ప్రధాన మంత్రి కార్యాలయం

ఈ నెల 7 న‌ ‘‘ప‌రీక్షా పే చ‌ర్చా 2021’’ లో విద్యార్థుల తో, గురువుల తో, త‌ల్లితండ్రుల తో మాట్లాడ‌నున్న ప్ర‌ధాన ‌మంత్రి

Posted On: 05 APR 2021 10:46AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 7వ తేదీ న రాత్రి 7 గంట‌ల కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా జరిగే ‘‘ప‌రీక్షా పే చ‌ర్చా 2021’’ కార్య‌క్ర‌మం లో భాగం గా ప్రపంచవ్యాప్త  విద్యార్థుల తోను, గురువుల తోను, త‌ల్లితండ్రుల తోను మాట్లాడనున్నారు.

 

‘‘సాహ‌సికులైన మన #ExamWarriors తో, త‌ల్లితండ్రుల తో, గురువుల తో ఒక కొత్త న‌మూనా లో అనేక విష‌యాల ను గురించి ఆసక్తి ని రేకెత్తించేటటువంటి ప్రశ్నల తో ఓ స్మ‌ర‌ణీయ‌మైన చ‌ర్చ చోటు చేసుకోనుంది. 

 

ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 7 గంట‌ల కు ‘పరీక్షా పే చ‌ర్చ’ కార్యక్రమాన్ని చూడ‌గ‌ల‌రు... #PPC2021 ’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 

****(Release ID: 1709598) Visitor Counter : 21