ప్రధాన మంత్రి కార్యాలయం

వ‌న్య‌ప్రాణుల ప‌రిర‌క్ష‌ణ కు కృషి చేస్తున్న‌వారంద‌రికీ ప్ర‌పంచ వన్య‌ప్రాణి దినం సంద‌ర్భం లో న‌మ‌స్క‌రించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 03 MAR 2021 9:54AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బుధ‌వారం నాడు, అంటే ఈ నెల 3న ప్ర‌పంచ వ‌న్య‌ప్రాణి దినం సంద‌ర్భం లో, వ‌న్య‌ప్రాణుల ప‌రిర‌క్ష‌ణ కు  పాటుప‌డుతున్న‌వారంద‌రికీ న‌మ‌స్క‌రించారు.

‘‘వ‌న్య‌ప్రాణి ప‌రిర‌క్ష‌ణ దిశ లో కృషి చేస్తున్న‌వారంద‌రికీ నేను నమస్కరిస్తున్నాను.  సింహాలు కావ‌చ్చు, పులులు కావ‌చ్చు, చిరుత‌పులులు కావ‌చ్చు.. వివిధ జాతుల ప‌శు సంత‌తి భార‌త‌దేశం లో నిల‌క‌డ‌ గా వృద్ధి చెందుతోంది.  మ‌న అడ‌వుల ను పరిరక్షించడానికి,  ప‌శువుల‌ కు సుర‌క్షిత‌మైన ఆవాసాల‌ ను ప‌రిర‌క్షించడానికి మ‌నం వీలయిన ప్ర‌తి ప్ర‌య‌త్నాన్ని చేస్తూ ఉండాలి’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 

***
 


(Release ID: 1702123) Visitor Counter : 169