ఆర్థిక మంత్రిత్వ శాఖ

కేంద్ర వార్షిక బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు

Posted On: 01 FEB 2021 2:07PM by PIB Hyderabad

 

        కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారమణ్ దేశంలో మొట్టమొదటి డిజిటల్ బడ్జెట్ ను సోమవారం పార్లమెంటుకు సమర్పించారు.   కొవిడ్ -19పై మనం మొదలుపెట్టిన  పోరాటం 2021లో కూడా కొనసాగుతోన్న నేపథ్యంలో  ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ అనంతరం దేశాల మధ్య రాజకీయ, ఆర్ధిక మరియు వ్యూహాత్మక సంబంధాలు మారుతున్న ప్రస్తుత తరుణం చరిత్రలో ఘనమైనదని ఆమె అన్నారు.  ఆశావహ దృక్కులతో ముందుకు సాగుతున్న ఇండియాలో డిజిటల్ బడ్జెట్ సమర్పణ  నవశకానికి నాంది అని ఆమె అన్నారు.

  

కేంద్ర బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి: 

 

కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రతిపాదనకు మూల స్తంభాలు: 

 1.  ఆరోగ్యం మరియు క్షేమం

 2.  భౌతిక మరియు ఆర్ధిక పెట్టుబడి (మూలధనం), మౌలిక సదుపాయాలు 

 3.  ఆకాంక్షలకు నెలవైన ఇండియాలో సమీకృతాభివృద్ధి 

 4.  జనశక్తిని పరిపుష్టం చేయడం

 5.  నూతన కల్పనలు మరియు పరిశోధనాభివృద్ధి 

 6.  కనీస ప్రభుత్వం మరియు గరిష్ట పాలన

 

 1.  ఆరోగ్యం, క్షేమం 

  • 2020-21 బడ్జెట్ అంచనాలలో రూ. 94,452 కోట్లున్న ఆరోగ్యం మరియు క్షేమం/శ్రేయస్సు కేటాయింపులను  2021-22 బడ్జెట్ అంచనాలలో రూ. 2,23,846 కోట్లకు పెంచారు.  అంటే 137% పెరుగుదల.
  • ప్రధానంగా మూడు అంశాల పైన దృష్టిని కేంద్రీకరిస్తారు.  అవి:  నిరోధక, స్వస్థత మరియు క్షేమం
  • ఆరోగ్యం, శ్రేయస్సు మెరుగుపరచడానికి చర్యలు 

 

@   వ్యాక్సిన్లు 

 

    • 2021-22 బడ్జెట్ అంచనాలలో కొవిడ్ -19 వ్యాక్సిన్ కోసం రూ. 35,000 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు
    • ప్రతి ఏటా 50,000 శిశు మరణాలను నిరోధించదానికి ప్రస్తుతం అయిదు రాష్ట్రాలకే పరిమితమైన న్యుమోకోకల్ వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని సంకల్పించారు

 

@   ఆరోగ్య వ్యవస్థలు 

      • ప్రస్తుతం అమలులో ఉన్న నేషనల్ హెల్త్ మిషన్ కు తోడుగా కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో  ప్రవేశపెట్టనున్న కొత్త  ఆరోగ్య పథకం ‘ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ స్వస్థ భారత్ యోజన’ ఆరేళ్ళ పాటు అమలు చేయడానికి రూ. 64,180 కోట్లు కేటాయించారు.  
      • ‘ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ స్వస్థ భారత్ యోజన’ కింద ప్రధానంగా చేపట్టే పనులు
  • జనారోగ్యం కోసం జాతీయ సంస్థ
  • గ్రామీణ ప్రాంతాలలో 17,788 మరియు పట్టణ ప్రాంతాలలో 11,024 ఆరోగ్య మరియు శ్రేయస్సు  కేంద్రాలు
  • వైరస్ లు అధ్యయనం చేయడానికి 4 ప్రాంతాలలో జాతీయ వైరాలజీ ఇనిస్టిట్యూట్ ల ఏర్పాటు
  • ఆరోగ్య కల్పన కోసం 15 అత్యవసర ఆపరేషన్ సెంటర్లు మరియు 2 సంచార ఆసుపత్రులు
  • అన్ని జిల్లాలలో సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలు మరియు 11 రాష్ట్రాలలోని  3382 బ్లాకులలో ప్రజారోగ్య యూనిట్లు
  • సంక్లిష్టమైన వ్యాధుల చికిత్స కోసం 602 జిల్లాలలో మరియు 12 కేంద్ర సంస్థలలో ప్రత్యేక బ్లాకులు
  • జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్ సి డి సి)దాని 5 ప్రాంతీయ శాఖలు మరియు 20 మెట్రోపాలిటన్ ఆరోగ్య పర్యవేక్షణ యూనిట్లు బలోపేతం
  • అన్ని ప్రజారోగ్య ప్రయోగశాలలను అనుసంధానం చేసేందుకు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సమగ్ర ఆరోగ్య సమాచార పోర్టల్ విస్తరణ
  • కొత్తగా 17 ప్రజారోగ్య యూనిట్ల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న 33 ప్రజారోగ్య యూనిట్లు బలోపేతం   
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఆగ్నేయాసియా ప్రాంత విభాగం కోసం ప్రాంతీయ పరిశోధనా ప్లాటుఫారమ్
  • జీవ భద్రత కోసం 9 లెవెల్ - III ప్రయోగశాలలు

 

@    పోషణ

•     మిషన్ పోషణ్  2.0 ప్రారంభించాలని సంకల్పం

o     పోషక పదార్ధాల సత్తువ పెంచడం, మెరుగైన పంపిణీ, వ్యాప్తి మరియు మంచి ఫలితాల సాధనకు చర్యలు

o     అనుబంధ పోషణ కార్యక్రమం మరియు పోషణ్ అభియాన్ విలీనం

o     112 ఆకాంక్షా జిల్లాలలో పోషక విలువల పెంపునకు తీవ్రమైన వ్యూహం అమలు   

 

@    నీటి సరఫరా సార్వత్రిక వ్యాప్తి      

    వచ్చే 5 సంవత్సరాలలో  కోసం రూ. 2,87,000 కేటాయింపు ద్వారా ‘జల్ జీవన్ మిషన్’ (అర్బన్) ప్రారంభించడంలో లక్ష్యం: 

o    2.86 కోట్ల కుటుంబాలకు నల్లా  కనెక్షన్ ఏర్పాటు 

  దేశంలోని మొత్తం 4,378 పట్టణ స్థానిక సంస్థలలో సార్వత్రిక నీటి సరఫరా

o    500 అమృత్ నగరాలలో ద్రవ వ్యర్ధాల నిర్వహణ 

 

 @    స్వఛ్చ భారత్ స్వస్థ భారత్ 

 

   అర్బన్ స్వఛ్చ భారత్ మిషన్ 2.0 కోసం వచ్చే ఐదేళ్లలో రూ.  1,41,678 కోట్లు కేటాయింపు 

•             స్వఛ్చ భారత్ మిషన్ 2.0 (అర్బన్ )  ద్వారా ప్రధానంగా నిర్వహించే పనులు: 

o     సంపూర్ణ బురద నిర్మూలన మరియు వ్యర్ధ జలాల శుద్ధి  

o     సేకరించే చోటులోనే చెత్తను వేరుచేయడం

o     ప్లాస్టిక్ సంచుల వినియోగం తగ్గింపు

o     భవన  నిర్మాణాలు, కూల్చివేతలు జరిపేటప్పుడు పోగయ్యే వ్యర్ధాలను సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారా వాయు కాలుష్యం తగ్గింపు

o     చెత్త నిల్వచేసే అన్ని సైట్లను జీవ క్రియ ద్వారా బాగుచేయడం 

 

@        పరిశుభ్రమైన గాలి

 

•     10 లక్షలకు మించి జనాభా ఉన్న 42 పట్టణ  ప్రాంతాలలో వాయు కాలుష్య సమస్యను ఎదుర్కోవడానికి రూ. 2,217

 

రద్దు విధానం 

 

•      పాత, పనికిరాని వాహనాలను తీసివేయడానికి స్వచ్ఛంద వాహన రద్దు విధానం

•     యాంత్రీకరించిన ఫిట్ నెస్ కేంద్రాలలో ఫిట్ నెస్ పరీక్షలు

o     వ్యక్తిగత వాహనాలకు 20 సంవత్సరాల తరువాత

o     వాణిజ్య వాహనాలకు 15 సంవత్సరాల తరువాత  

 

2. భౌతిక మరియు ఆర్ధిక పెట్టుబడి మరియు మౌలిక సదుపాయాలు

 

ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహక పథకం   (పిఎల్ఐ) 

 

  • 13 రంగాలకు చెందిన పిఎల్ఐ పథకాల కోసం వచ్చే ఐదేళ్లకు రూ. 1.97 లక్షల కోట్లు కేటాయింపు
  • ‘ఆత్మ నిర్భర్ భారత్’ కోసం ప్రపంచ చాంపియన్ల సృష్టి, పోషణ
  • ఉత్పత్తి కంపెనీలు ప్రపంచ సరఫరా శృంఖలలో భాగం కావడానికిసామర్ధ్యం పెంచుకోవడానికి మరియు అత్యంత ఆధునిక, చతురత కలిగిన సాంకేతిక పరిజ్ఞానం సంపాదించుకోవడానికి సహాయం
  • కీలక రంగాలలో పరిమాణం, స్థాయి పెంపు
  • యువతకు ఉద్యోగాలు కల్పించడం 

 

జౌళి

  • పిఎల్ఐతో పాటు జౌళి పార్కులలో భారీ పెట్టుబడుల కోసం (మిత్ర) స్కీము
  • వచ్చే మూడేళ్ళలో 7 జౌళి పార్కుల ఏర్పాటు 
  • ప్రపంచస్థాయిలో పోటీపడగల స్థాయికి జౌళి పరిశ్రమభారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉపాధి కల్పనకు మరియు ఎగుమతులకు ప్రోత్సాహం 

 

మౌలిక సదుపాయాలు

  • జాతీయ మౌలిక సదుపాయాల కల్పన (ఎన్ఐపి)  7,400 ప్రాజెక్టులకు విస్తరణ
  • రూ. 1.10 లక్షల కోట్ల విలువైన దాదాపు 217 ప్రాజెక్టులు పూర్తి
  • మూడు కీలక క్షేత్రాలలో చేపట్టే చర్యల ద్వారా ఎన్ఐపి కి నిధుల కేటాయింపు పెంపు.  అవి: 
  1. సంస్థాగత నిర్మాణాల సృష్టి
  2. ఆస్తులను డబ్బుగా మార్చడం
  3. పెట్టుబడి వ్యయం వాటా పెంపు

 

  1. సంస్థాగత నిర్మాణాల సృష్టి :   మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్ధిక సహాయం 

 

  • రూ. 20,000 కోట్ల మూల నిధితో పెట్టుబడుల కోసం డెవెలప్మెంట్ ఫైనాన్సియల్ ఇన్ స్టిట్యూషన్ (డిఎఫ్ఐ) ఏర్పాటు -  అది మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులను సిద్ధం, సుసాధ్యం  చేయడంతో పాటు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది
  • వచ్చే మూడేళ్ళలో ప్రతిపాదిత డిఎఫ్ఐ ద్వారా రూ. 5 లక్షల కోట్ల మేర రుణాలు కల్పిస్తారు  
  • చట్టాలలో సవరణలు  చేయడం ద్వారా ఎఫ్ పి ఐల ద్వారా డెబిట్ ఫైనాన్సింగ్ సౌకర్యం 

 

  1. ఆస్తులను ద్రవ్యంగా మార్చడానికి తీవ్ర వత్తిడి
  • నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ఏర్పాటుకు చర్యలు
  • ఆస్తుల ద్రవ్యీకరణకు తీసుకునే ముఖ్యమైన చర్యలు 
  1. ప్రస్తుతం అమలులో/వాడుకలో ఉన్న రూ. 5,000 కోట్ల విలువైన  5 టోల్ రోడ్లు జాతీయ రహదారుల సంస్థకు బదిలీ
  2. అదే విధంగా రూ. 7,000 కోట్ల విలువైన విద్యుత్ సరఫరా లైన్లకు సంబంధించి ఆస్తులు పవర్ గ్రిడ్ సంస్థకు బదిలీ
  3. సరుకుల రవాణా కారిడార్ ఆస్తులను అమ్మనున్న రైల్వేలు
  4. అదేవిధంగా నిర్వహణ, యాజమాన్య రాయితీల కోసం  తదుపరి జట్టు విమానాశ్రయాల ఆస్తులను డబ్బుగా మార్చడం
  5. ఆస్తుల అమ్మకం కార్యక్రమం కింద  అమ్మకానికి పెట్టనున్న ఇతర కీలక మౌలిక ఆస్తులు:
  • గెయిల్, ఐఒసిఎల్, హెచ్ పిసిఎల్ చమురు మరియు గ్యాస్ పైపులైన్లు
  • ద్వితీయ శ్రేణి మరియు తృతీయ శ్రేణి నగరాలలో ఉన్న భారత విమానాశ్రయాల సంస్థకు చెందిన విమానాశ్రయాలు
  • రైల్వేలకు చెందిన ఇతర మౌలిక ఆస్తులు
  • కేంద్ర గిడ్డంగుల సంస్థ వంటి ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన గిడ్డంగులు మరియు నాఫెడ్ వంటి సంస్థలకు చెందిన స్పోర్ట్స్ స్టేడియంలు

iii. పెట్టుబడి కేటాయింపులలో భారీ పెరుగుదల

  • బడ్జెట్ లో జరిపే పెట్టుబడి కేటాయింపులలో భారీ పెరుగుదల జరిగింది.  2020-21 బడ్జెట్ కేటాయింపులలో పెట్టుబడి వ్యయానికి రూ. 4.12 లక్షల కోట్లు కేటాయించగా ఈ ఏడాది 34.5% పెంచి  2021-22 బడ్జెట్ అంచనాల్లో  రూ. 5.54 లక్షల కోట్లకు పెంచారు. 
  • రాష్ట్రాలు, స్వతంత్ర సంస్థల పెట్టుబడి వ్యయం కోసం రూ. 2 లక్షల కోట్లకు పైగా కేటాయించారు
  • పెట్టుబడిని కేటాయింపులను అవసరమైన మౌలిక సదుపాయాల కోసం సహేతుకంగా ఖర్చు చేయడంలో మంచి ప్రగతి సాధిస్తున్న ప్రాజెక్టులు/కార్యక్రమాలు/శాఖలకు దన్నుగా ఉండేందుకు ఆర్ధిక వ్యవహారాల శాఖకు రూ. 44,000 కోట్లకు పైగా కేటాయించారు. 

 

రోడ్లు మరియు రహదారులకు మౌలిక సదుపాయాలు

 

  • మునుపు ఎన్నడూ లేని విధంగా రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు భారీ కేటాయింపు రూ. 1,18,101 లక్షల కోట్లు దానిలో  రూ. 1,08,230 లక్షల కోట్లు పెట్టుబడి వ్యయం కోసం
  • రూ. 5.35 లక్షల కోట్ల భారత్ మాల పరియోజన కింద రోడ్ల నిర్మాణం జరుగుతోంది.  దానిలో రూ. 3.3 లక్షల కోట్ల విలువైన 13,000 కిలో మీటర్ల రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టులు ఇవ్వడం జరిగింది. 
  • వాటిలో 3,800 కిలో మీటర్ల నిర్మాణం పూర్తయ్యింది.  ఇంకా 8,500 కిలో మీటర్ల రోడ్ల కాంట్రాక్టులు మార్చి 2022 నాటికి ఇవ్వడం జరుగుతుంది. 
  • మార్చి 2022 నాటికి అదనంగా 11,000 కిలో మీటర్ల నేషనల్ హైవే కారిడార్లను పూర్తిచేయడం జరుగుతుంది 

 

ఆర్ధిక  కారిడార్లు నిర్మాణం ప్రతిపాదన : 

  • తమిళనాడులో 3,500 కిలో మీటర్ల జాతీయ రహదారుల కోసం రూ. 1.03 లక్షల కోట్లు పెట్టుబడి వ్యయం కేటాయింపు
  • కేరళలో 1,100 కిలో మీటర్ల పొడవైన జాతీయ రహదారుల కోసం రూ. 65,000 కోట్లు పెట్టుబడి
  • పశ్చిమ బెంగాల్ లో 675 కిలో మీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం కోసం రూ. 25,000 కోట్లు
  • అస్సాంలో వచ్చే మూడేళ్ళలో 1300 కిలో మీటర్ల జాతీయ రహదారుల కోసం రూ. 34,000 కోట్లు.  ప్రస్తుతం రూ. 19,000 కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణ పనులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. 

 

ప్రధాన కారిడార్లు/ఎక్స్ ప్రెస్ వేలు

 

  • ఢిల్లీ - ముంబై ఎక్స్ ప్రెస్ వే - మిగిలిన 260 కిలో మీటర్ల పనిని 31.3.2021 లోపల అప్పగించడం జరుగుతుంది 
  • బెంగళూరు - చెన్నై ఎక్స్ ప్రెస్ వే278 కిలో మీటర్ల పనిని ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రారంభించడం జరుగుతుంది.  2021-22 నిర్మాణం మొదలవుతుంది. 
  • కాన్పూర్ - లక్నో ఎక్స్ ప్రెస్ వే -  జాతీయ రహదారి 27కు ప్రత్యామ్నాయ మార్గాన్ని సమకూర్చే 63 కిలో మీటర్ల  ఎక్స్ ప్రెస్ వే పనులు 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మొదలవుతాయి.
  • ఢిల్లీ - డెహరాడూన్ ఎకనామిక్ కారిడార్ -   210 కిలో మీటర్ల పనులు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మొదలు పెట్టడం జరుగుతుంది.  2021-22 సంవత్సరంలో నిర్మాణం మొదలవుతుంది. 
  • 464 కిలోమీటర్ల రాయపూర్ - విశాఖపట్నం మార్గం ఛత్తీస్ గఢ్ఒడిశా మరియు ఉత్తర ఆంద్ర ప్రదేశ్ ద్వారా వెళుతుంది.  నిర్మాణ పనులు 2021-22 సంవత్సరంలో మొదలవుతాయి. 
  • 277 చెన్నై-సేలం కారిడార్ ఎక్స్ ప్రెస్ వే  పనులకు ఈ ఏడాది టెండర్లు పిలిచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. 
  • అమృతసర్ - జామ్ నగర్ -  నిర్మాణం 2021-22లో మొదలవుతుంది 
  • ఢిల్లీ - కాట్రా -  నిర్మాణం 2021-22లో మొదలవుతుంది 
  • కొత్తగా నిర్మించే అన్ని 4 మరియు 6 లైన్ల రహదారులలో అత్యంత అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ :
  • వేగాన్ని కనిపెట్టే రాడార్లు
  • ఎప్పటికప్పుడు మారే సందేశాలు చూపే సూచన బోర్డులు
  • జిపిఎస్ సౌకర్యం ఉన్న రికవరీ వ్యాన్లు ఏర్పాటు

 

రైల్వే మౌలిక సదుపాయాలు 

 

  • రైల్వేల కోసం బడ్జెట్ లో రూ. 1,10,055 కోట్లు కేటాయింపు.  దానిలో రూ.1,07,100 కోట్లు పెట్టుబడి వ్యయానికి
  • 2030 నాటికి భవిష్యత్ అవసరాలకు సరితూగే విధంగా వ్యవస్థను సిద్ధం చేసేలా ఇండియా జాతీయ రైల్వే ప్రణాళిక (2030)
  • 2023 డిసెంబర్ నాటికి అన్ని బ్రాడ్ గేజ్ రైలు మార్గాల 100% విద్యుదీకరణ
  • 2021 చివరి నాటికి దాదాపు 72% బ్రాడ్ గేజ్ మార్గాల విద్యుదీకరణ పూర్తవుతుంది
  • పశ్చిమ, తూర్పు సరుకుల రవాణా కారిడార్లు 2022 జూన్ నాటికి ప్రారంభమవుతాయి.  తద్వారా నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి
  • అదనపు సౌకర్యాలకు ప్రతిపాదనలు: 
  • 2021-22లో సొన్ నగర్ - గోమో సెక్షను ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టడం జరుగుతుంది. 
  • భైవిష్యత్తులో చేపట్టే సరుకుల రవాణా కారిడార్ ప్రాజెక్టులు...
  • ఖరగ్ పూర్ నుంచి విజయవాడ వరకు ఈస్ట్ కోస్ట్ కారిడార్ 
  • భుసావల్ నుంచి ఖరగ్ పూర్ నుంచి దంకుని వరకు ఈస్ట్ - వెస్ట్ కారిడార్
  • నార్త్ - సౌత్ కారిడార్ ఇటార్సీ నుంచి విజయవాడ
  • ప్రయాణీకుల సౌకర్యం మరియు భద్రత కోసం తీసుకునే చర్యలు
  • సౌకర్యవంతమైన ప్రయాణం కోసం టూరిస్ట్ రూట్లలో అందంగా అలంకరించిన, జర్మనీలో తయారైన  విస్టా డోమ్ ఎల్ హెచ్ బి కోచ్ ల ఏర్పాటు
  • అంతేకాక దేశీయంగా రూపొందించిన రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.  అవి మానవ తప్పిదం వల్ల  ప్రమాదాలు జరగడాన్ని నివారిస్తాయి. 

 

పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పన

  • పట్టణాలలో ప్రజా రవాణా వ్యవస్థను పెంచడానికి మెట్రో రైల్వే నెట్ వర్క్ విస్తరణతో పాటు సిటీ బస్సుల సంఖ్యను పెంచుతారు
  • ప్రభుత్వ బస్సు సర్వీసులను పెంచడానికి  కొత్త స్కీము కోసం రూ. 18,000 కోట్లు .. ఇది
    • వినూత్నమైన  ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంలో 20,000కు పైగా బస్సులు నడుపుతారు
    • ఆటోమొబైల్ రంగానికి ఊతం ఇవ్వడమే కాకా ఉపాధి అవకాశాలు పెంచడానికి తోడ్పడుతుంది. 
  • ప్రస్తుతం అమలులో ఉన్న 702 కిలో మీటర్ల మెట్రో రైళ్లకు తోడుగా మరో 1016 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థలు నిర్మాణంలో ఉన్నాయి.
  • ప్రథమ శ్రేణి నగరాల శివార్లలో, ద్వితీయ శ్రేణి నగరాలలో మెట్రో రైలు వ్యవస్థల ఏర్పాటు

కొచ్చి, చెన్నై, బెంగళూరు, నాగపూర్ మెట్రోల రెండవ దశల నిర్మాణ పనులు జోరుగా  సాగుతున్నాయి.  వాటి నిర్మాణానికి కేంద్రం తన వాటాను విడుదల చేయనుంది. 

 

విద్యుత్ మౌలిక సదుపాయాలు

 

  • గత ఆరేళ్లలో  విద్యుత్ సరఫరా లైన్ల సామర్ధ్యాన్ని పెంచి  2.8 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది. 
  • పంపిణీ కంపెనీల మధ్య పోటీ పెరిగి వినియోగదారులకు మెరుగైన సేవలు లభిస్తాయి
  • గత ఐదేళ్లలో మెరుగైన  కొత్త విద్యుత్ పంపిణీ విధానం కోసం రూ. 3,05,984 కోట్లు ఖర్చు  

 

ఓడరేవులు, నౌకానిర్మాణం , జలమార్గాలు

  • ప్రధాన పోర్టులకు సంబంధించి రూ. 2000 కోట్ల విలువైన  7 ప్రాజెక్టులు ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంలో నిర్వహణ
  • భారతీయ షిప్పింగ్ కంపెనీలకు గ్లోబల్ టెండర్ల ద్వారా రూ.  1624 కోట్ల సబ్సిడీ
  • అదనంగా లక్షన్నర ఉద్యోగాలకు అవకాశం 

 

 పెట్రోలియం మరియు సహజ వాయువు 

  • ఉజ్జ్వల పథకం పొడిగింపు ద్వారా అదనంగా 1 కోటి మందికి ప్రయోజనం
  • వచ్చే మూడేళ్ళలో అదనంగా మరో 100 జిల్లాలలో సిటీ గ్యాస్ పంపిణీ యంత్రాంగం
  • జమ్మూ కాశ్మీర్ కు కొత్త గ్యాస్ పైపులైన్ ప్రాజెక్ట్

 

ఫైనాన్షియల్ క్యాపిటల్ 

 

  • ఒకే ఒక సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్  రూపకల్పన
  • ఫైనాన్సియల్ - టెక్నీకల్ హబ్ ఏర్పాటుకు మద్దతు
  • బంగారం నియంత్రణ ఎక్స్ఛేంజీలు.  రెగ్యులేటర్ గా సెబీ ఉండే అవకాశం. బంగారం నిల్వ, నియంత్రణ మరింత బలోపేతం.  
  • మదుపరుల చార్టర్ అభివృద్ధి
  • సౌర ఇంధనం మరియు అక్షయ ఇంధనం అభివృద్హికి పెట్టుబడులు

 

 

బీమా రంగంలో ఎఫ్‌డిఐ పెంపు

 

      • అనుమతించదగిన ఎఫ్‌డిఐ పరిమితిని 49% నుండి 74% కి పెంచడం మరియు విదేశీ యాజమాన్యాన్ని మరియు నియంత్రణను కొన్ని రక్షణ చర్యలతో అనుమతించడం

 

సంపదపై ఒత్తిడి సంబంధించిన పరిష్కారం

 

      • అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీని ఏర్పాటు చేయనున్నారు

 

పిఎస్‌బిల తిరిగి మూలధనీకరణ

 

      • పిఎస్‌బి ఆర్థిక సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి 2021-22లో రూ .20,000 కోట్లు

 

డిపాజిట్ బీమా

 

      • డిపాజిట్ భీమా కవరేజ్ మేరకు డిపాజిటర్లకు తమ డిపాజిట్లకు సులువుగా మరియు సమయానుసారంగా ప్రాప్యత పొందడానికి డిఐసిజిసి చట్టం, 1961 కు సవరణలు
      • సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ (సర్ఫేసి) చట్టం, 2002 ప్రకారం కనీస ఆస్తి పరిమాణం రూ. 100 కోట్లు ఉన్న ఎన్‌బిఎఫ్‌సి లకు రుణ రికవరీకి అర్హత ఉన్న కనీస రుణ పరిమాణం రూ. 50 లక్షల నుంచి రూ. 20 లక్షలకు తగ్గింపు

 

కంపెనీ వ్యవహారాలు

 

      • పరిమిత బాధ్యత భాగస్వామ్య (ఎల్‌ఎల్‌పి) చట్టం, 2008 ను డీక్రిమినలైజ్ చేయడం
      • కంపెనీల చట్టం, 2013 ప్రకారం చిన్న కంపెనీల యొక్క నిర్వచనాన్ని సవరించడం ద్వారా చెల్లింపు-మూలధనం కోసం వారి పరిమితులను రూ. 50 లక్షలు మించకుండానుండి రూ.2 కోట్లు మించకుండా, టర్నోవర్ రూ. 2 కోట్లు మించకుండానుండి రూ. 20 కోట్లు మించకుండాగా మార్పు
      • వన్ పర్సన్ కంపెనీల (ఒపిసి లు) విలీనాన్ని ప్రోత్సహించడం ద్వారా స్టార్టప్‌లు మరియు ఇన్నోవేటర్లను ప్రోత్సహించడం:
  • చెల్లింపు మూలధనం మరియు టర్నోవర్‌పై ఎటువంటి పరిమితులు లేకుండా వారి వృద్ధిని అనుమతిస్తుంది
  • ఏ సమయంలోనైనా ఇతర రకాల కంపెనీలోకి మార్చడానికి వీలు కల్పిస్తుంది,,
  • భారతీయ పౌరుడికి ఒపిసి ని ఏర్పాటు చేయడానికి రెసిడెన్సీ పరిమితిని 182 రోజుల నుండి 120 రోజులకు తగ్గించడం మరియు
  • భారతదేశంలో ఒపిసి లను చేర్చడానికి నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐ) ను అనుమతిస్తుంది
      • కేసులు వేగంగా పరిష్కారాన్ని నిర్ధారించడానికి:
  • ఎన్‌సిఎల్‌టి విధాన చట్రాన్ని బలోపేతం చేస్తోంది
  • ఇ-కోర్టుల వ్యవస్థను అమలు చేయడం
  • రుణ పరిష్కారం యొక్క ప్రత్యామ్నాయ పద్ధతుల పరిచయం మరియు ఎంఎస్ఎంఇ ల కోసం ప్రత్యేక చట్రం
      • 2021-22లో డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ నడిచే ఎంసిఎ 21 వెర్షన్ 3.0 ను ప్రారంభం

 

పెట్టుబడి మరియు వ్యూహాత్మక అమ్మకం

 

      • 2020-21 బడ్జెట్ అంచనాల ప్రకారం పెట్టుబడులు పెట్టడం ద్వారా రూ.1,75,000 కోట్ల ఆదాయం అంచనా
      • 2021-22లో బిపిసిఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ బ్యాంక్, బిఇఎమ్ఎల్, పవన్ హన్స్, నీలాచల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ మొదలైన వాటి వ్యూహాత్మక పెట్టుబడులు.
      • ఐడిబిఐ బ్యాంక్ కాకుండా, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేటీకరించబడతాయి
      • 2021-22లో ఐపిఒ కి ఎల్ఐసి
      • వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం కొత్త విధానం ఆమోదం; సిపిఎస్‌ఇ లలో నాలుగు వ్యూహాత్మక ప్రాంతాలలో మినహా మిగతావీ ప్రైవేటీకరణ
      • వ్యూహాత్మక పెట్టుబడుల కోసం తీసుకోవలసిన సిపిఎస్‌ఇల తదుపరి జాబితాను నీతి ఆయోగ్ రూపొందిస్తుంది
      • కేంద్ర నిధులను ఉపయోగించి, తమ ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రాలను ప్రోత్సహిస్తుంది
      • నిరుపయోగంగా ఉన్న భూమి ద్వారా డబ్బు ఆర్జించడానికి సంస్థ రూపంలో ప్రత్యేక ప్రయోజన వాహనం
      • ఖాయిలా లేదా నష్టాన్ని కలిగించే సిపిఎస్ఇ లను సకాలంలో మూసివేయడం కోసం సవరించిన యంత్రాంగాన్ని ప్రవేశపెట్టడం

 

ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలు

 

      • సార్వత్రిక అనువర్తనం కోసం స్వయంప్రతిపత్త సంస్థల కోసం ట్రెజరీ సింగిల్ అకౌంట్ (టిఎస్ఎ) వ్యవస్థ విస్తరించబడుతుంది
      • సహకార సంస్థల సులభతర వ్యాపారాన్ని క్రమబద్దీకరించడానికి ప్రత్యేక పాలనా వ్యవస్థ

 

3. ఆకాంక్ష భారత్ కోసం సమ్మిళిత అభివృద్ధి

 

v వ్యవసాయం

 

      • అన్ని వస్తువులలో ఉత్పత్తి ఖర్చు కంటే కనీసం 1.5 రెట్లు ఎం.ఎస్.పి ఉండేలా చూసుకోవాలి
      • క్రమంగా సేకరణ పెరగడంతో, రైతులకు చెల్లింపులు ఈ క్రింది విధాన పెరిగాయి:

(రూ.కోట్లలో)

 

2013-14

2019-20

2020-21

గోధుమ

రూ. 33,874

రూ. 62,802

రూ. 75,060

బియ్యం

రూ. 63,928

రూ. 1,41,930

రూ. 172,752

ఆహార ధాన్యాలు

రూ. 236

రూ. 8,285

రూ. 10,530

 

      • అన్ని రాష్ట్రాలు/యుటిలకు స్వమిత్వా పథకం విస్తరణ, 1,241 గ్రామాల్లో 1.80 లక్షల మంది ఆస్తి యజమానులకు ఇప్పటికే కార్డులు అందించబడ్డాయి
      • వ్యవసాయ రుణ లక్ష్యం ఆర్థిక సంవత్సరం 2022 లో రూ.16.5 లక్షల కోట్లు - పశుసంవర్ధకం, పాడి, మత్స్య సంపద పై ప్రత్యేక దృష్టి
      • గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని రూ. 30,000 కోట్లు నుండి 40,000 కోట్లకు పెంపు
      • మైక్రో ఇరిగేషన్ ఫండ్‌ను రెట్టింపు చేయడానికి రూ. 10,000 కోట్లు
      • వ్యవసాయం, అనుబంధ ఉత్పత్తులలో విలువ పెరుగుదలను పెంచడానికి ఆపరేషన్ గ్రీన్ స్కీమ్’ 22 నిల్వఉండని ఉత్పత్తులకు విస్తరించబడుతుంది.
      • సుమారు 1.68 కోట్ల మంది రైతులు నమోదు, ఇ-నామ్‌ల ద్వారా చేపట్టిన వాణిజ్యం రూ.1.14 లక్షల కోట్లు; పారదర్శకత మరియు పోటీతత్వాన్ని తీసుకురావడానికి 1,000 మంది మండిలను ఇ-నామ్‌తో అనుసంధానం.
      • మౌలిక సదుపాయాల పెంపు కోసం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధులను పొందటానికి ఎపిఎంసి లు

 

v మత్స్య రంగం

 

      • ఆధునిక ఫిషింగ్ నౌకాశ్రయాలు మరియు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు - సముద్ర మరియు లోతట్టు రెండు చోట్లా.
      • 5 ప్రధాన ఫిషింగ్ నౌకాశ్రయాలు - కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, పారాదీప్ మరియు పెటుఘాట్ ఆర్థిక కార్యకలాపాల కేంద్రాలుగా అభివృద్ధి చేయబడతాయి
      • సీవీడ్ సాగును ప్రోత్సహించడానికి తమిళనాడులోని బహుళార్ధసాధక సీవీడ్ పార్క్

 

v వలస పని వారు మరియు కార్మికులు

 

      • లబ్ధిదారులకు దేశంలో ఎక్కడైనా రేషన్లు పొందటానికి ‘ఒకే దేశం ఒకే రేషన్ కార్డు’ పథకం - వలస కార్మికులు ఎక్కువ ప్రయోజనం పొందటానికి
  • ఈ పథకం అమలు ఇప్పటివరకు 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 86% లబ్దిదారులకు చేరిక
  • మిగిలిన 4 రాష్ట్రాలను రాబోయే కొద్ది నెలల్లో అమలవుతాయి
      • అసంఘటిత శ్రామిక శక్తి, వలస కార్మికులపై సమాచారాన్ని సేకరించడానికి పోర్టల్, వారి కోసం పథకాలను రూపొందించడంలో సహాయపడుతుంది
      • 4 లేబర్ కోడ్‌ల అమలు జరుగుతోంది
  • గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ కార్మికులకు కూడా సామాజిక భద్రత ప్రయోజనాలు
  • అన్ని వర్గాల కార్మికులకు వర్తించే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద కనీస వేతనాలు మరియు కవరేజ్
  • రాత్రి షిఫ్టులతో సహా అన్ని వర్గాలలో మహిళా కార్మికులను తగిన రక్షణతో అనుమతించారు
  • ఒకే రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్, ఆన్‌లైన్ రాబడితో యజమానులపై సమ్మతి భారం తగ్గింది

 

v ఆర్థిక చేరిక

 

      • ఎస్సీ, ఎస్టీ, మహిళకు స్టాండ్ ఆప్ ఇండియా పథకం కింద,
  • మార్జిన్ మనీ అవసరం 15%కి తగ్గింపు
  • వ్యవసాయాధారిత కార్యకలాపాలకు కూడా రుణాలు
      • ఈ ఏడాది బడ్జెట్ అంచనాలకు మించి ఎంఎస్ఎంఇ రంగానికి రూ.15,700 కోట్ల బడ్జెట్ కేటాయింపు

 

4. మానవ మూల ధనం తిరిగి పుంజుకోవడం

 

v పాఠశాల విద్య

 

      • అన్ని ఎన్‌ఇపి భాగాలను అమలు చేయడం ద్వారా 15 వేల పాఠశాలలను బలోపేతం చేయాలి. ఇతరులకు మార్గదర్శకత్వం కోసం వారి ప్రాంతాలలో ఉదాహరణగా నిలిచేలా పాఠశాలలు రూపుదిద్దుకోవాలి
      • ఎన్జీఓలు/ప్రైవేట్ పాఠశాలలు/రాష్ట్రాల భాగస్వామ్యంతో 100 కొత్త సైనిక్ పాఠశాలలు ఏర్పాటు చేయబడతాయి

 

v ఉన్నత విద్య

      • నిర్దిష్ట ప్రామాణికత, అక్రిడిటేషన్, నియంత్రణ మరియు నిధుల కోసం 4 వేర్వేరు వాహనాలతో భారత ఉన్నత విద్యా కమిషన్‌ను గొడుగు సంస్థగా ఏర్పాటు చేయడానికి చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు
      • ఎక్కువ సినర్జీ కోసం నగరంలో ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు ఒకే గొడుగు అమరికలా తెచ్చే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం
  • 9 నగరాల్లో దీనిని అమలు చేయడానికి సంధానం చేసేలా గ్రాంట్
      • లద్దాఖ్ లో ఉన్నత విద్య మరింత చేరువ అయ్యేలా, లేహ్ లో కేంద్రీయ విశ్వవిద్యాలయం

 

v షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమం

      • గిరిజన ప్రాంతాల్లో 750 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు
  • ప్రతి స్కూల్ యూనిట్ వ్యయాన్ని రూ. 38 కోట్లకు పెంపు
  • కొండ ప్రాంతాలు, క్లిష్టతరమైన ప్రాంతాల్లో రూ. 48 కోట్లు
  • గిరిజన ప్రాంతాల్లో బలీయమైన మౌలిక సౌకర్యాలపై దృష్టి
      • ఎస్సీల సంక్షేమం కోసం పునరుద్ధరించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ పథకం
  • 2025-2026 వరకు 6 ఏళ్లపాటు రూ. 35,219 కోట్ల విస్తరించిన కేంద్ర సహాయం
  • 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు ప్రయోజనం

 

  • నైపుణ్య శిక్షణ

 

    • అప్రెంటిస్ చట్ట సవరణకు ద్వారా యువతకు అవకాశాలు పెంచే ప్రతిపాదన
    • ఇప్పుడున్న జాతీయ అప్రెంటిస్ శిక్షణా పథకం (ఎన్ఎటిఎస్) ను ఇంజనీరింగ్, డిప్లొమా విద్యార్థులకు చదువు తరువాత అప్రెంటిస్ షిప్ సౌకర్యంతో అనుసంధానం చేయటానికి రూ. 3,000 కోట్లు
    • నైపుణ్యం పెంచే క్రమంలో ఇతర దేశాల భాగస్వామ్యానికి మొగ్గు చూపటానికి చర్యలు:
  • నైపుణ్య అర్హతలు నిర్దేశించటానికి, మూల్యాంకనానికి, ధృవపత్రాలు ఇచ్చి అలా ధ్రువపత్రాలు పొందిన సిబ్బందికి ఉద్యోగం కల్పించటానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో భాగస్వామ్యం
  • అంతర్ శిక్షణ కార్యక్రమల శిక్షణ ద్వారా నైపుణ్యాల మార్పిడికి, మెలకువలు, పరిజ్ఞానాన్ని పరస్పరం అందిపుచ్చుకోవటానికి జపాన్ తో సహకార భాగస్వామ్యం

 

  1. నవకల్పన, పరిశోధన-అభివృద్ధి

 

  • 2019 జులై లో ప్రకటించిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ విధివిధానాలు:
  • ఐదేళ్లకు గానురూ. 50,000 కోట్ల కేటాయింపు
  • మొత్తంగా జాతీయ ప్రాధాన్యతా రంగాల మీద దృష్టి సారించి పరిశోధన వాతావారణాన్ని బలోపేతం చేయటం
  • డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించటానికి ప్రతిపాదించిన పథకానికి రూ. 1,500 కోట్లు
  • జాతీయ భాషా అనువాద మిషన్ (ఎన్ టి ఎల్ ఎం) ద్వారా పాలనకు, విధానాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలలో లభ్యమయేట్టు చూడటం
  • న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) ప్రయోగించే పిఎస్ఎల్ వి సిఎస్ 51 ద్వారా బ్రెజిల్ వారి అమెజోనియా, ఉపగ్రహంతోబాటు మరికొన్ని భారతీయ ఉపగ్రహాల ప్రయోగం
  • గగన్ యాన్ మిషన్ కార్యకలాపాల ద్వారా:
  • రష్యాలో అంతరిక్ష యానం మీద నలుగురు వ్యోమగాములకు శిక్షణ
  • 2021 డిసెంబర్ నాటికి మానవరహిత ప్రయోగం
  • సముద్ర అంతర్భాగంలో జీవ వైవిధ్యాన్ని శోధించి, పరిరక్షించటం కోసం సర్వే జరపటానికి వచ్చే ఐదేళ్ల కాలానికి రూ. 4,000 కోట్లు

 

  1. ప్రభుత్వాధికారం తక్కువ, పాలన ఎక్కువ

 

  • సత్వర న్యాయం అందేలా ట్రైబ్యునల్స్ లో సంస్కరణలు తీసుకువచ్చే చర్యలు సాగుతున్నాయి.
  • ఆరోగ్య సంబంధ వృత్తినిపుణుల జాతీయ కమిషన్ ఇప్పటికే ప్రవేశపెట్టబడింది. ఇది 56 ఆరోగ్య సంబంధ వృత్తినిపుణుల నియంత్రణను పారదర్శకంగాను, సమర్థవంతంగాను జరిగేటట్టు చూస్తుంది.
  • అదే క్రమంలో నర్సింగ్ వృత్తిలో ఉండేవారికోసం నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కమిషన్ బిల్లు ప్రవేశపెట్టబడింది.
  • సిపిఎస్ఇ లతో కాంట్రాక్టు ఒప్పందాల సంబంధిత వివాదాల సత్వర పరిష్కారం కోసం ఒక సయోధ్య యంత్రాంగాన్ని ప్రతిపాదించటమైనది.
  • భారతదేశ చరిత్రలో తొలి డిజిటల్ జనాభా లెక్కల కార్యక్రమానికి రూ. 3768 కోట్ల కేటాయింపు జరిగింది.
  • పోర్చుగీసు వారి నుంచి విముక్తి పొందిన సందర్భంగా గోవా జరుపుకుంటున్న వజ్రోత్సవాల కోసం రూ. 300 కోట్లు ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తోంది.
  • అస్సాం, పశ్చిమ బెంగాల్ లోని తేయాకు కార్మికుల సంక్షేమం కోసం, మరీ ముఖ్యంగా మహిళలు, వారి పిల్లల కోసం రూపుదిద్దుకునే పథకానికి రూ. 1000 కోట్లు

 

ద్రవ్య పరిస్థితి

 

అంశం

తొలుత బడ్జెట్ అంచనా 2020-21

సవరించిన అంచనా 2020-21

బడ్జెట్ అంచనా 2021-22

వ్యయం

`30.42 లక్షల కోట్లు

`34.50 లక్షల కోట్లు

`34.83 లక్షల కోట్లు

మూలధన వ్యయం

`4.12 లక్షల కోట్లు

`4.39 లక్షల కోట్లు

` 5.5 లక్షల కోట్లు

ద్రవ్య లోటు (జిడిపి లో % గా)

-

9.5%

6.8%

 

  • వ్యయానికి సవరించిన అంచనా రూ. 34.50 లక్షల కోట్లు కాగా తొలుత అసలు బడ్జెట్ అంచనా రూ. 30.42 లక్షల కోట్లు
  • బడ్జెట్ అంచనా 2020-21 సంవత్సరానికి రూ. 4.12 లక్షల కోట్లు కాగా సవరించిన అంచనా ప్రకారం రూ2020-2021 సంవత్సరానికి రూ. 4.39 లక్ష ల కోట్లు కావటం వలన వ్యయ నాణ్యతను పాటించినట్టు భావించాలి.
  • 2021-22 బడ్జెట్ అంచనాలకు రూ. 34.83 లక్షల కోట్లు ప్రతిపాదించగా అందులో రూ.5.5 లక్షల కోట్ల మూలధనవ్యయం కూడా కలిసి ఉంది. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా ఇది 34.5% అధికం.
  • 2021-22 బడ్జెట్ అంచనాలో ద్రవ్య లోటు అంచనా స్థూల జాతీయోత్పత్తిలో 6.8% గా అంచనా వేశారు. సవరించిన అంచనాల ప్రకారం 2020-21 లో ద్రవ్యలోటు స్థూల జాతీయోత్పత్తిలో 9.5%. దీనికోసం ప్రభుత్వ రుణాలు, బహుళపక్ష రుణ సేకరణ, చిన్నమొత్తాల పొదుపు నిధులు, స్వల్ప కాలిక రుణాల ద్వారా సేకరిస్తారు.
  • మార్కెట్ నుంచి సేకరించే స్థూల రుణాలు వచ్చే సంవత్సరానికి సుమారు 12 లక్షల కోట్లు ఉంటుంది.
  • ద్రవ్య లోటును క్రమంగా తగ్గించే మార్గాన్నే అనుసరిస్తూ ద్రవ్యలోటును 2025-20 నాటికి స్థూల జాతీయోత్పత్తిలో 4.5% కంటే తక్కువగా ఉండేలా చూడాలని నిర్ణయించారు.
  • పన్ను చెల్లింపులను ప్రోత్సహించటం, ఎగవేతలు నిరోధించటం ద్వారా దీన్ని సాధించాలని నిర్ణయించారు. అదే సమయంలో ఆస్తుల అమ్మకం ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థల భూముల అమ్మకం ద్వారా నిధులు సమకూర్చుకుంటారు.
  • ఈ ఏడాది ఎదురైన కనీవినీ ఎరుగని, అనూహ్యమైన పరిస్థితుల దృష్ట్యా ఎఫ్ఆర్ బిఎం చట్టం లోని సెక్షన్ 4 (5), 7(3)(బి) కింద అవసరమైన డీవియేషన్ స్టేట్ మెంట్ ను సమర్పించారు.
  • లక్ష్యంగా పెట్టుకున్న ద్రవ్య లోటు స్థాయిని సాధించటానికి ఎఫ్ఆర్ బిఎం చట్టానికి సవరణలు ప్రతిపాదించారు.
  • భారత అత్యవసర నిధిని ఆర్థిక బిల్లు ద్వారా రూ. 500 కోట్ల నుంచి రూ. 30,000 కోట్లకు పెంచుతున్నారు.

 

రాష్ట్రాలు తీసుకున్న నికర అప్పులు:

 

  • 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలు తీసుకోవటానికి వీలున్న నికర రుణాలను 2021-2022 లో స్థూల జాతీయోత్పత్తిలో 4% వరకు అనుమతించారు.
  • ఇందులో కొంత భాగం మూలధన వ్యయంలో పెంపుకు కేటాయించారు.
  • పరిస్థితిని బట్టి అవసరమైతే స్థూల జాతీయోత్పత్తిలో అదనంగా 0.5% అదనంగా అప్పు తీసుకోవచ్చు.
  • 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాలు 2023-24 నాటికి ద్రవ్యలోటు స్థూల జాతీయోత్పత్తిలో 3% కు చేరవచ్చు.

 

15వ ఆర్థిక సంఘం:

  • 2021-26 మధ్య కాలానికి సంబంధించిన తుది నివేదిక రాష్ట్రపతికి సమర్పించబడింది. రాష్ట్రాల వాటా 41% కొనసాగుతుంది.
  • జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులను కేంద్రమే అందిస్తుంది.
  • ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రెవెన్యూ లోటు గ్రాంటుగా 2021-22 సంవత్సరానికి 17 రాష్ట్రాలకు రూ. 1,18,452 కోట్లు అందించాలని ప్రతిపాదించగా 2020-21 లో అది 14 రాష్ట్రాలకు రూ. 74,340 కోట్లుగా ఉంది.

 

పన్ను ప్రతిపాదనలు

 

  • పెట్టుబడులను ప్రోత్సహించేలా, దేశంలో ఉపాధి పెంచేలా పారదర్శకమైన, సమర్థమైన పన్ను వ్యవస్థ తీర్చిదిద్దటం లక్ష్యం పెట్టుకుంది., అదే సమయంలో పన్ను చెల్లింపుదారుల మీద భారం కూడా కనీస స్థాయిలో ఉండాలని భావిస్తోంది.

 

  1. ప్రత్యక్ష పన్నులు

 

సాధనలు

  • కార్పొరేట్ పన్నును ప్రపంచంలోనే అతి తక్కువ ఉండేలా తగ్గించబడింది.
  • రిబేట్లు ఇవ్వటం ద్వారా చిన్న పన్ను చెల్లింపుదారుల మీద భారం తగ్గించబడింది.
  • పన్ను రిటర్న్ ల దాఖలు దాదాపు రెట్టింపైంది. 2014 లో 3.31 కోట్లు ఉండగా 2020 నాటికి 6.48 కోట్లు అయింది.
  • ప్రత్యక్షంగా హాజరు కానవసరం లేని మదింపు, అప్పీలు ప్రవేశపెట్టబడ్డాయి.

 

సీనియర్ సిటిజెన్లకు ఊరట:

 

  • 75 ఏళ్ళు పైబడ్డ సీనియర్ సిటిజెన్లకు. పెన్షన్, వడ్దీ ఆదాయాలు మాత్రమే వచ్చేవారికి పన్ను రిటర్న్ ల దాఖలు నుంచి మినహాయింపు; చెల్లించే బ్యాంకే పన్ను మినహాయిస్తుంది.
  • వివాదాల తగ్గింపు, పరిష్కారాలు సరళతరం:
  • కేసుల పునఃప్రారంభ వ్యవధి ఆరేళ్ల నుంచి మూడేళ్లకు కుదింపు
  • తీవ్రమైన పన్ను ఎగవేత కేసుల్లో ఏడాదిలో 50 లక్షలు, లేదా అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని దాచిపెట్టినట్టు సాక్ష్యం ఉంటే 10 ఏళ్లలోపు మాత్రమే పునఃప్రారంభించవచ్చు. దీనికి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆమోదం తెలపాలి.
  • పన్ను విధించాల్సిన ఆదాయం 50 లక్షల వరకు ఉన్నా, వివాదంలో ఉన్న ఆదాయం 10 లక్షలు ఉన్నా అలాంటి వాళ్లకోసం వివాదాల పరిష్కార కమిటీ ఏర్పాటు
  • పరోక్ష మదింపు దిశలో జాతీయ పన్ను మదింపు అప్పెలేట్ ట్రైబ్యునల్ కేంద్రం ఏర్పాటు
  • ‘వివాద్ సే విశ్వాస్’ పథకం కింద 2021 జనవరి 30 వరకు రూ.85,000 కోట్ల విలువచేసే వివాదాలను లక్ష మందికి పైగా చెల్లింపుదారులు పరిష్కరించుకున్నారు.

 

ప్రవాస భారతీయులకు మినహాయింపు:

 

  • ప్రవాస భారతీయుల విదేశీ రిటైర్మెంట్ ఖాతాల విషయంలొ ఎదురయ్యే ఇబ్బందులు తొలగించటానికి నియమాల సదలింపు

 

డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహకాలు:

  • 95% లావాదేవీలు డిజిటల్ పద్ధతిలో నిర్వహించే సంస్థల పన్ను ఆడిట్ కు పరిమితి రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు పెంపు

 

డివిడెండ్ కు ఊరట:

  • ఆర్ఇఐటి/ఐఎన్ విఐటి కి చెల్లించే డివిడెండ్ కు టిడిఎస్ నుంచి మినహాయింపు
  • ప్రకటించిన/చెల్లించిన తరువాత మాత్రమే డివిడెండ్ ఆదాయం మీద అడ్వాన్స్ పన్ను బాధ్యత
  • విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల డివిడెండ్ ఆదాయం మీద పన్ను తగ్గింపుకు తక్కువ రేట్లు

 

మౌలిక వసతుల కోసం విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం:

  • జీరో కూపన్ బాండ్ల జారీ ద్వారా మౌలికసదుపాయాల రుణనిధి పెంచుకోవటానికి అర్హత
  • ప్రైవేట్ ఫండింగ్, వాణిజ్య కార్యకలాపాల మీద ఆంక్షలు, ప్రత్యక్ష పెట్టుబడి వంటి విషయాలలో కొన్ని నిబంధనల సడలింపు

 

అందరికీ గృహవసతి మద్దతు:

      • ఒకటిన్నర లక్ష రూపాయల మొత్తం వరకూ వడ్డీలో అదనపు కోత. అందుబాటు ధరల్లోని ఇళ్ల కొనుగోలుకు తీసుకున్న రుణంపై ఈ ఏర్పాటును 2022సంవత్సరం మార్చి నెల వరకూ తీసుకున్న రుణానికి వర్తింపజేస్తారు·
      • అందుబాటు ధరల్లోని ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు వర్తింపజేసే టాక్స్ హాలిడేని 2022, మార్చి వరకూ పొడిగించారు.
      • నోటిఫై చేసిన అందుబాటు ధరల్లోని అద్దె గృహాల నిర్మాణానికి పన్ను మినహాయింపును అనుమతించారు.

 

గిఫ్ట్ (జి.ఐ.ఎఫ్.టి) సిటీలో అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రానికి (ఐ.ఎఫ్.ఎస్.సి.కి) పన్ను ప్రోత్సాహకాలు:

 

      • విమానాల లీజింగ్ కంపెనీల నుంచి వచ్చే ఆదాయానికి సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్ కు టాక్స్ హాలిడే సదుపాయం వర్తింపు
      • విదేశీ లీజుదారులకు చెల్లించిన లీజు రెంటల్ మొత్తంపై పన్ను మినహాయింపు
      • ఐ.ఎఫ్.ఎస్.సి.లో విదేశీ నిధుల తరలింపునకు పన్ను మినహాయింపు
      • ఐ.ఎఫ్.ఎస్.సి. పరిధిలోని విదేశీ బ్యాంకుల పెట్టుబడి డివిజన్ కు పన్ను మినహాయింపు

 

పన్ను చెల్లింపు సులభతరం:

 

      • జాబితాలో పొందుపరిచిన సెక్యూరిటీల నుంచి క్యాపిటల్ గెయిన్స్, డివిడెండ్ ఆదాయం, బ్యాంకుల నుంచి వడ్డీ వంటి వివరాలను రిటర్నుల ధాఖలు సమయంలో ముందస్తుగా భర్తీ చేయవలసి ఉంటుంది. 

 

చిన్న ట్రస్టులకు ఉపశమనం:

 

      • పాఠశాలలను, ఆసుపత్రులను నిర్వహిస్తున్న చిన్న ధర్మాదాయ ట్రస్టుల వార్షిక వసూళ్లపై మినహాయింపు కోటి రూపాయల నుంచి ఐదుకోట్ల రూపాయలకు హెచ్చింపు

 

కార్మిక సంక్షేమం:

      • ఉద్యోగి వాటా సొమ్మును యాజమాన్య సంస్థ ఆలస్యంగా దాఖలు చేయడాన్ని అనుమతించే వీలులేదు.
      • టాక్స్ హాలిడే అర్హత కోసం స్టార్టప్ కంపెనీల క్లెయిము గడువు మరో ఏడాది పొడిగింపు
      • స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడికి క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపును 2022 మార్చి నెలాఖరు వరకు పొడిగింపు

 

2. పరోక్ష పన్నులు

 

వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.):

 

  • ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు:
  • రిటర్సులు లేనపుడు ఎస్.ఎం.ఎస్. ద్వారా దాఖలు
  • చిన్న పన్ను చెల్లింపుదార్లకు త్రైమాసిక, నెలసరి చెల్లింపు విధానం
  • ఎలెక్ట్రానిక్ ఇన్వాయిస్ వ్యవస్థ
  • క్రమబద్ధీకరించిన ఇన్ పుట్ పన్ను ప్రకటన
  • సవరణకు వీలున్న ముందస్తు జి.ఎస్.టి. రిటర్ను వివరాలు
  • రిటర్న్ దాఖలులో అస్థితర తొలగింపు
  • వస్తుసేవలపన్ను వ్యవస్థ పరిధిని విస్తరించడం
  • పన్ను ఎగవేతదార్ల గుర్తింపుకోసం విశ్లేషణాత్మక పద్ధతులు, కృత్రిమ మేథో పరిజ్ఞాన ప్రక్రియల వినియోగం

 

కస్టమ్స్ సుంకం హేతుబద్ధీకరణ:

 

      • జంట లక్ష్యాలు: స్వదేశీ తయారీని ప్రోత్సహించి, ప్రపంచ స్థాయి విలువల వ్యవస్థలో భారత్ స్థానం సంపాదించేలా, మెరుగైన ఎగుమతులు సాధించేలా కృషి.
      • కాలదోషం పట్టిన 80 మినహాయింపులను ఇప్పటికే తొలగించారు.
      • సవరించిన,.. వక్రీకరణకు అవకాశం లేని కస్టమ్స్ సుంకం వ్యవస్థను 2021, అక్టోబరు 1 నుంచి అమలుచేసేందుకు చర్యలు. 400కు పైగా పాత మినహాయింపులను సమీక్షించడం ద్వారా ఈ కొత్త సుంకం వ్యవస్థకు రూపకల్పన
      • కస్టమ్స్ సుంకంలో కొత్త మినహాయింపులకు మార్చి 31వరకూ చెల్లుబాటయ్యే అవకాశం. జారీ తేదీ నుంచి రెండేళ్లు అమలు.

 

ఎలక్ట్రానిక్ పరిశ్రమ, మొబైల్ ఫోన్ పరిశ్రమ:

 

      • మొబైల్ చార్జర్ల విడిభాగాలు, మొబైళ్ల విడిభాగాలపై కొన్ని మినహాయింపులను ఉపసంహరించారు.
      • కొన్ని మొబైల్ విడిభాగాలపై ఇది వరకు సున్నా రేటున్న సుంకాన్ని 2.5 శాతం వరకు హెచ్చించారు.  

 

ఇనుము, ఉక్కు:

 

      • మిశ్రమ లోహాలు, మిశ్రమేతర లోహాలు, స్టెయిన్ లెస్ స్టీల్ వంటి వాటితో తయారైన ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని ఏకరూపంగా 7.5 శాతం వరకూ పెంచారు.
      • ఉక్కు రద్దీపై సుంకాన్ని మినహాయించారు.  2022 మార్చి నెలాఖరు వరకూ వర్తించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.
      • కొన్ని ఉక్కు ఉత్పాదనలపై యాంటీ డంపింగ్ సుంకాన్నీ (ఎ.డి.డి.ని), కౌంటర్ వీలింగ్ సుంకాన్ని (సి.వి.డి.ని) రద్దు చేశారు·
      • రాగి రద్దీపై సుంకాన్ని 5 శాతం నుంచి 2.5శాతానికి తగ్గించారు.

 

టెక్స్ టైల్స్

      • కాప్రోలాక్టమ్, నైలాన్ చిప్స్, నైలాన్ ఫైబర్, నూలు వంటి వాటిపై మౌలిక కస్టమ్స్ సుంకాన్ని (బి.సి.డి.ని) 5 శాతానికి తగ్గించారు. 

రసాయనాలు:

      • రసాయనాలపై స్వదేశీ విలువల జోడింపును ప్రోత్సహించేందుకు, అస్థితరతను తొలగించేందుకు రసాయనాలపై క్రమాంకణ కస్టమ్స్ సుంకం రేట్ల అమలు.
      • నాప్తాపై సుంకం 2.5శాతానికి తగ్గింపు

 

బంగారం, వెండి:

 

· బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని హేతబద్ధం చేయనున్నారు.

 

పునరుత్పత్తి విద్యుత్తు:

 

      • సోలార్ సెల్స్, సోలార్ ప్యానెళ్ల దశలవారీ తయారీ ప్రణాళికను నోటిఫై చేయడం
      • స్వదేశీ తయారీకి ప్రోత్సాహం కోసం సోలార్ ఇన్వర్టర్లపై సుంకం 5 శాతం నుంచి 20 శాతానికి హెచ్చింపు. సోలార్ లాంతర్లపై సుంకం 5 శాతం నుంచి 15 శాతానికి హెచ్చింపు.

 

క్యాపిటల్ పరికర సామగ్రి:

 

      • టన్నెల్ బోరింగ్ యంత్రంపై ఇక 7.5 శాతం కస్టమ్స్ సుంకం; యంత్రం విడిభాగాలపై డ్యూటీ 2.5 శాతం.
      • కొన్ని ఆటోమొబైల్ విడిభాగాలపై సుంకం 15 శాతం సాధారణ రేటు స్థాయికి పెంపు. 

 

సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల(ఎం.ఎస్.ఎం.ఇ.) ఉత్పాదనలు:

 

      • స్టీల్ స్క్రూలు, ప్లాస్టిక్ బిల్డర్ వేర్ పరికరాలపై సుంకం 15 శాతానికి హెచ్చింపు
      • రొయ్యల ఫీడ్ పై ఇదివరకు 5శాతం ఉన్న కస్టమ్స్ సుంకం 15 శాతానికి హెచ్చింపు
      • దుస్తులు, తోళ్లు, చేతిపని వస్తువులు వంటి వాటి ఎగుమతిదార్లకు ప్రోత్సహకాలు అందించేందుకు వీలుగా, సుంకంలేని వస్తువుల దిగుమతికి మినహాయింపు వ్యవస్థను హేతుబద్ధం చేశారు.
      • కొన్ని రకాల తోళ్ల దిగుమతులపై మినహాయింపుల ఉపసంహరణ.
      • స్వదేశీ జెమ్స్ ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రోత్సహించేందుకు సింథటిక్స్ జెమ్ స్టోన్స్ పై కస్టమ్స్ సుంకం హెచ్చింపు.

 

వ్యవసాయ ఉత్పాదనలు:

 

      • నూలుపై కస్టమ్స్ సుంకం సున్నా స్థాయి నుంచి పది శాతానికి హెచ్చింపు. ముడి పట్టు, పట్టు దారంపై సుంకం 10 నుంచి 15 శాతానికి హెచ్చింపు. 
      • తుదిదశలో వినియోగం ప్రాతిపదికన డీనేచర్డ్ ఇథైల్ ఆల్కహాలుపై ఇచ్చే రాయితీ ఉపసంహరణ.
      • కొన్ని వస్తువులపై వ్యవసాయ మౌలిక సదుపాయాల, అభివృద్ధి సుంకం విధింపు

 

హేతుబద్ధీకరణ ప్రక్రియలు, సరళీకరణ:

 

      • ట్యురాంట్ కస్టమ్స్ చర్యలు, కస్టమ్స్ సుంకంపై మానవ ప్రమేయం లేని, కాగిత రహిత చర్యలు. చేతితో తాకాల్సిన అవసరంలేని చర్యలు.
      • ఆవిర్భావ నిబంధనల అమలుకు కొత్త ప్రక్రియ

 

కొవిడ్-19 వ్యాప్తి సమయంలో సాధించిన విజయాలు, చేరుకున్న మైలురాళ్లు

 

      • ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పి.ఎం.జి.కె.వై.):
  • రూ. 2.76 లక్షల కోట్ల విలువైన కార్యక్రమం
  • 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహారధాన్యాలు
  • 8 కోట్ల కుటుంబాలకు ఉచిత వంటగ్యాస్
  • 40 కోట్ల మంది రైతులకు, మహిళలకు, వయోజనులకు, నిరుపేదలకు, అవసరమైన ఇతరులకు నేరుగా నగదు బదిలీ
      • ‘ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ’ (ఎ.ఎన్.బి. -1.0):
  • రూ. 23 లక్షల కోట్ల అంచనా స్థూల స్వదేశీ ఉత్పాదన (జి.డి.పి.)లో 10 శాతానికి సమానం.
      • పి.ఎం.జి.కె.వై., 3 ఎ.ఎన్.బి. ప్యాకేజీలు (ఎ.ఎన్.బి.1.0, 2.0, 3.0), ఆ తర్వాత చేసిన ప్రకటనలే ఏకంగా 5 మినీ బడ్జెట్ల వంటివి.
      • రిజర్వ్ బ్యాంకు చర్యలతో సహా 3 ఎ.ఎన్.బి. ప్యాకేజీల ఆర్థిక ప్రభావం విలువ రూ. 27.1 లక్షల కోట్లు ఇది జి.డి.పి.లో 13 శాతం కంటే ఎక్కువ
      • వ్యవస్థీకృత సంస్కరణలు:
  • ఒకదేశం ఒకే రేషన్ కార్డు
  • వ్యవసాయ, కార్మిక సంస్కరణలు
  • ఎం.ఎస్.ఎం.ఇ లను తిరిగి నిర్వచించడం
  • ఖనిజ వనరులను వాణిజ్యబద్ధం చేయడం
  • ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ
  • ఉత్పత్తితో ముడివడిన ప్రోత్సాహక పథకాలు
      • కొవిడ్-19పై భారతదేశం పోరాటం స్థాయి:
  • భారత్ లో తయారైన రెండు వ్యాక్సీన్లు భారతీయ పౌరులకు, వందకు పైగా దేశాల పౌరులకు కొవిడ్ నుంచి వైద్యపరమైన రక్షణ కల్పించడం.
  • త్వరలో వెలువడనున్న మరో రెండు వ్యాక్సీన్లు
  • పది లక్షల జనాభా ప్రాతపదికన తగ్గిన మరణాల రేటు, తగ్గిన క్రియాశీలక కేసులు

 

2021 –భారతీయ చరిత్రలో పలు మైలు రాళ్ళను దాటిన సంవత్సరం

 

      • 75వ భారతదేశ స్వాతంత్య్ర వార్షికోత్సవ సంవత్సరం
      • గోవా భారత్ లో విలీనమై 60 ఏళ్లు
      • 1971 ఇండియా-పాక్ యుద్ధానికి 50 ఏళ్లు
      • స్వతంత్ర భారత్ లో 8వ జనగణన సంవత్సరం
      • బ్రిక్స్ దేశాల కూటమికి భారత్ నాయకత్వం వహించే అవకాశం
      • చంద్రయాన్-3 యాత్ర జరిగే సంవత్సరం
      • హరిద్వార్ మహాకుంభ్.

 

‘ఆత్మనిర్భర్ భారత్’ దార్శనికత

      • ‘ఆత్మనిర్భరత’ ఇది కొత్త భావన కానేకాదు ప్రాచీన కాలంలోనే భారత్ స్వావలంబనతో మనుగడ సాగించింది. ప్రపంచానికే వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది.
      • ‘ఆత్మనిర్భర్ భారత్’ తమ సామర్థ్యం, నైపుణ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం కలిగిన 130 కోట్ల మంది భారతీయుల భావ వ్యక్తీకరణ.
      • ఈ కింది సంకల్పాలను బలోపేతం చేయడమే ధ్యేయం:
  • దేశమే ప్రథమం
  • రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం
  • బలమైన మౌలిక సదుపాయాల వ్యవస్థ
  • ఆరోగ్యవంతమైన భారతదేశం
  • సుపరిపాలన
  • యువతకు తగిన అవకాశాలు
  • అందరికీ విద్య
  • మహిళా సాధికారత
  • సమ్మిళిత అభివృద్ధి
      • 2015-16వ సంవత్సరపు కేంద్ర బడ్జెట్ లో 13 వాగ్దానాలు చేశారు. ఆత్మనిర్భర భారత్ దార్శనికతను ప్రతిధ్వనింపజేస్తూ, 2022లో అమృత మహోత్సవం కోసం ఇపుడు, 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంవత్సరాన ప్రణాళిక వేసుకుంటున్నాం.

 

విశ్వాసం అనేది కాంతిని ముందే పసిగట్టే పక్షి వంటిది. తొలి సంధ్యలో ఇంకా చీకట్లు తొలగకపోయినా అది గొంతెత్తి పాడుతుంది.

రవీంద్రనాథ్ ఠాగోర్

                                                                      

****

 

 

 


(Release ID: 1694241) Visitor Counter : 3095