ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులు 1.7 లక్షలలోపు;
మొత్తం పాజిటివ్ కేసులలో వీరు1.58% కంటే తక్కువ
వరుసగా రెండు రోజులుగా 5,70,000 కంటే ఎక్కువ టీకాలు
ఇప్పటిదాకా కోవిడ్ టీకాలు తీసుకున్నవారు 35 లక్షల పైమాటే
Posted On:
30 JAN 2021 10:52AM by PIB Hyderabad
భారత్ లో కోవిడ్ చికిత్స తీసుకుంటున్నవారి సంఖ్య ఈ రోజుకు 1.7 లక్షల లోపుకు ( 1,69,824) చేరింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులలో వీరి వాటా 1.58% మాత్రమే
9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వారపు పాజిటివ్ శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. కేరళలో అత్యధికంగా 12.20% ఉండగా, చత్తీస్ గఢ్ లో అది 7.30% గా నమోదైంది.
27 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలలో వారపు పాజిటివ్ శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.
కోలుకుంటున్నవారి మొత్తం సంఖ్య వేగంగా పెరుగుతూ ఉండగా భారత్ లో కోలుకున్నవారి శాతం 96.98% కి చేరింది. ఇది ప్రపంచ దేశాల్లో నమోదైన అత్యధిక శాతాల్లో ఒకటి. ప్పటివరకు కోటికి పైగా ( కచ్చితంగా చెప్పాలంటే 1,04,09,160 మంది) కోలుకున్నారు. గత 24 గంటలలో 14,808 మంది కోవిడ్ బాధితులు కోలుకొన్నారు. టీకాల కార్యక్రమం ఉద్ధృతంగా సాగుతూ ఉండగా గత రెండు రోజులుగా రోజుకు 5.7 లక్షలకంటే ఎక్కువమంది టీకాలు తీసుకున్నారు.
దేశ వ్యాప్త కోవిడ్-19 టీకాల కార్యక్రమంలో భాగంగా 2021 జనవరి 30 ఉదయం 8 గంటలవరకు మొత్తం 35 లక్షల 27 మంది టీకాలు తీసుకున్నారు.
గత 24 గంటలలో 5,71,974 మందికి 10,809 శిబిరాలలో టీకాలు వేశారు. ఇప్పటివరకు
63,687 శిబిరాలు నిర్వహించారు.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
టీకాల లబ్ధిదారులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
2,727
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
1,79,038
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
9,265
|
4
|
ఆస్సాం
|
36,932
|
5
|
బీహార్
|
1,10,396
|
6
|
చండీగఢ్
|
2,977
|
7
|
చత్తీస్ గఢ్
|
62,529
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
607
|
9
|
డామన్, డయ్యూ
|
333
|
10
|
ఢిల్లీ
|
48,008
|
11
|
గోవా
|
3,391
|
12
|
గుజరాత్
|
2,21,675
|
13
|
హర్యానా
|
1,23,935
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
22,918
|
15
|
జమ్మూ, కశ్మీర్
|
26,634
|
16
|
జార్ఖండ్
|
33,119
|
17
|
కర్నాటక
|
3,07,891
|
18
|
కేరళ
|
1,35,835
|
19
|
లద్దాఖ్
|
989
|
20
|
లక్షదీవులు
|
746
|
21
|
మధ్యప్రదేశ్
|
2,46,181
|
22
|
మహారాష్ట్ర
|
2,61,320
|
23
|
మణిపూర్
|
3,399
|
24
|
మేఘాలయ
|
4,200
|
25
|
మిజోరం
|
8,497
|
26
|
నాగాలాండ్
|
3,973
|
27
|
ఒడిశా
|
2,05,200
|
28
|
పుదుచ్చేరి
|
2,299
|
29
|
పంజాబ్
|
54,988
|
30
|
రాజస్థాన్
|
3,24,973
|
31
|
సిక్కిం
|
2,020
|
32
|
తమిళనాడు
|
97,126
|
33
|
తెలంగాణ
|
1,66,606
|
34
|
త్రిపుర
|
27,617
|
35
|
ఉత్తరప్రదేశ్
|
4,63,793
|
36
|
ఉత్తరాఖండ్
|
25,818
|
37
|
పశ్చిమ బెంగాల్
|
2,21,994
|
38
|
ఇతరములు
|
50,078
|
మొత్తం
|
35,00,027
|
కొత్తగా కోలుకున్నవారిలో 85.10% మంది 10 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యారు. కేరళలో అత్యధికంగా ఒక్క రోజులో 6,398 మంది కోలుకోగా, మహారాష్ట్రలో 2,613 మంది, కర్నాటకలో 607 మంది కోలుకున్నారు.
గత 24 గంటలలో 13,083 కొత్త కోవిడ్ కేసులు వచ్చాయి, అందులో 81.95% మంది ఆరు రాష్టాలకు చెందినవారు. కేరళలో అత్యధికంగా ఒక రోజులో 6,268 కేసులు రాగా, ఆ తరువాత స్థానాల్లో మహారాష్ట ( 2771), తమిళనాడు (509) ఉన్నాయి.
గడిచిన 24 గంటలలో 137 మంది కోవిడ్ బాధితులు చనిపోయారు. ఏడు రాష్ట్రాల్లొనే 83.94% మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర్లో అత్యధికంగా 56 మంది మరణించగా, కేరళలో 22 మంది, పంజాబ్ లో 11 మంది చనిపోయారు.
****
(Release ID: 1693640)
Visitor Counter : 189
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Malayalam