ప్రధాన మంత్రి కార్యాలయం

సి.ఓ.పి-26 అధ్యక్షునిగా ఎంపికైన పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులు అలోక్ శర్మ ను కలిసిన - ప్రధానమంత్రి


Posted On: 16 FEB 2021 7:01PM by PIB Hyderabad

26వ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు ల సదస్సుకు చెందిన పక్షాలు (సి.ఓ.పి-26) కు అధ్యక్షునిగా ఎంపికైన గౌరవ పార్లమెంటు సభ్యుడు శ్రీ అలోక్ శర్మ, ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీని కలుసుకున్నారు. సి.ఓ.పి. అనేది వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ (యు.ఎన్.ఎఫ్.సి.సి.సి) యొక్క నిర్ణయ-నిర్ణేత సంస్థ. 2021 నవంబర్ లో గ్లాస్గో లో జరిగే, ఈ సంస్థ 26వ సదస్సు కు యు.కే. ఆతిథ్యం ఇవ్వనుంది.

సి.ఓ.పి-26 నేపథ్యంలో, వాతావరణ మార్పు సమస్యలపై భారతదేశం-యు.కె. సహకారం గురించి, ప్రధానమంత్రి మరియు శ్రీ అలోక్ శర్మ చర్చించారు. పారిస్ ఒప్పందానికి భారతదేశం కట్టుబడి ఉందనీ, సి.ఓ.పి-26 లో విజయవంతమైన ఫలితాలకోసం నిర్మాణాత్మకంగా పనిచేయడానికి కృషి చేస్తామనీ, ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. 2020 డిసెంబర్ లో జరిగిన వాతావరణ ఆకాంక్ష సదస్సులో ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని శ్రీ శర్మ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

భారతదేశం - యూ.కే. సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు యునైటెడ్ కింగ్-డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తో కలిసి పనిచేయడానికి కూడా ప్రధానమంత్రి తమ నిబద్ధతను వ్యక్తం చేశారు.

 

 

*****

 



(Release ID: 1698572) Visitor Counter : 183