ప్రధాన మంత్రి కార్యాలయం
జనౌషధి దివస్ ఉత్సవాలనుద్దేశించి మార్చి 7న ప్రసంగించనున్న ప్రధానమంత్రి
షిల్లాంగ్‌లో 7500వ జనౌషధికేంద్రాన్ని ఎన్.ఇ.ఐ.జి.ఆర్.ఐ.హెచ్.ఎం.ఎస్ వద్ద జాతికిఅంకితం చేయనున్న ప్రధానమంత్రి
Posted On:
05 MAR 2021 8:36PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి7,2021 వతేదిఉదయ10 గంటలకు వీడియో కాన్ఫరెన్సుద్వారా జనౌషధీ ఉత్సవాల నుద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే ప్రధానమంత్రి ,షిల్లాంగ్‌లో 7500వ జనౌషధికేంద్రాన్ని ఎన్.ఇ.ఐ.జి.ఆర్.ఐ.హెచ్.ఎం.ఎస్ వద్ద జాతికిఅంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, భారతీయ జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో మాట్లాడతారు. అలాగే ఇందుకు సంబంధించి అద్భుతంగాపనిచేసిన వారికి గుర్తింపునిస్తూ స్టేక్‌హోల్డర్లకు అవార్డులు ఇవ్వనున్నారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖమంత్రి కూడాఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన:
సరసమైన ధరలకు నాణ్‌యమైన మందులను ప్రజలకు అందించేందుకుచేపట్టిన కార్యక్రమం ఇది.ఈ పథకం కింద ఏర్పాటు చేసిన స్టోర్లు 7499కి పెరిగాయి. దేశంలోని అన్ని జిల్లాలలో ఈ భారతీయ జన ఔషధి పరియోజన స్టోర్లు ఉన్నాయి. 2020-21 లో( అంటే 2021 మార్చి 4 నాటికి)సాధారణ పౌరులు తమ మందుల బిల్లులపై రూ 3600 కోట్ల రూపాయాలు ఆదా చేసుకో గలిగారు.ఈ మందులు మార్కెట్‌లోనిఔషధాల ధరల కంటే సుమారు 50 నుంచి 90 శాతం వరకు చవకగా లభిస్తున్నాయి.
జన ఔషధి దివస్ గురించి:
జన ఔషధి గురించి ప్రజలలో మరింత అవగాహన కలిగించడానికి మార్చి 1 నుంచి మార్చి 7 వరకు వారం మొత్తం దేశ వ్యాప్తంగా జన ఔషధి వారంగా పరిగణించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీని నినాదం జన్ ఔషధి- సేవా భి, రోజ్‌గార్ బి. ( జన ఔషధి- సేవ తో పాటు ఉపాధి కూడా). వారం చివరి రోజును అంటే మార్చి 7ను జన ఔషధి దివస్‌గా జరుపుకుంటారు.
***
(Release ID: 1703025)
Visitor Counter : 176
Read this release in:
Tamil
,
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada