మంత్రిమండలి

క్రీడ‌ లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల లో స‌హకారం అంశం పై భార‌త‌దేశాని కి, మాల్దీవ్స్ కు మ‌ధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి‌

Posted On: 16 MAR 2021 4:01PM by PIB Hyderabad

క్రీడ‌ లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల లో భార‌త గ‌ణ‌తంత్రానికి చెందిన యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ శాఖ కు, మాల్దీవ్స్ గ‌ణ‌తంత్రానికి చెందిన యువ‌త‌, క్రీడ‌లు, స‌ముదాయ సాధికారిత మంత్రిత్వ శాఖ కు మ‌ధ్య సంతకాలు జ‌రిగిన ఒక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎమ్ఒయు) ను గురించిన వివ‌రాల‌ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం దృష్టి కి తీసుకు రావ‌డ‌మైంది.  ఈ ఎమ్ఒయు పై 2020వ సంవత్స‌రం న‌వంబ‌రు నెల‌ లో సంతకాలు అయ్యాయి.

ఉద్దేశ్యాలు:
 
భార‌త‌దేశాని కి, మాల్దీవు ల‌కు మ‌ధ్య క్రీడ‌ లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల రంగం లో ద్వైపాక్షిక ఆదాన ప్ర‌దాన కార్య‌క్ర‌మాల తో క్రీడా విజ్ఞానం, క్రీడ‌ ల‌కు సంబంధించిన మందులు, శిక్ష‌ణ కు సంబంధించిన మెలకువ లు, యువ‌జ‌నోత్స‌వాల లోను, శిబిరాల లోను పాలుపంచుకొనే కారణంగా ఈ రంగం లో జ్ఞానాన్ని, ప్రావీణ్యాన్ని పెంచుకోవడం లో తోడ్పాటు లభించగలదు.  దీని ద్వారా అంత‌ర్జాతీయ ఆట‌ల పోటీల లో మ‌న క్రీడాకారుల ప్ర‌ద‌ర్శ‌న మెరుగుపడగలదు; అలాగే భార‌తదేశాని కి, మాల్దీవుల కు మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప‌టిష్టం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.  

ప్ర‌యోజ‌నాలు:

క్రీడ లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల రంగం లో మాల్దీవుల తో  ద్వైపాక్షిక స‌హ‌కారం ఫ‌లితం గా స‌మ‌కూరే ప్ర‌యోజ‌నాలు క్రీడాకారులు అంద‌రికీ వారు ఏ కులానికి, ఏ వ‌ర్గానికి, ఏ ప్రాంతానికి, ఏ ధ‌ర్మానికి చెందిన వారు అయినప్పటికీ, వారు క్రీడాకారులు గాని, లేదా క్రీడాకారిణులు అయినప్పటికీ కూడా ను స‌మానం గా దక్కుతాయి.  



 

***


(Release ID: 1705134) Visitor Counter : 224