ప్రధాన మంత్రి కార్యాలయం

త‌మిళ నాడు లోని విరుధున‌గ‌ర్ లో ఒక బాణసంచా కర్మాగారం లో మంటలు చెలరేగడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన  ప్ర‌ధాన మంత్రి;  ఘటనలో మృతులకు, గాయపడ్డ వారి సంబంధికుల కు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఆయన ఆమోదం తెలిపారు  


నాడు పోస్టు చేయడమైనది: 12 FEB 2021 5:14PM by PIB Hyderabad

త‌మిళ నాడు లోని విరుధున‌గ‌ర్ లో ఓ టపాసుల క‌ర్మాగారం లో అగ్ని రాజుకొన్న ఘటన ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన లో ప్రాణాలను కోల్పోయిన వారి తో పాటు ఈ ఘటన లో గాయపడ్డ వారి దగ్గరి సంబంధికులకు ఆర్థిక స‌హాయాన్ని అందించేందుకు ఆయ‌న ఆమోదం తెలిపారు.

‘‘త‌మిళ నాడు లోని విరుధున‌గ‌ర్ లో ఓ బాణ‌సంచా కార్ఖానా లో మంట‌లు చెల‌రేగినందుకు చాలా దు:ఖిస్తున్నాను. ఈ దుఃఖ ఘడియ లో ఆప్తుల‌ ను కోల్పోయిన కుటుంబాల కు క‌లిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ ఘ‌ట‌న లో గాయ‌ప‌డ్డ‌ వారు త్వ‌ర‌గా కోలుకొంటార‌ని నేను ఆశిస్తున్నాను. బాధిత కుటుంబాల‌కు సాయ‌ప‌డేందుకు అధికారులు నిరంతరాయం గా కృషి చేస్తున్నారు.

త‌మిళ నాడు లోని విరుధున‌గ‌ర్ లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న లో ప్రాణాల‌ను కోల్పోయిన వారి ద‌గ్గ‌రి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున, తీవ్రం గా గాయ‌ప‌డిన‌ వారికి 50,000 రూపాయ‌ల వంతున ఆర్థిక స‌హాయాన్ని అందించడం జరుగుతుంది’’ అని ప్ర‌ధాన మంత్రి వరుస ట్వీట్ ల‌లో పేర్కొన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

****


(రిలీజ్ ఐడి: 1697521) సందర్శకుల సూచీ సంఖ్య : : 253