ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఔత్సాహిక భారతదేశ సమగ్ర అభివృద్ధిలో భాగంగా వ్యవసాయ,  అనుబంధ రంగాలు, రైతు సంక్షేమం మరియు గ్రామీణ భారతదేశంకోసం 9 చర్యలను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు

అన్ని రాష్ట్రాలు / యుటిలకు విస్తరించడానికి SWAMITVA పథకం

వ్యవసాయ పరపతి లక్ష్యాన్ని రూ.16.5 లక్షల కోట్లకు పెంచాల్సి ఉంది.

గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి 33 శాతం పెరిగింది

మైక్రో ఇరిగేషన్ ఫండ్ రెట్టింపు అయ్యింది

ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ - మరో 22 పాడైపోయే ఉత్పత్తులను చేర్చడానికి ‘టాప్స్’

ఇంకా 1,000 మంది మండిలను ఇ-నామ్‌తో అనుసంధానించాలి

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని పొందడం కొరకు ఎ.పి.ఎమ్.సి.ఎస్.

5 ప్రధాన ఫిషింగ్ హార్బర్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదనతమిళనాడులో మల్టీపర్పస్ సీవీడ్ పార్క్ ఏర్పాటు 

Posted On: 01 FEB 2021 1:45PM by PIB Hyderabad

వ్యవసాయ‌మే ఆధారంగా నివ‌సిస్తున్న‌ రైతుల సంక్షేమానికి  ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. పంట‌ల‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర (ఎంఎస్‌పీ) అందించే విష‌య‌మై ఇటీవ‌ల కాలంలో గ‌ణనీయ‌మైన మార్పులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దేశఃలో వ్య‌వ‌సాయోత్ప‌త్తుల ఎంఎస్‌పీ వ్య‌యం కంటే కనీసం 1.5 రెట్లు మేర‌ అధికంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మైంది. వ్య‌వ‌సాయోత్ప‌త్తుల సేక‌ర‌ణ కూడా స్థిర వేగంతో పెరుగుతూ వ‌స్తోంది. దీంతో మ‌న‌ రైతులకు చెల్లింపులు కూడా గణనీయంగా పెరిగాయి. గోధుమల సేక‌ర‌ణ విష‌యమే తీసు‌కుంటే 2013-2014లో ఈ రైతులకు చెల్లించిన మొత్తం రూ.33,874 కోట్లు. 2019-2020 వ‌చ్చేస‌రికి ఇది రూ.62,802 కోట్ల‌కు చేరింది. 2020-2021లో ఇది మ‌రింత మెరుగుప‌డి రైతులకు చెల్లించిన మొత్తం రూ.75,060 కోట్ల‌కు చేరుకుంది. 2019-20లో 35.57 లక్షలతో పోలిస్తే 2020-21లో లబ్ధి పొందిన గోధుమల రైతుల సంఖ్య 43.36 లక్షలకు పెరిగింది. వరి పంట‌ విష‌యానికి వ‌స్తే .. ఈ పంట వేసిన రైతుల‌కు 2013-14లో చెల్లించిన మొత్తం రూ.63,928 కోట్లుగా ఉంది. 2019-2020లో ఇది దాదాపు రూ.1,41,930 కోట్లకు పెరిగింది. 2020-2021లో ఇది మరింతగా పెరిగి రూ.172,752 కోట్ల‌కు చేరింది. రైతుల ప్రయోజనం 2019-20లో 1.24 కోట్ల నుండి 2020-21లో 1.54 కోట్లకు పెరిగింది. అదే పంథాలో, పప్పు ధాన్యాల విషయానికి వ‌స్తే..  2013-2014లో చెల్లించిన మొత్తం రూ.236 కోట్ల నుంచి 2019-20 నాటికి రూ.8,285 కోట్ల‌కు చేరింది. ఇప్పుడు, తాజాగా 2020-2021లో ఇది రూ.10,530 కోట్లుగా నిలిచింది. 2013-14తో పోలిస్తే ఇది దాదాపు 40 రెట్లు ఎక్కువ. పత్తి రైతులకు చెల్లింపులు 2013-14లో రూ.90 కోట్లుగా ఉండ‌గా ఇది ప్ర‌స్తుతం (2021 జనవరి 27 నాటికి) గ‌ణ‌నీయంగా పెరిగి రూ.25,974కోట్ల‌కు చేరుకుంది.
ఈ సంవత్సరం ఆరంభంలో గౌరవ ప్రధానమంత్రి స్వామిత్వా పథకాన్ని ప్రారంభించారు. దీని కింద గ్రామాల్లోని ఆస్తి యజమానులకు రికార్డు హక్కులివ్వ‌నున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,241 గ్రామాల్లో సుమారు 1.80 లక్షల మంది ఆస్తి యజమానులకు కార్డులు అందించారు.
2021- 2022 ఆర్థిక సంవ‌త్స‌ర‌ మధ్యకాలంలో దీనిని అన్ని రాష్ట్రాలు/ కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ను కవర్ చేయడానికి వీలుగా విస్తరించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. మన రైతులకు తగిన రుణ స‌దుపాయాన్ని అందుబాటులో ఉంచేందుకు గాను , ప్రభుత్వం వ్యవసాయ రుణ లక్ష్యాన్ని

 


2022 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.16.5 లక్షల కోట్లుగా నిర్ధారించింది. దీనికి తోడు కేంద్రం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి కేటాయింపుల‌ను రూ.30,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల‌కు పెంచింది. నాబార్డ్ కింద రూ.5 వేల కోట్ల కార్పస్‌తో ఏర్పాటు చేసిన మైక్రో ఇరిగేషన్ ఫండ్‌ను రెట్టింపు చేయాల‌ని నిర్ణ‌యించారు. వ్యవసాయం, అనుబంధ ఉత్పత్తులు మరియు వాటి ఎగుమతుల్లో విలువ పెరుగుదలను పెంచేలా ఒక కీల‌క‌ ప్రకటన చేయ‌డ‌మైంది.
ప్రస్తుతం టమోటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలకు వర్తింప చేస్తున్న‌ ‘ఆపరేషన్ గ్రీన్ స్కీమ్’ పరిధిని మ‌రో 22 త్వ‌ర‌గా పాడైపోయే స్వ‌భావం క‌లిగిన ఉత్పత్తులకూ వ‌ర్తింపజేసేలా విస్తరించబడ‌నుంది. ఈ-నామ్‌లో సుమారు 1.68 కోట్ల మంది రైతులు నమోదు అయ్యారు, రూ.1.14 లక్షల కోట్ల మేర వాణిజ్యం జ‌రుగ‌నుంది. వ్యవసాయ మార్కెట్లోకి ఈ-నామ్ తెచ్చిన పారదర్శకత మరియు పోటీతత్వాన్ని దృష్టిలో ఉంచుకుని.. మరో 1,000 మండిలు ఈ-నామ్‌తో అనుసంధానం చేస్తాం. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధులు ఏపీఎంసీలకు వారి మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం అందుబాటులో ఉంచబడతాయి.

***



(Release ID: 1694134) Visitor Counter : 247