ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 1.46 లక్షలు
గత 24 గంటల్లో కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ దేశమంతటా ఇప్పటిదాకా 1.21 కోట్లకు పైగా టీకాలు
Posted On:
24 FEB 2021 11:13AM by PIB Hyderabad
భారతదేశం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్యను లక్షన్నరలోపే ఉండేలా జాగ్రత్తపడుతోంది. నేటికి చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,46,907 గా నమొదైంది. మొత్తం పాజిటివ్ కేసులలో వీరి వాటా 1.33%. గత 24 గంటలలో కొత్తగా 13,742 పాజిటివ్ కేసులు నమోదు కాగా అదే సమయంలో14,037 మంది బాధితులు కోలుకున్నారు. దీనివలన నికరంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య 399 మేరకు తగ్గింది. గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్యలో మార్పును ఈ క్రింది పట్టిక వివరిస్తుంది.మహారాష్ట్రలో అత్యధికంగా 298 కేసులు అధికంగా వచ్చి చేరగా కేరళలో 803 కేసుల తగ్గుదల నమొదైంది.

గత వారం రోజుల్లో 12 రాష్టాలలో సగటున రోజుకు 100 కు పైగా కేసులు నమోదవుతూ వచ్చాయి. అవి: మహారాష్ట, కేరళ, తమిళనాడు, కర్నాటక, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్మ్ చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ, హర్యానా. కేరళ, మహారాష్ట్ర గత వారం సగటున రోజుకు 4,000 కు పైగా కేసులు జోడించాయి.

2021 ఫిబ్రవరి 24న ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 1,21,65,598 మందికి 2,54,356 శిబిరాల ద్వారా టీకాలు అందాయి. అందులో 64,98,300 ఆరోగ్య సిబ్బందికి మొదటి డోస్, 13,98,400 మంది ఆరోగ్య సిబ్బందికి రెండో డోస్, 42,68,898 మంది కోవిడ్ యోధులకు మొదటి డోస్ ఉన్నాయి.
రెండో డో స్టీకాల కార్యక్రమం ఫిబ్రవరి 13న ప్రారంభంకాగా మొదటి డో స్తీసుకొని 28 రోజులు దాటినవారందరీ దీనికి అర్హులయ్యారు. కొవిడ్ యోధులకు మొదటి డోస్ ఫిబ్రవరి 2న మొదలైంది.
క్రమసంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
టీకాల లబ్ధిదారులు
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
మొత్తం డోసులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
5,565
|
2,018
|
7,583
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
4,45,327
|
1,11,483
|
5,56,810
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
22,419
|
5,497
|
27,916
|
4
|
అస్సాం
|
1,75,185
|
15,189
|
1,90,374
|
5
|
బీహార్
|
5,32,936
|
59,521
|
5,92,457
|
6
|
చండీగఢ్
|
15,766
|
1,237
|
17,003
|
7
|
చత్తీస్ గఢ్
|
3,58,080
|
30,946
|
3,89,026
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
5,028
|
261
|
5,289
|
9
|
డామన్, డయ్యూ
|
1,808
|
254
|
2,062
|
10
|
ఢిల్లీ
|
3,34,333
|
24,762
|
3,59,095
|
11
|
గోవా
|
15,804
|
1,280
|
17,084
|
12
|
గుజరాత్
|
8,26,583
|
78,471
|
9,05,054
|
13
|
హర్యానా
|
2,15,743
|
53,110
|
2,68,853
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
97,607
|
12,672
|
1,10,279
|
15
|
జమ్మూ, కశ్మీర్
|
2,17,910
|
10,285
|
2,28,195
|
16
|
జార్ఖండ్
|
2,67,556
|
14,578
|
2,82,134
|
17
|
కర్నాటక
|
5,69,416
|
1,57,944
|
7,27,360
|
18
|
కేరళ
|
4,14,509
|
62,299
|
4,76,808
|
19
|
లద్దాఖ్
|
7,368
|
611
|
7,979
|
20
|
లక్షదీవులు
|
2,343
|
621
|
2,964
|
21
|
మధ్యప్రదేశ్
|
6,44,431
|
32,529
|
6,76,960
|
22
|
మహారాష్ట్ర
|
9,48,539
|
80,824
|
10,29,363
|
23
|
మణిపూర్
|
43,507
|
1,894
|
45,401
|
24
|
మేఘాలయ
|
28,190
|
1,200
|
29,390
|
25
|
మిజోరం
|
17,315
|
3,490
|
20,805
|
26
|
నాగాలాండ్
|
24,985
|
4,819
|
29,804
|
27
|
ఒడిశా
|
4,47,176
|
1,30,470
|
5,77,646
|
28
|
పుదుచ్చేరి
|
9,431
|
1,019
|
10,450
|
29
|
పంజాబ్
|
1,33,718
|
23,867
|
1,57,585
|
30
|
రాజస్థాన్
|
7,83,205
|
94,838
|
8,78,043
|
31
|
సిక్కిం
|
14,721
|
973
|
15,694
|
32
|
తమిళనాడు
|
3,59,063
|
41,337
|
4,00,400
|
33
|
తెలంగాణ
|
2,81,382
|
1,06,167
|
3,87,549
|
34
|
త్రిపుర
|
85,789
|
16,349
|
1,02,138
|
35
|
ఉత్తరప్రదేశ్
|
11,40,754
|
86,021
|
12,26,775
|
36
|
ఉత్తరాఖండ్
|
1,36,058
|
11,242
|
1,47,300
|
37
|
పశ్చిమ బెంగాల్
|
7,20,569
|
81,108
|
8,01,677
|
38
|
ఇతరములు
|
4,17,079
|
37,214
|
4,54,293
|
|
మొత్తం
|
1,07,67,198
|
13,98,400
|
1,21,65,598
|
టీకాలు మొదలైన 39వ రోజైన ఫిబ్రవరి 23న 4,20,046 టీకా డోసులిచ్చారు. అందులో of 2,79,823 మంది లబ్ధిదారులు 9,479 శిబిరాలలో మొదటి డోస్ టీకాలందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కాగా 1,40,223 మంది రెండో డోస్ తీసుకున్న ఆరోగ్య సిబ్బంది.
మొత్తం 1,21,65,598 టీకా డోసులలో 1,07,67,198 మొదటి డోస్ ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కాగా 13,98,400 మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది.

రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 75% పైగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. అవి: బీహార్, త్రిపుర, ఒడిశా, గుజరాత్, చత్తీస్ గఢ్, లక్షదీవులు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్,రాజస్థాన్

రిజిస్టర్ చేసుకున్న కోవిడ్ యోధులలో 60% పైగా టీకాలిచ్చిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 10. అవి: దాద్రా-నాగర్ హవేలి, రాజస్థాన్, లక్షదీవులు, గుజరాత్, మధ్యప్రదేశ్, త్రిపుర, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చత్తీస్ గఢ్

భారతదేశంలో ఇప్పటివరకు కోలుకున్న మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య నేటికి1,07,26,702 కు చేరింది. దీంతో కోలుకున్నవారి శాతం 97.25% అయింది. కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా పెరుగుతూ నేటికి 10,579,795 అయింది. కొత్తగా కోలుకున్నవారిలో 86.26% మంది కేవలం 6 రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక రోజులో 5,869 మంది కోలుకోగా కేరళలో 4,823 మంది, తమిళనాడులో 453 మంది కోలుకున్నారు.

కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 86.15% కేవలం 6 రాష్ట్రాలకు చెందినవే. మహారాష్ట్రలో రోజువారీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గత 24 గంటలలో అక్కడ 6,218 కొత్త కేసులు రాగా, కేరళలో 4,034, తమిళనాడులో 442 నమోదయ్యాయి.

గడిచిన 24 గంటలలో 104 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో 81.73% ఐదు రాష్టాల్లోనే నమోదు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 51 మంది, కేరళలో 14 మంది, పంజాబ్ లో 10 మంది చనిపోయారు.

గత 24 గంటలలో 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అవి: గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్, చండీగఢ్, అస్సాం, లక్షదీవులు, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, మణిపూర్, మిజోరం, త్రిపురమ్ మేఘాలయ, అండమాన్-నికోబార్ దీవులు, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి.
13 రాష్ట్రాల్లో 1-5 మధ్య మరణాలు నమోదయ్యాయి. 2 రాష్టాల్లో 6-10 మధ్య మరణాలు నమోదు కాగా, ఒక రాష్ట్రంలో 10-20 మంది మధ్య, ఇంకో రాష్ట్రంలో 20 మందికి పైగా చనిపోయారు.

****
(Release ID: 1700408)
|