ప్రధాన మంత్రి కార్యాలయం
బాపూజీ-బంగబంధు డిజిటల్ ప్రదర్శనను ప్రారంభించిన ప్రధానమంత్రి
Posted On:
26 MAR 2021 9:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని గౌరవనీయులైన షేక్ హసీనాతో కలసి ‘బాపూజీ-బంగబంధు’ డిజిటల్ ప్రదర్శనను ప్రారంభించారు. దక్షిణాసియా ప్రాంత దేశాలకు చెందిన ‘బాపూజీ, బంగబంధు’ ఇద్దరూ సకల మానవాళికీ ఆదర్శప్రాయులైన నాయకులు కాగా... వారి ఆలోచనా విధానం, సందేశాలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంటాయి.
ఈ ప్రదర్శన సంరక్షక అధికారి శ్రీ బిరాద్ యాజ్ఞిక్ దేశాధినేతలిద్దరికీ ఇందులోని విశేషాలను విశదీకరించగా, షేక్ రెహనా కూడా వారితో కలసి ప్రదర్శనను సందర్శించారు.
***
(Release ID: 1708071)
Visitor Counter : 117
Read this release in:
Marathi
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam