ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 1.5 లక్షలకు దిగువన ఈరోజు 1.47 లక్షల మంది
దేశవ్యాప్తంగా టీకాలు 1.17 కోట్లు రోజువారీ మరణాలు 100 లోపు. 21 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో నమోదు కాని కోవిడ్ మరణాలు
Posted On:
23 FEB 2021 11:38AM by PIB Hyderabad
దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య లక్షన్నర లోపుకు పడిపోయి నేడు 1,47,306 గా నమోదయ్యాయి. ఇవి మొత్తం పాజిటివ్ కెసులలో 1.34%. గత 24 గంటలలో 10,584 కొత్త కోవిడ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో 13,255 మంది కోలుకున్నారు. దీనివల్ల నికరంగా 2,749 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా పాజిటివ్ శాతం 3% లోపే ఉంది.
రోజువారీ మరణాలు కూదా తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో గత 24 గంటలలో 78 మరణాలు నమోదయ్యాయి. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అవి: మధ్యప్రదేశ్ అస్సాం, రాజస్థాన్, హర్యానా, జమ్మూ-కశ్మీర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, లక్షదీవులు, మణిపూర్, సిక్కిం, త్రిపుర, లద్దాఖ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్-నికోబార్ దీవులు, దాద్రా, నాగర్ హవేలి, డమన్-డయ్యూ.
టీకాల కార్యక్రమం మొదలైన 38వ రోజైన ఫిబ్రవరి 22 సాయంత్రం 8 గంటల నాటికి 2,44,877 శిబిరాల ద్వారా 1,17,45,552 టీకాలు ఇవ్వటం పూర్తయింది. ఇందులో 64,51,251మొదటి డోస్ ఆరోగ్య సిబ్బంది టీకాలు, 12,58,177 ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ కాగా 40,36,124 మొదటి దశ కోవిడ్ యోధుల డోసులు.
రెండో డోస్ కోవిడ్ టీకాల కార్యక్రమం ఫిబ్రవరి13న మొదలైంది. మొదటి డోస్ తీసుకొని 28 రోజులు పూర్తయినవారు రెండో డోస్ కు అర్హులయ్యారు. కోవిడ్ యోధులకోసం ఫిబ్రవరి2న టీకాలు మొదలయ్యాయి.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం
|
టీకాల లబ్ధిదారులు
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
మొత్తం డోస్ లు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
5,442
|
1,870
|
7,312
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
4,27,444
|
1,02,376
|
5,29,820
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
21,318
|
5,332
|
26,650
|
4
|
ఆస్సాం
|
1,65,110
|
13,992
|
1,79,102
|
5
|
బీహార్
|
5,26,159
|
56,791
|
5,82,950
|
6
|
చండీగఢ్
|
14,198
|
1,089
|
15,287
|
7
|
చత్తీస్ గఢ్
|
3,50,716
|
28,186
|
3,78,902
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
5,019
|
252
|
5,271
|
9
|
డామన్, డయ్యూ
|
1,767
|
254
|
2,021
|
10
|
ఢిల్లీ
|
3,15,841
|
22,788
|
3,38,629
|
11
|
గోవా
|
15,542
|
1,269
|
16,811
|
12
|
గుజరాత్
|
8,24,119
|
73,547
|
8,97,666
|
13
|
హర్యానా
|
2,13,802
|
41,811
|
2,55,613
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
96,278
|
12,412
|
1,08,690
|
15
|
జమ్మూ-కశ్మీర్
|
2,10,544
|
9,315
|
2,19,859
|
16
|
జార్ఖండ్
|
2,61,339
|
13,394
|
2,74,733
|
17
|
కర్నాటక
|
5,53,888
|
1,40,076
|
6,93,964
|
18
|
కేరళ
|
4,05,697
|
56,232
|
4,61,929
|
19
|
లద్దాఖ్
|
6,610
|
610
|
7,220
|
20
|
లక్షదీవులు
|
2,333
|
591
|
2,924
|
21
|
మధ్యప్రదేశ్
|
6,43,277
|
32,124
|
6,75,401
|
22
|
మహారాష్ట్ర
|
9,16,977
|
68,978
|
9,85,955
|
23
|
మణిపూర్
|
41,799
|
1,798
|
43,597
|
24
|
మేఘాలయ
|
25,998
|
960
|
26,958
|
25
|
మిజోరం
|
15,749
|
3,052
|
18,801
|
26
|
నాగాలాండ్
|
23,391
|
4,418
|
27,809
|
27
|
ఒడిశా
|
4,43,401
|
1,22,741
|
5,66,142
|
28
|
పుదుచ్చేరి
|
9,356
|
981
|
10,337
|
29
|
పంజాబ్
|
1,27,528
|
20,538
|
1,48,066
|
30
|
రాజస్థాన్
|
7,82,710
|
62,183
|
8,44,893
|
31
|
సిక్కిం
|
13,384
|
775
|
14,159
|
32
|
తమిళనాడు
|
3,49,527
|
36,073
|
3,85,600
|
33
|
తెలంగాణ
|
2,81,365
|
1,05,936
|
3,87,301
|
34
|
త్రిపుర
|
84,254
|
15,066
|
99,320
|
35
|
ఉత్తరప్రదేశ్
|
11,40,754
|
86,021
|
12,26,775
|
36
|
ఉత్తరాఖండ్
|
1,33,636
|
9,682
|
1,43,318
|
37
|
పశ్చిమ బెంగాల్
|
6,73,939
|
69,651
|
7,43,590
|
38
|
ఇతరములు
|
3,57,164
|
35,013
|
3,92,177
|
|
మొత్తం
|
1,04,87,375
|
12,58,177
|
1,17,45,552
|
కోవిడ్ టీకాలు మొదలైన 38వ రోజైన ఫిబ్రవరి 22న 6,28,696 టీకా డోసులు ఇచ్చారు. అందులో 3,38,373 మంది లబ్ధిదారులకు 12,560 శిబిరాలలో మొదటి డోస్ ఇవ్వగా 2,90,323 మందికి రెండో డోస్ ఇచ్చారు. మొత్తం 1,17,45,552 టీకా డోసులలో 1,04,87,375రోగ్య సిబ్బందికి ఇచ్చిన మొదటొ డోస్ కాగా, 12,58,177 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ అందుకున్నారు. మొత్తం డోసులలో 51.66% కేవలం ఏడు రాష్ట్రాల్లో కేంద్రీకృతమయ్యాయి. అందులో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్టంలోనే 10.4% (12,26,775 డోసులు) పంపిణీ జరిగింది
రెండో డోస్ టీకా అందుకున్నవారిలో 61.15% మంది కేవలం 8 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యారు. ఒక్క కర్నాటకలోనే 11.13% (1,40,076 డోసులు) ఇచ్చారు.
భారతదేశంలో కోలుకున్నవారి సంఖ్య నేటికి 1,07,12,665 కి చేరుకుంది. కోలుకున్నవారి శాతం 97.22% అయింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా పెరుగుతూ నేటికి 10,565,359 కి చేరింది. కొత్తగా కోలుకున్నవారిలో 86.56% మంది కేవలం 6 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 5,210 కొత్తగా కోలుకోగా, కేరళలో 2212 మంది, తమిళనాడులో 449 మంది కొలుకున్నారు..
కొత్తగా నమోదైన కోవిడ్ కేసులలో 84% కేవలం 6 రాష్ట్రాల్లో వచ్చాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 5,210 కేసులు రాగా కేరళలో 2212, తమిళనాడులో 449 కేసులు వచ్చాయి.
గత 24 గంటల్లో సంభవించిన కోవిడ్ మరణాలలో 84.62% ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అందులో మహారాష్ట్రలో అత్యధికంగా 18 మరణాలు, కేరళలో 16, పంజాబ్ లో 15 మరణాలు నమోదయ్యాయి.
****
(Release ID: 1700163)
|