గంటలలో 1,31,968 కొత్త కేసులు నమోదయ్యాయి. పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, చత్తీస్ గఢ్,  ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ పెరుగుదల నమోదు చేస్తున్నాయి. కొత్త కేసులలో 83.29% ఈ రాష్ట్రాలకు చెందినవే.   ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా  56,286 కేసులు రాగా చత్తీస్ గఢ్ లో 10,652, ఉత్తరప్రదేశ్ లో 8,474 కేసులు వచ్చాయి.

 

క్రింద చూపిన విధంగా పన్నెండు రాష్ట్రాలు కోవిడ్ కేసుల పెరుగుదల చూపుతున్నాయి.  

 

 

 

 

రోజువారీ పాజిటివ్  కేసులను వ్యాధి నిర్థారణ పరీక్షలను ఈ క్రింది చిత్రపటం చూపుతోంది

 

 

 

 

దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య 9,79,608 కి చేరింది. ఇది ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులలో 7.50%.  గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కేసుల పెరుగుదల  నికరంగా  69,289 గా నమోదైంది. ఈ కేసులలో 73.24%  కేవలం ఐదు రాష్ట్రాలలో – మహారాష్ట్ర, చత్తీఎస్ గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, కేరళలో నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే  53.84% కేసులు నమోదయ్యాయి.

 

 


దేశవ్యాప్తంగా కోవిడ్ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య  1,19,13,292  కాగా జాతీయ స్థాయిలో కోలుకున్న శాతం 91.22%.

గడిచిన 24 గంటలలో 61,899  మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. 

గత 24 గంటలలో 780 మంది కోవిడ్ తో మరణించారు.  ఇందులో 10 రాష్ట్రాలవాటా 92.82%. ఒక్క మహారాష్ట్రలోనే   376 మంది మరణించగా చత్తీస్ గఢ్ లో 94 మంది కోవిడ్ తో చనిపోయారు.

 

 

 

పన్నెండు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో ఒక్క కొవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: రాజస్థాన్, ఒడిశా, పుదుచ్చేరి, లద్దాఖ్, డామన్-డయ్యూ,  దాద్రా-నాగర్ హవేలి, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మిజోరం, లక్షదీవులు, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్

 

***(Release ID: 1710641) Visitor Counter : 110