ప్రధాన మంత్రి కార్యాలయం

డాక్ట‌ర్ హ‌రేకృష్ణ మ‌హ‌తాబ్ ర‌చించిన ఒడిశా ఇతిహాస్ తాలూకు హిందీ గ్రంథాన్ని ఈ నెల 9న ఆవిష్క‌రించ‌నున్న ప్ర‌ధాన మంత్రి‌

Posted On: 07 APR 2021 1:00PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని జ‌న్‌ప‌థ్ లో గ‌ల ఆంబేడ్క‌ర్ ఇంట‌ర్‌నేశనల్ సెంట‌ర్ లో ఈ నెల 9వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల కు ‘ఒడిశా ఇతిహాస్’ గ్రంథం తాలూకు హిందీ అనువాదాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు.  ఈ పుస్త‌కాన్ని ‘ఉత్క‌ళ్ కేస‌రి’  డాక్ట‌ర్ హ‌రేకృష్ణ మ‌హ‌తాబ్ ర‌చించారు.  ఇంత‌వ‌ర‌కు ఒడియా, ఇంగ్లీషు భాషల లో ల‌భ్య‌మ‌వుతున్న ఈ పుస్త‌కాన్ని శ్రీ శంక‌ర్‌లాల్ పురోహిత్ హిందీ లోకి అనువాదం చేశారు.  ఈ సంద‌ర్భం లో కేంద్ర మంత్రి శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ తో పాటు, క‌ట‌క్ లోక్ స‌భ స‌భ్యుడు శ్రీ భ‌ర్తృహరి మహతాబ్ లు కూడా పాలుపంచుకోనున్నారు.  హిందీ అనువాద గ్రంథం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని హ‌రేకృష్ణ మ‌హ‌తాబ్ ఫౌండేష‌న్ ఏర్పాటు చేసింది.  

ర‌చ‌యిత ను గురించిన వివ‌రాలు

డాక్ట‌ర్ హ‌రేకృష్ణ మ‌హ‌తాబ్ భార‌త‌దేశ స్వాతంత్రోద్య‌మం లో ఎన్న‌ద‌గిన వ్య‌క్తుల‌ లో ఒక‌రు.  ఆయ‌న 1946 నుంచి 1950 వ‌ర‌కు, అలాగే 1956 నుంచి 1961 వ‌ర‌కు ఒడిశా కు ముఖ్య‌మంత్రి గా సేవ‌లు అందించారు.  1942-1945 మ‌ధ్య కాలం లో రెండు సంవ‌త్స‌రాల కు పైగా ఆయ‌న అహ‌మ‌ద్ న‌గ‌ర్ పోర్ట్ జైలు లో ఉన్నప్పుడు ‘ఒడిశా ఇతిహాస్’ పుస్త‌కాన్ని రాశారు.

 


 

***
 



(Release ID: 1710080) Visitor Counter : 163