ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 9 కోట్లు దాటిన కోవిడ్ టీకా డోసులు;
గత 24 గంటల్లోనే 30 లక్షలకు పైగా టీకాలు
రోజుకు సగటున 34 లక్షల టీకాలతో ప్రపంచంలోనే భారత్ ముందంజ
10 రాష్ట్రాలలో పెరుగుతున్న కోవిడ్ కేసులు;
పాజిటివ్ శాతం 2.19% నుంచి 8.40% కు పెరుగుదల
Posted On:
08 APR 2021 11:29AM by PIB Hyderabad
ప్రపంచాన్ని వణికిస్తున్నకరోనా మహమ్మారి మీద పోరులో భాగంగా జనవరి 16 నుంచి వేస్తున్న టీకాలలో భారత్ మరో మైలురాయి దాటింది. దేశమంతటా వేసిన టీకా డోసుల సంఖ్య 9 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 13,77,304 శిబిరాల ద్వారా 9,01,98,673 టీకా డోసుల పంపింఈ జరిగింది. ఇందులో 89,68,151 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు, 54,18,084 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన రెండో డోసులు, 97,67,538 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు, 44,11,609 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన రెండో డోసులు, 3,63,32,851 డోసులు 60 ఏళ్ళు పైబడ్డ వారికిచ్చిన మొదటి డోసులు, 11,39,291 డోసులు 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన రెండో డోసులు, 2,36,94,487 డోసులు 45-60 ఏళ్ళ మధ్యనున్న వారి మొదటి డోసులు, 4,66,662 డోసులు 45-60 ఏళ్ళ మధ్యనున్నవారి రెండో డోసులు కలిసి ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 ఏళ్ళు పైబడ్డవారు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
89,68,151
|
54,18,084
|
97,67,538
|
44,11,609
|
2,36,94,487
|
4,66,662
|
3,63,32,851
|
11,39,291
|
9,01,98,673
|
ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ డోసులలో 60% వాటా ఎనిమిది రాష్ట్రాలదే కావటం గమనార్హం.
గత 24 గంటలలో దాదాపు 30 లక్షల టీకా డోసుల పంపిణీ జరిగింది. టీకాల కార్యక్రమం మొదలైన 82వ రోజైన ఏప్రిల్ 7 నాడు 29,79,292 టీకాలివ్వగా అందులో 26,90,031మంది లబ్ధిదారులు 38,760 శిబిరాలద్వారా మొదటి డోస్ అందుకోగా 2,89,261 మంది రెండో డోస్ అందుకున్నారు.
తేదీ: ఏప్రిల్ 7, 2021 (82 వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ మధ్య వారు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
|
3,956
|
22,341
|
30,319
|
97,509
|
17,62,503
|
33,816
|
8,93,253
|
1,35,595
|
26,90,031
|
2,89,261
|
|
రోజువారీ అందిస్తున్న టీకాల సంఖ్య పరంగా భారతదేశం రోజుకు సగటున 34,30,502 టీకా డోసులిస్తూ మొదటి స్థానంలో ఉంది.
దేశంలో రోజువారీ కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటలలో కొత్తగా 1,26,789 కరోనా కేసులు నమోదయ్యాయి. పది రాష్టాలు - మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కేరళ, పంజాబ్ లలో కేసుల పెరుగుదల నమోదవుతూ ఉంది. 84.21% కొత్త కేసులు ఈ పది రాష్ట్రాలవే. మహారాష్టలో అత్యధికంగా 59,907 కేసులు రాగా, చత్తీస్ గఢ్ లో 10,310, కర్నాటకలో 6,976 కొత్త కేసులు వచ్చాయి.
ఈ దిగువ చూపిన విధంగా 12 రాష్ట్రాలలో కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి.
మార్చి, ఏప్రిల్ నెలల మొదటి వారాల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాజిటివ్ శాతం లో మార్పును ఈ దిగువ చిత్రపటం చూపుతోంది. జాతీయ స్థాయ్ పాజిటివ్ శాతం 6.21% కాగా అదే కాలంలో పెరుగుదల 2.19% నుంచి 8.40% కి చేరింది.
భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య 9,10,319 కి చేరింది. ఇది ఇప్పటిదాకా నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో7.04% నికరంగా పెరిగిన చికిత్సలోని కేసులు గత 24 గంటలలో 66,846 అయ్యాయి. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలే మొత్తం చికిత్సలో ఉన్న కేసులలో 74.13% వాటా ఉండటం గమనార్హం. ఒక్క మహారాష్టలోనే 55.26% మంది చికిత్సలో ఉన్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ నుంచి కోలుకొని బైటపడ్డవారు 1,18,51,393 మంది కాగా జాతీయ స్థాయిలో కోలుకున్నవారు 91.67%. గత 24 గంటలలో కోలుకున్నవారు 59,258.
గడిచిన 24 గంటలలో కోవిడ్ మరణాలు 685 నమోదయ్యాయి. ఇందులో పది రాష్ట్రాలవాటా 87.59% కాగా ఒక్క మహారాష్ట్రలోనే 322 మంది, పంజాబ్ లో 62 మంది చనిపోయారు.
గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 12 ఉన్నాయి. అవి: అస్సాం, లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్, లక్షదీవులు, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్
***
(Release ID: 1710448)
Visitor Counter : 294
Read this release in:
Bengali
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam