ప్రధాన మంత్రి కార్యాలయం
మౌలిక సదుపాయాల రంగం లో బడ్జెటు ను ప్రభావశీలమైన విధం గా అమలు పరచేందుకు మార్గసూచీ సంబంధిత సంప్రదింపుల కు ఏర్పాటు చేసిన వెబినార్ ను ఉద్దేశించి ఈ నెల 16న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
Posted On:
15 FEB 2021 8:24PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు, అంటే ఈ నెల 16న, సాయంత్రం 4 గంటల కు ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వెబినార్ మౌలిక సదుపాయాల కల్పన రంగం లో కేంద్ర బడ్జెటు 2021-22 ను ప్రభావశీలమైన విధం గా అమలు పరచడం కోసం ఒక మార్గసూచీ ని రూపొందించేందుకుగాను జరిపే సంప్రదింపుల కు సంబంధించింది.
వెబినార్ ను గురించి
ఈ వెబినార్ లో ప్రముఖ ఆర్థిక సంస్థ ల, ఫండు ల ప్రతినిధులు, కన్సెశనేర్‌లు, కాంట్రాక్టర్ లు, కన్ సల్టెంట్ లు, విషయ నిపుణుల తో పాటు 200 మంది కి పైగా పేనలిస్టులు పాలుపంచుకోనున్నారు. వారు ఉన్నతమైన సాంకేతిక విజ్ఞానంపై శ్రద్ధ వహించడం తో పాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల లో వేగాన్ని, నాణ్యత ను మెరుగుపరచడం గురించి, ఈ రంగం లోకి మరిన్ని పెట్టుబడుల ను ఆకర్షించడం గురించి కూడా వారి ఆలోచనలను వెల్లడించనున్నారు.
దీని తరువాత ఏకకాలం లో మరో రెండు సమావేశాలు కూడా జరుగుతాయి. ఈ రెండు సమావేశాలలోను, బడ్జెటు లో ప్రస్తావించిన దార్శనికత ను సత్వర ప్రాతిపదిక న ఆచరణ లోకి తీసుకు రావడానికి యోగ్యం గా ఉండేటటువంటి ప్రాజెక్టు ల జాబితా ను రూపొందించడం తో పాటు సంబంధిత మార్గసూచీ ని అమలు చేసేందుకు ఒక ముసాయిదా ను తయారు చేయడం పై మంత్రిత్వ శాఖ ల సమూహాల లోని సీనియర్ అధికారులు, వివిధ రంగాల కు చెందిన నిపుణుల మధ్య చర్చలు జరగనున్నాయి.
తుది రూపు ను ఇచ్చిన వ్యూహాన్ని అమలు లోకి తీసుకురావడం కోసం ఈ ప్రక్రియ లో భాగం పంచుకొనే వర్గాల తో సైతం ఎప్పటికప్పుడు సంప్రదింపులను జరుపుతూ ఉండాలని కూడా ప్రతిపాదించడమైంది.
****
(Release ID: 1698360)
Visitor Counter : 206
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam