ఆర్థిక మంత్రిత్వ శాఖ
2020-21 ఆర్థిక సర్వేలోని ప్రధానాంశాలు
Posted On:
29 JAN 2021 3:47PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ పార్లమెంటు లో శుక్రవారం ఆర్థిక సర్వే 2020-21 ని సమర్పించారు. కోవిడ్ యోధులకు అంకితం చేసిన ఈ ఆర్థిక సర్వే 2020-21 తాలూకు ప్రధానాంశాలు ఈ కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి:
శతాబ్ద కాలం లో ఒకసారి ఎదురయ్యే సంకట కాలంలో ప్రాణాలను, జీవనోపాదులను కాపాడటం.
· కోవిడ్-19 మహమ్మారి ప్రారంభం అయిన దరిమిలా భారతదేశం మనుషుల ప్రాణాలను, వారి జీవనోపాధులను కాపాడే అంశంపైన దృష్టి ని కేంద్రీకరించింది.
· మానవుల ప్రాణాలను ఒకసారి కోల్పోతే తిరిగి వాటిని వెనుక కు రప్పించలేము అనేటటువంటి మానవీయ సిద్ధీంతం ఆధారం గా ఈ ప్రయత్నం జరిగింది.
o మహమ్మారి కారణంగా జిడిపి లో తగ్గుదల చోటుచేసుకొంది; జిడిపి లో రికవరీ ఉండవచ్చు.
· మొదట్లోనే కఠినతరమైన లాక్ డౌన్ ను విధించడం వల్ల మధ్యకాలం మొదలుకొని దీర్ఘకాలం లో ఆర్థిక రికవరీ బాట లో సాగుతూ, ఇటు ప్రాణాలను కాపాడుతూనే అటు బ్రతుకు తెరువులను పరిరక్షిస్తూ, రెండు విధాలుగా కూడాను విజయాలను సాధించేందుకు ఒక అవకాశాన్ని తీసుకోవడం జరిగింది.
· అనిశ్చితి చాలా తీవ్రంగా ఉన్నప్పుడు నష్టాలను కనీస స్థాయి కి కుదించుకోవడం మంచిదన్న హాన్ సెన్ & సార్జెంట్ అధ్యయనం (2001) ప్రతిపాదించిన విధానం ఆధారంగా ఈ వ్యూహం రూపుదిద్దుకుంది. ఈ విధానం గతంలో నోబెల్ బహుమతి ని గెలుచుకొంది.
· భారతదేశం అనుసరించిన వ్యూహం వంపు ను సమతలమైందిగా మార్చడం జరిగింది; అన్నిటికంటే చెడ్డదైన స్థితి ముంచుకువచ్చే అవకాశాన్ని 2020వ సంవత్సరం సెప్టెంబరు వరకు పొడిగించబడేటట్టు చేయడమైంది.
· సెప్టెంబర్ లో అన్నింటి కంటే ఎక్కువ కేసులు నమోదు అయిన తరువాత భారతదేశం లో ప్రతి రోజూ కొత్త కేసుల సంఖ్య లో తగ్గుదల చోటు చేసుకొంది.
· ఒకటో త్రైమాసికంలో స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి) లో 23.9 శాతం మేరకు కుంచించుకుపోయిన ఘటన తో పోలిస్తే రెండో త్రైమాసికం లో జిడిపి లో 7.5 శాతం క్షీణత నమోదు అయింది. ఇది ‘వి’ (V) ఆకారం లో రికవరీ చోటు చేసుకోవడాన్ని సూచిస్తోంది.
· కోవిడ్ మహమ్మారి ఇటు సరఫరాలను, అటు డిమాండును రెంటినీ ప్రభావితం చేసింది:
o మధ్య, దీర్ఘ కాలాలలో సరఫరాలను విస్తరించడం కోసం వ్యవస్థాత్మకమైన సంస్కరణలను ప్రకటించి, నిర్మాణ పరమైన సామర్ధ్యాలకు దీర్ఘకాలిక నష్టం జరగకుండా నివారించిన ఒకే ఒక దేశం గా భారతదేశం నిలచింది.
o ఆర్థిక కార్యకలాపాలపై విధించిన ఆంక్ష ను తొలగించి, అదే చేతితో డిమాండు ను పెంచేందుకు తగిన విధానాలను రూపొందించడం జరిగింది.
o డిమాండు ను పెంపొందించడం కోసం నేశనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ లో సార్వజనిక పెట్టుబడి ద్వారా రికవరీ ప్రక్రియ కు ఊతాన్ని అందించడమైంది.
· వ్యాధి సంక్రమణ తాలూకు రెండో దశ ను అడ్డుకోవడం లో సఫలత ను సాధించడం, తద్ద్వారా ఆర్థిక వ్యవస్థ లో పురోగతి కి బాట ను వేయడం జరిగింది.
2020-21 లో ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు: స‌్థూలంగా ఎలా ఉంటాయంటే..
· కోవిడ్ -19 మహమ్మారి ప్రపంచవ్యాప్తం గా ఆర్థిక మందగమనానికి కారణమైంది. ఇది ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే కూడా మరింత తీవ్రమైన స్థాయి లో నమోదైంది.
· లాక్ డౌన్ ల అమలు, ఒకరికి మరొకరికి మధ్య సురక్షిత దూరాన్ని పాటించాలి అనేటటువంటి నియమాలు అప్పటికే నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థ ను నిశ్చలమైందిగా మార్చివేశాయి.
· ప్రపంచ ఆర్థిక ఉత్పాదన 2020వ సంవత్సరం లో 3.5 శాతం మేరకు పతనం కావచ్చనేది ఒక అంచనా. (ఐఎమ్ఎఫ్ 2021 జనవరి లో వెల్లడించిన అంచనాల మేరకు)
· ప్రపంచం అంతటా ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు వాటి ఆర్థిక వ్యవస్థలకు మద్దతు ను ఇవ్వడానికి గాను పాలిసీ రేటులను తగ్గించడం, తదితర వివిధ విధానపరమైన నిర్ణయాలను ప్రకటించాయి.
· భారతదేశం కట్టడి, ద్రవ్యపరమైన, ఆర్థిక పరమైన, దీర్ఘకాలికమైన, వ్యవస్థాపరమైన సంస్కరణలతో కూడినటువంటి ఒక చతుర్ముఖ వ్యూహాన్ని అనుసరించింది.
o లాక్ డౌన్ కాలంలో బలహీన వర్గాలకు రక్షణ కల్పించడం తో పాటు, లాక్ డౌన్ ఉపసంహరణ దశ లో వినియోగాన్ని, పెట్టుబడిని ప్రోత్సహించడానికి గాను, ద్రవ్యపరమైనటువంటి, ఆర్థిక విధానం పరమైనటువంటి మద్దతు ను అందించడం జరిగింది.
o వ్యవస్థ లో తగినంతగా నిధులు అందుబాటు లో ఉండేటట్లుగా చూడటానికి, రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనాన్ని అందించడానికి, అదే సమయంలో విత్త విధాన ఫలితాల సాధన కు వీలు గా ఒక సానుకూల ద్రవ్య విధానాన్ని అనుసరించడమైంది.
· ఎన్ఎస్ఒ ముందస్తు అంచనాలను బట్టి చూస్తే, భారతదేశం జిడిపి వృద్ధి రేటు 2020-21 ఆర్థిక సంవత్సరం లో -7.7 శాతం మేరకు ఉండవచ్చు. కాగా, ఇదే ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం లో 23.9 శాతం మేరకు వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది.
· భారతదేశం వాస్తవిక జిడిపి 2021-22 ఆర్థిక సంవత్సరం లో 11.0 శాతం వృద్ధి ని నమోదు చేసే సూచన ఉంది. సాంకేతిక జిడిపి 15.4 శాతం మేరకు వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చూస్తే అత్యధిక స్థాయి కాగలదు.
o కోవిడ్-19 టీకా మందు కార్యక్రమం పురోగమించే కొద్దీ ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థాయి కి చేరుకొనే క్రమం లో రికవరీ పుంజుకొనేందుకు ఆస్కారం ఉంది.
· ప్రభుత్వ వినియోగం, నికర ఎగుమతులు.. ఈ రెండు వృద్ధి మరింతగా క్షీణించిపోకుండా చూశాయి. మరోపక్క పెట్టుబడి, ప్రైవేటు వినియోగం దీనిని కిందకు లాగాయి.
· 2020-21 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం లో అంతక్రితం సంవత్సరం కంటే 17 శాతం మేరకు ప్రభుత్వ వినియోగం అధికం గా ఉండవచ్చన్న అంచనా ఆధారం గా రికవరీ కి దన్ను లభించవచ్చు.
· 2020-21 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం లో ఎగుమతులు 5.8 శాతం మేరకు, దిగుమతులు 11.3 శాతం మేరకు తగ్గవచ్చని అంచనా వేయడమైంది.
· 2021 ఆర్థిక సంవత్సరంలో జిడిపి లో 2 శాతం మేరకు కరెంటు ఖాతా మిగులు నమోదు అయ్యే సూచనలు ఉన్నాయి. 17 ఏళ్ళ అనంతరం ఇటువంటి స్థితి ఏర్పడనుంది.
· సరఫరా కోణంలో నుంచి చూస్తే, స్థూల విలువ జత కలసిన (జివిఎ) వృద్ధి 2021 ఆర్థిక సంవత్సరానికి -7.2 శాతం గా ఉంటుందని ఆశించడమైంది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఇది 3.9 శాతం గా ఉండింది.
o వ్యవసాయ రంగం 3.4 శాతం వృద్ధి ని సాధించవచ్చు. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ పై కోవిడ్-19 మహమ్మారి ప్రభావం బారి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించనుంది.
o 2021 ఆర్థిక సంవత్సరం లో పారిశ్రామిక రంగం 9.6 శాతం మేరకు, సేవల రంగం 8.8 శాతం మేరకు క్షీణించవచ్చని అంచనా.
· వ్యవసాయ రంగం లో స్థితి ఆశాజనకంగా ఉండగా, కాంటాక్ట్ ఆధారిత సేవల రంగం, తయారీ రంగం, నిర్మాణః రంగం తీవ్రం గా దెబ్బ తిని తరువాత క్రమంగా కోలుకొంటూ వస్తున్నాయి. వ్యవసాయ రంగం ఉత్తమమైన పరిణామాలను ఆవిష్కరించింది.
· 2020-21 ఆర్థిక సంవత్సరం లో భారతదేశం లో పెట్టుబడులు పెట్టడానికి అనేక వర్గాలు మొగ్గు చూపాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డిఐ) పెద్ద స్థాయి లో తరలి వచ్చాయి.
o నికర ఎఫ్‌పిఐ ప్రవాహాలు 2020 నవంబరు లో 9.8 బిలియన్ యుఎస్ డాలర్ మేరకు నమోదయ్యాయి. ఒక నెల రోజుల కాలం లో ఇంత భారీ స్థాయి లో నికర ఎఫ్‌పిఐ ప్రవాహాలు నమోదు కావడం ఇదివరకు ఎన్నడూ లేదు.
o 2020వ సంవత్సరం లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) ఎక్విటీ రూపం లో వాటి పెట్టుబడులతో భారతదేశానికి తరలి వచ్చాయి. ప్రవర్థమాన విపణులలో ఈ ఘనత ను సాధించిన ఒకే ఒక దేశం భారతదేశమే.
· సెన్సెక్స్, నిఫ్టీ సూచీ లు పెల్లుబికి, భారతదేశం లో మార్కెట్ క్యాప్ టు జిడిపి రేశియో 2010వ సంవత్సరం అక్టోబరు తరువాత 100 శాతాన్ని మించడం ఇదే మొట్టమొదటిసారి.
· ఇటీవల వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (సిపిఐ) లో తగ్గుదల చోటు చేసుకొని, అంత క్రితం ఆహార ద్రవ్యోల్బణం పై ప్రభావాన్ని చూపిన సరఫరా సంబంధిత అవరోధాలకు స్వస్తి పలికిన విషయాన్ని స్పష్టం చేసింది.
· 2020-2021 ప్రథమార్థం లో పెట్టుబడులలో 29 శాతం క్షీణత ఉండగా, ద్వితీయార్థానికి వచ్చే సరికి ఆ క్షీణత 0.8 శాతానికి పరిమితం అయింది.
· రాష్ట్రం లోపల, ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య రవాణా వ్యవస్థ తిరిగి పుంజుకోవడం తో నెలవారీ జిఎస్‌టి వసూళ్ళు రికార్డు స్థాయి లో నమోదయ్యాయి. ఈ పరిణామం పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు వేగవంతం అయినట్లు సూచిస్తున్నది.
o మరోపక్క 2020-2021 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో జిడిపి లో 3.1 శాతం స్థాయి లో కరెంటు ఖాతా మిగులు నమోదు అయింది.
o సేవల రంగం లో ఎగుమతులు వేగవంతమై, డిమాండు తగ్గిపోయిన కారణంగా దిగుమతుల (వాణిజ్య సరళి దిగుమతులలో 21.2 శాతం క్షీణత) తో పోలిస్తే ఎగుమతులు (వాణిజ్య సరళి దిగుమతులలో 39.7 శాతం క్షీణత) తగ్గాయి.
o జీడీపీ లో నిష్పత్తి పరంగా విదేశీ రుణం 2020 మార్చి నెలాఖరు కు 20.6 శాతం గా ఉన్నది కాస్తా 2020 సెప్టెంబర్ చివరి నాటికి 21.6 శాతానికి పెరిగింది.
o 2020 డిసెంబర్ లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. రాబోయే 18 నెలల దిగుమతులకు తగినంతగా ఉన్నాయి.
o విదేశీ మారక ద్రవ్య నిల్వలలో వృద్ధి తో విదేశీ కరెన్సీ మరియు స్వల్పకాలిక రుణం తాలూకు నిష్పత్తి మెరుగైంది.
· ‘వి‘ (V) ఆకారం లో రికవరీ నమోదు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యుత్తు కు డిమాండు పెరగడం, ఇ-వే బిల్స్, జిఎస్‌టి వసూళ్ళు, ఉక్కు వినియోగం, వగైరా అంశాలు పురోగతి సూచకాలు గా ఉన్నాయి.
· ఆరు రోజుల వ్యవధి లో 10 లక్షల టీకాలను ఇప్పించడం ద్వారా భారతదేశం ఈ విషయం లో అత్యంత వేగవంతమైన దేశం గా పేరు తెచ్చుకొంది. అంతేకాదు, ఇరుగు పొరుగు దేశాలకు, బ్రెజిల్ కు టీకా మందు ను సరఫరా చేస్తున్న పెద్ద దేశం గా కూడా భారత్ నిలిచింది.
· సేవల రంగం లో బలమైన రికవరీ ఛాయలు కనిపిస్తున్నాయి. వినియోగం, పెట్టుబడి పుంజుకొంటున్నాయి.
· భారతదేశం మహమ్మారి తాలూకు ప్రతికూల ప్రభావాన్ని అధిగమించి, తన వృద్ధి సత్తా ను గుర్తెరగాలంటే సంస్కరణలు ఇక ముందు కూడా కొనసాగి తీరాలి.
· ‘వందేళ్ళలో మొదటిసారి’ తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కోవడం లో భారతదేశం పరిణతి తో కూడిన విధానపరమైన ప్రతిస్పందన ను కనబరచినందువల్ల ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పరిమిత దృష్టి తో కూడిన విధాన నిర్ణయాలను తీసుకోకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల పైన శ్రద్ధ వహిస్తే ఒనగూరే ప్రయోజనాలు ఎలా ఉండేదీ తెలిసివచ్చింది.
వృద్ధితో రుణ సుస్థిరత సాధ్యమైందా? అవును... కానీ, వృద్ధికి రుణ సుస్థిరత తోడ్పడకపోవచ్చు!
- భారత పరిస్థితుల నేపథ్యంలో రుణ సుస్థిరతకు వృద్ధి దోహదం చేస్తుంది. కానీ, రుణ సుస్థిరత వల్ల వృద్ధికి తోడ్పాటు లభించకపోవచ్చు:
- వడ్డీ-వృద్ధి శాతాల వ్యత్యాసం (ఐజీఆర్డీ)పైనే... అంటే వడ్డీశాతం, వృద్ధి శాతం మధ్యగల తేడా మీదనే రుణ సుస్థిరత ఆధారపడి ఉంటుంది
- భారతదేశంలో వృద్ధి శాతంకన్నా రుణంపై వడ్డీ శాతం తక్కువగా ఉంటుంది- ఇది ప్రామాణికమే తప్ప మినహాయింపు కాదు
- భారతదేశంలో ప్రతికూల ఐఆర్జీడీకి కారణం హెచ్చు వృద్ధి శాతాలే తప్ప తక్కువ వడ్డీ శాతాలు కాదు- ద్రవ్య విధానంపై చర్చకు ఉత్ప్రరకం ఇదే... ముఖ్యంగా వృద్ధి మందగమనం, ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ పరిస్థితి ఉంటుంది
- హెచ్చు వృద్ధి శాతాలుగల దేశాల్లో వృద్ధి వల్ల రుణ సుస్థిరత ఏర్పడుతుంది; అయితే, తక్కువ వృద్ధి శాతాలుగల దేశాల్లో ఇటువంటి స్వాభావిక దిశపై స్పష్టత ఉండదు
- ఆకస్మిక ఆర్థికవృద్ధి సమయాలతో పోలిస్తే ఆర్థిక సంక్షోభాల్లో ద్రవ్య గుణకాల్లో విపరీత వ్యత్యాసం అత్యధికంగా ఉంటుంది
- ఉత్పాదక సామర్థ్యంలో సంభవించగల నష్టాన్ని పరిమితం చేయడం ద్వారానే సంస్కరణల నుంచి సంపూర్ణ ఫలితం రాబట్టడంలో క్రియాశీల ఆర్థిక విధానం భరోసా ఇవ్వగలదు
- వృద్ధికి ఉత్తేజమివ్వగల ద్రవ్య విధానమే రుణాలను స్థూల దేశీయోత్పత్తి నిష్పత్తి స్థాయికి తగ్గించడంలో దోహదపడుతుంది.
- భారత వృద్ధి సామర్థ్యం దృష్ట్యా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా రుణ సుస్థిరత ఒక సమస్యగా పరిణమించే అవకాశాలు దాదాపు లేవు
- ఆర్థిక తిరోగమనాల సమయంలో వృద్ధికి తోడ్పాటు కోసం వ్యతిరేక-ఆవృత్త ద్రవ్య విధానం అనుసరణీయం
- ద్రవ్య బాధ్యతారాహిత్యానికి క్రియాశీల వ్యతిరేక-ఆవృత్త విధానం పరిష్కారం కాకపోయినా... ద్రవ్య విధానానికి వ్యతిరేకంగా అసమతౌల్య మొగ్గు సృష్టికి కారణమైన మేధో సంధానానికి అడ్డుకట్ట వేసేందుకు అవసరమే.
భారతదేశంపై స్వతంత్ర పరపతి-ప్రామాణికత ప్రాథమికాంశాలను ప్రతిబింబిస్తుందా? లేదు!
- ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ‘స్వతంత్ర పరపతి-ప్రామాణికత’ (సావరిన్ క్రెడిట్ రేటింగ్) నిర్ధారణలో పెట్టుబడుల శ్రేణికి సంబంధించి భారత్ ఎన్నడూ అత్యల్ప (బిబిబి-బిఎఎ3) స్థాయికి దిగజారలేదు:
- ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తన ఆర్థిక పరిమాణాన్ని, తద్వారా రుణాల చెల్లింపు సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రధానంగా ‘ఎఎఎ’ స్థాయిలోనే ఉంటోంది.
- ఈ నిబంధన నుంచి చైనా, భారత్ మాత్రమే మినహాయించబడ్డాయి. చైనా 2005లో ‘ఎ-/ఎ2 రేటింగ్ పొందగా, ప్రస్తుతం భారత్ ‘బిబిబి-/బిఎఎ3’ రేటింగ్ పొందింది.
స్వతంత్ర పరపతి-ప్రామాణికత ప్రాథమికాంశాలను ప్రతిబింబించదు:
- వివిధ దేశాలకు ‘ఎ+/ఎ1, బిబిబి-/బిఎఎ3’ మధ్య రేటింగ్ ఇచ్చే విషయంలో అనేక పరామితులకు సంబంధించి ఎస్ అండ్ పి/మూడీస్ అవాస్తవాలు చెప్పడంలో ఆరితేరాయన్నది స్పష్టమైంది
- స్వతంత్ర పరపతి ప్రామాణికత పరామితుల ప్రభావ నిర్దేశంకన్నా గణనీయంగా తక్కువ స్థాయి రేటింగ్ ఇవ్వబడింది
- పరపతి ప్రామాణికత నిర్ణయం ఎగవేత సంభావ్యతను సూచించడంద్వారా నిర్బంధాలను అంగీకరించి నెరవేర్చడంలో రుణగ్రహీత దేశాల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
- రుణాల చెల్లింపునకు తన సమ్మతి ఎంత స్వచ్ఛమైనదో భారత రుణ చెల్లింపుల చరిత్రలో ఎలాంటి ఎగవేతలూ లేకపోవడం నిస్సందేహంగా రుజువు చేస్తోంది.
- అంతేకాదు... అత్యల్ప విదేశీ ద్రవ్యరూప రుణాలు, విదేశీ మారక నిల్వల సమృద్ధిని బట్టి భారతదేశపు చెల్లింపుల సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు.
- భారత్ విషయంలో స్వతంత్ర పరపతి-ప్రామాణికతలో మార్పులకు స్థూల ఆర్థిక సూచీలతో బలహీన లేదా అసలు ఎలాంటి సహ సంబంధం ఉండదు.
- భారత ద్రవ్య విధానం ఎలాంటిదంటే- గురుదేవులు రవీంద్రనాథ్ టాగూర్ ప్రబోధించిన ‘‘భయానికి తావులేని హృదయం’’ మనోభావనకు అది ప్రతీక
- స్వతంత్ర పరపతి-ప్రామాణికత నిర్ణయ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండటంసహా ఆత్మాశ్రయ ధోరణిని తగ్గించుకుని ఆర్థిక వ్యవస్థల ప్రాథమికాంశాలను ప్రతిఫలించాలి
అసమానత – వృద్ధి: సంఘర్షణా – సమన్వయమా?
- అసమానత, సామాజిక-ఆర్థిక ఫలితాల మధ్య; అదేవిధంగా ఆర్థిక వృద్ధి, సామాజిక-ఆర్థిక ఫలితాల మధ్య సంబంధం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశంలో భిన్నంగా ఉంటుంది
- అలాగే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలకు భిన్నంగా భారతదేశంలో అసమానత-తలసరి ఆదాయ (వృద్ధి)కి సామాజిక-ఆర్థిక సూచీలతో ఇదేవిధమైన సంబంధం ఉంటుంది
- ఆర్థిక వృద్ధి ప్రభావం అసమానతకన్నా పేదరిక నిర్మూలనపై అధికంగా ఉంటుంది
- పేదరికం నుంచి నిరుపేదలను గట్టెక్కించడానికి ఆర్థిక వృద్ధిపై శ్రద్ధను భారత్ కొనసాగించాలి
- వర్ధమాన ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంపద పరిమాణంలో వృద్ధి ఉన్నపుడే మొత్తంమీద సంపద పునఃపంపిణీ విస్తరణ సాధ్యమవుతుంది
ఎట్టకేలకు ఆరోగ్య సంరక్షణ కేంద్రకంగా మారింది!
- ఆరోగ్య సంరక్షణ రంగం ప్రాధాన్యాన్ని, ఇతర రంగాలతో దానికిగల అంతర్గత బంధాన్ని కోవిడ్-19 మహమ్మారి నొక్కిచెప్పింది. దీంతోపాటు ఆరోగ్య సంక్షోభం ఆర్థిక-సామాజిక సంక్షోభంగా ఎలా పరివర్తన చెందిందో కూడా స్పష్టం చేసింది
- మహమ్మారి వ్యాధులపై ప్రతిస్పందనలో భారత ఆరోగ్య మౌలిక సదుపాయాలు అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి- అయితే, ‘ప్రాధాన్యంవైపు మొగ్గు’కు ఆరోగ్య సంరక్షణ విధానం ఆటంకం కాకూడదు
- గర్భస్థ/ప్రసవానంతర దశలలో ఆరోగ్య సంరక్షణలో అసమానతలను తగ్గించడంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్‌హెచ్ఎం) కీలకపాత్ర పోషించడమేగాక, ఆస్పత్రులలో శిశు జననాలు గణనీయంగా పెరిగాయి
- ఆ మేరకు ‘ఆయుష్మాన్ భారత్, ఎన్‌హెచ్ఎం’ల సంయుక్త అమలుకు ప్రాధాన్యమివ్వాలి
- ప్రజారోగ్య సంరక్షణపై వ్యయాన్ని స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1 శాతం నుంచి 2.5-3 శాతందాకా పెంచితే దేశవ్యాప్తంగా ప్రజలు స్వయంగా భరించే ఆరోగ్య సంరక్షణ వ్యయం 65 శాతం నుంచి 35 శాతానికి తగ్గుతుంది.
- సమాచార అసమతౌల్యంవల్ల తలెత్తే విపణి వైఫల్యాల దృష్ట్యా ఆరోగ్య సంరక్షణ రంగంపై నియంత్రణ వ్యవస్థ ఏర్పాటును పరిగణనలోకి తీసుకోవాలి.
- సమాచార అసమతౌల్యాన్ని పరిష్కరించడం వల్ల బీమా రుసుములు తగ్గుతాయి, ఉత్తమ ఉత్పత్తుల లభ్యత సాధ్యం కావడమేగాక బీమా లావాదేవీలు మరింత ప్రజల్లోకి చొచ్చుకువెళ్తాయి.
- ఆరోగ్య సంరక్షణ రంగంలో సమాచార అసమతౌల్యాన్ని తగ్గించగల సమాచార సదుపాయాలు మొత్తంమీద ప్రజా సంక్షేమాన్ని పెంపొందించడంలో తోడ్పడతాయి.
- ఇంటర్నెట్ అనుసంధానం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలలో పెట్టుబడులద్వారా దూరవాణి-వైద్య సదుపాయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది
ప్రక్రియా సంస్కరణలు
- భారతదేశంలో ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ అధికం. దీనివల్ల సాపేక్షంగా ప్రక్రియలకు కట్టుబాటు సజావుగానే ఉన్నా, నిబంధనలు ప్రభావరహితంగా మారాయి
- సాధ్యమైనంత ఫలితం సాధించే ప్రయత్నాలే మితిమీరిన నియంత్రణకు మూలకారణం.
- విచక్షణను తగ్గించడానికి ఉద్దేశించిన నిబంధనల్లో పెరిగిపోయిన సంక్లిష్టత ఫలితంగా మరింత అపారదర్శకతకు దారితీసింది
- నిబంధనలను సరళీకరించడం, పర్యవేక్షణకు మరింత ప్రాధాన్యమివ్వడం... అంటే- అంతర్లీనంగా అధిక విచక్షణకు వీలు కల్పించడమే దీనికి పరిష్కారం
- అయితే, ఈ విచక్షణాధికారాన్ని పారదర్శకత, వ్యవస్థలు, పూర్వ-అనంతర జవాబుదారీతనం, పూర్వ-అనంతర పరిష్కార యంత్రాంగాలతో సమతూకం చేసుకోవాల్సిన అవసరం ఉంది
- వివిధ కార్మిక స్మృతులను సంస్కరించడం నుంచి బీపీవో రంగంపై కఠిన నిబంధనలను తొలగించడందాకా పైన పేర్కొన్న మేధో చట్రం ప్రభావం ఇప్పటికే స్పష్టమైంది
నియంత్రణలో సంయమనం అత్యవసర ఔషధమేగానీ... ప్రధాన ఆహారం కాదు
- అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం వేళ రుణగ్రహీతలు తాత్కాలిక కష్టనష్టాలను అధిగమించడంలో ఈ నియంత్రణా సంయమనం వారికి తోడ్పడింది
- ఆర్థిక వ్యవస్థ స్వస్థత అనంతరం కూడా నియంత్రణా సంయమనం చాలాకాలం కొనసాగడంతో ఆర్థిక వ్యవస్థలో అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి
- ఆ మేరకు బ్యాంకులు తాము అడ్డదారిలో మంజూరు చేసిన రుణాలను పుస్తకాల్లో సరిదిద్దుకునేందుకు ఈ నియంత్రణా సంయమనాన్ని వాడుకున్నాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి నాణ్యత దెబ్బతిన్నది
- ఆర్థిక వ్యవస్థ కోలుకున్న తర్వాత అత్యవసర ఔషధంగా ప్రయోగించిన నియంత్రణా సంయమనాన్ని నిలిపివేయడం తప్పనిసరి.. అంతేగానీ ప్రధాన ఆహారంగా ఏళ్లతరబడి కొనసాగించకూడదు.
- అనిశ్చితి మధ్య నిర్ణయాలను ప్రోత్సహించడంలో భాగంగా పూర్వ-అనంతర విచారణల్లో ముందుచూపులేని పక్షపాతం పాత్రను గుర్తించాలి తప్ప ప్రతికూల ఫలితాలను దురుద్దేశాలతో కూడిన నిర్ణయ లోపాలుగా పరిగణించకూడదు
- నియంత్రణ సంయమనం ఉపసంహరణ తర్వాత ఆస్తుల నాణ్యతపై తక్షణ సమీక్ష కసరత్తు ప్రారంభించడం తప్పనిసరి.
- అదేవిధంగా రుణాలను రాబట్టడం కోసం చట్టపరమైన మౌలిక వసతులను వాస్తవిక రీతిలో బలోపేతం చేయాలి
ఆవిష్కరణ: ఆకట్టుకునేలా ఉన్నా.. ముఖ్యంగా ప్రైవేటు రంగంనుంచి మరింత ఊపు అవశ్యం
- ‘ప్రపంచ ఆవిష్కరణల సూచీ’ 2007లో ప్రారంభమయ్యాక భారత్ 2020లో తొలిసారి టాప్ -50 ఆవిష్కరణాత్మక దేశాల జాబితాకెక్కింది. అయితే, మధ్య/దక్షిణాసియాల స్థాయిలో ప్రథమ స్థానంలోనూ, అల్ప మధ్యాదాయ సమూహ ఆర్థిక వ్యవస్థలలో తృతీయ స్థానంలోనూ నిలిచింది
- పరిశోధన-అభివృద్ధిపై స్థూల దేశీయ వ్యయం (జీఈఆర్డీ) రీత్యా తొలి 10 స్థానాల్లోగల ఆర్థిక వ్యవస్థలలో భారత్ అట్టడుగున ఉంది.
- ఆ మేరకు అగ్రస్థానంలోగల సదరు పది ఆర్థిక వ్యవస్థల స్థాయిలో ఆవిష్కరణల పరంగా పోటీపడటమే భారత్ ఆకాంక్ష కావాలి
- సదరు పది ఆర్థిక వ్యవస్థలలో జీఈఆర్డీపై సగటు వ్యయానికి భిన్నంగా భారత ప్రభుత్వ రంగం 3 రెట్లు అధిక వాటా కలిగి ఉంది
- అయితే, సదరు పది ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే జీఈఆర్డీకి వ్యాపార రంగం వాటా, మొత్తం పరిశోధన-అభివృద్ధి సిబ్బంది, పరిశోధకుల విషయంలో భారత్ అట్టడుగు స్థానంలో ఉంది.
- దేశంలో ఆవిష్కరణలకు అత్యధిక పన్ను ప్రోత్సాహకాలు, వాటా మూలధన లభ్యత ఉన్నప్పటికీ ఈ పరిస్థితి కొనసాగటం గమనార్హం.
- పరిశోధన-అభివృద్ధికి పెట్టుబడులను భారత వ్యాపార రంగం గణనీయంగా పెంచాల్సి ఉంది
- పది అగ్రస్థానంలోని ఆర్థిక వ్యవస్థల స్థాయిలో ఆవిష్కరణలపై పేటెంట్ల కోసం దాఖలయ్యే దరఖాస్తుల సగటు 62 శాతం కాగా, ఇందులో అత్యల్పంగా 36 శాతంగా ఉన్న భారతీయుల వాటాను మరింత పెంచుకోవాల్సి ఉంది.
- ఆవిష్కరణలను అధికంగా మెరుగుపరచే దిశగా సంస్థలు, వ్యాపారాల ఆధునికీకరణకు అనువైన ఆవిష్కరణ సాధనాల విషయంలో భారత్ తన పనితీరుపై దృష్టి సారించాలి.
జై హో! పి.ఎమ్. ‘జె.ఏ.వై ’ అమలు మరియు ఆరోగ్య ఫలితాలు
• ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పి.ఎమ్-జే.ఏ.వై) - అత్యంత దుర్బలమైన విభాగాలకు ఆరోగ్య సంరక్షణను అందించడం కోసం 2018 లో భారత ప్రభుత్వం ప్రారంభించిన, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం అతి తక్కువ సమయంలో ఆరోగ్య సంరక్షణ ఫలితాలపై బలమైన సానుకూల ప్రభావాలను చూపింది.
• పి.ఎమ్-జె.ఏ.వై. తరచుగా అవసరమయ్యే, డయాలసిస్ వంటి చికిత్సలకు, తక్కువ ఖర్చు సంరక్షణ కోసం గణనీయంగా ఉపయోగపడింది; కోవిడ్ మహమ్మారి మరియు లాక్-డౌన్ సమయంలో కూడా కొనసాగింది.
• జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్)-4 (2015-16) మరియు ఎన్.ఎఫ్.హెచ్.ఎస్-5 (2019-20) ఆధారంగా "డిఫరెన్స్-ఇన్-డిఫరెన్స్" విశ్లేషణ చేపట్టడం ద్వారా ఆరోగ్య ఫలితాలపై పి.ఎమ్-జె.ఏ.వై. యొక్క సాధారణ ప్రభావం క్రింది విధంగా ఉంది:
o మెరుగు పరిచిన ఆరోగ్య బీమా సౌకర్యం: 2015-16 నుండి 2019-20 వరకు, బీహార్, అస్సాం మరియు సిక్కింలలో ఆరోగ్య బీమా పరిధిలో ఉన్న కుటుంబాల సంఖ్య 89 శాతం పెరిగింది; కాగా, పశ్చిమ బెంగాల్ లో ఇదే కాలంలో 12 శాతం తగ్గింది
o శిశు మరణాల రేటులో తగ్గుదల : 2015-16 నుండి 2019-20 వరకు, పశ్చిమ బెంగాల్‌లో శిశు మరణాల రేటు 20 శాతం తగ్గింది; కాగా, పొరుగున ఉన్న మూడు రాష్ట్రాల్లో, 28 శాతం తగ్గింది.
o ఐదేళ్ల లోపు పిల్లల్లో మరణాల రేటు తగ్గుదల : బెంగాల్ లో 20 శాతం తగ్గుదల నమోదు కాగా, పొరుగు రాష్ట్రాల్లో 27 శాతం మేర తగ్గింది
o గర్భనిరోధకం, ఆడవారు స్టెరిలైజేషన్ మరియు మాత్రలు వాడకం వంటి ఆధునిక పద్ధతులు, వరుసగా 36 శాతం, 22 శాతం మరియు 28 శాతం మేర, పొరుగు రాష్ట్రాల్లో పెరగ్గా, పశ్చిమ బెంగాల్ కు సంబంధించి, వీటి పెరుగుదల చాలా తక్కువగా ఉంది
o పశ్చిమ బెంగాల్ లో వరుస పిల్లల మధ్య అంతరం చెప్పుకోదగ్గ మేర తగ్గలేదు, అయితే, పొరుగు రాష్ట్రాలలో ఈ తగ్గుదల 37 శాతం మేర నమోదయ్యింది
o పశ్చిమ బెంగాల్ కంటే మూడు పొరుగు రాష్ట్రాలలో మాతా, శిశువుల సంరక్షణ కోసం చేపట్టిన వివిధ చర్యలు మెరుగయ్యాయి.
• పి.ఎమ్-జె.ఏ.వై. ని అమలు చేసిన అన్ని రాష్ట్రాలను, అమలు చెయ్యని రాష్ట్రాలతో పోల్చినప్పుడు, ఆరోగ్య పరిస్థితులపై ప్రతికూల ప్రభావాలు కూడా, ఇదే విధంగా వ్యక్తమయ్యాయి
• మొత్తంమీద, పి.ఎమ్-జె.ఏ.వై. ని అమలు చేయని రాష్ట్రాలలో కంటే, అమలుచేసిన రాష్ట్రాలలో అనేక ఆరోగ్య ఫలితాలలో గణనీయమైన మెరుగుదల ప్రతిబింబిస్తోంది.
కనీస అవసరాలు :
• 2012 తో పోలిస్తే 2018 లో దేశంలోని అన్ని రాష్ట్రాలలో ‘కనీస అవసరాలు’ ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి
o కేరళ, పంజాబ్, హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇది అత్యధికంగా ఉండగా, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపురలో అత్యల్పంగా ఉంది
o నీరు, గృహనిర్మాణం, పారిశుధ్యం, సూక్ష్మ పర్యావరణం వంటి ఐదు విషయాల్లోనూ మెరుగుదలతో పాటు ఇతర సౌకర్యాలు కూడా ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి
o 2012 మరియు 2018 మధ్య వెనుకబడిన రాష్ట్రాలు గతంలో కంటే ఎక్కువగా లాభపడ్డంతో, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో అంతర్-రాష్ట్ర అసమానతలు తగ్గాయి
o గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ధనిక గృహాల మధ్య వ్యత్యాసంతో పోల్చినప్పుడు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల మధ్య అసమానత చాలా మేర తగ్గింది
• ‘కనీస అవసరాలు’ ఎక్కువగా అందుబాటులోకి రావడం, శిశు మరణాలు మరియు 5 ఏళ్ల లోపు మరణాల రేటు వంటి ఆరోగ్య సూచికలు మెరుగుపడడానికి దారితీసింది. అదేవిధంగా, భవిష్యత్తులో, విద్యా సూచికలలో మెరుగుదలకు కూడా, సంబంధం కలిగి ఉంటుంది
• రాష్ట్రాలలో, గ్రామీణ మరియు పట్టణాల మధ్య అదేవిధంగా, ఆదాయ వర్గాల మధ్య "కనీస అవసరాల అందుబాటులో" అంతరాలను తగ్గించడంపై దృష్టి పెట్టాలి
• జల్ జీవన్ మిషన్; ఎస్.బి.ఎమ్-జి; పి.ఎం.ఎ.వై-జి; వంటి పథకాలు ఈ అంతరాలను తగ్గించడానికి తగిన వ్యూహాన్ని రూపొందించవచ్చు
• "కనీస అవసరాల అందుబాటు" పురోగతిని అంచనా వేయడానికి, అన్ని / లక్ష్యంగా ఉన్న జిల్లాలకు జిల్లా స్థాయిలో తగిన సూచికలు మరియు పద్దతిని ఉపయోగించి, భారీ వార్షిక గృహ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా "కనీస అవసరాల సూచిక" (బి.ఎన్.ఐ) ని రూపొందించవచ్చు
ఆర్థిక పరిణామాలు
• కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుండి బయటపడడానికి, అనేక దేశాలు అమలుచేసిన "ఫ్రంట్-లోడెడ్" భారీ ఉద్దీపన ప్యాకేజీలకు భిన్నంగా, భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిస్థాపక పునరుద్ధరణకు అనువైన అమరిక విధానాన్ని అనుసరించింది
• 2020-21 లో వ్యయ విధానం ప్రారంభంలో బలహీన వర్గాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, లాక్-డౌన్ సడలించిన అనంతరం, మొత్తం డిమాండ్ మరియు మూలధన వ్యయాన్ని తిరిగి పెంచాలని నిర్ణయించింది
• నెలవారీ జీ.ఎస్.టి. వసూళ్లు, గత 3 నెలలుగా, వరుసగా లక్ష కోట్ల రూపాయల మార్కును దాటి, జీ.ఎస్.టి. ప్రవేశపెట్టినప్పటి నుండి ఎన్నడూ లేనంతగా, 2020 డిసెంబర్ లో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి
• పన్ను పరిపాలనలో సంస్కరణలు పారదర్శకత మరియు జవాబుదారీతనం యొక్క ప్రక్రియను ప్రారంభించడంతో పాటు, నిజాయితీగల పన్ను చెల్లింపుదారుల అనుభవాన్ని పెంచడం ద్వారా పన్ను చెల్లించడం పట్ల సానుకూలతను ప్రోత్సహించడం జరిగింది
• మహమ్మారి యొక్క సవాలు సమయాల్లో రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం స్థిరమైన చర్యలు తీసుకుంది
బాహ్య రంగం
• ప్రపంచ వాణిజ్యం గణనీయంగా తగ్గడం, వస్తువుల ధరలు తగ్గడంతో పాటు, వివిధ దేశాల కరెన్సీలు, కరెంటు ఖాతాల నిల్వల చిక్కులతో, కోవిడ్-19 మహమ్మారి, కఠినమైన బాహ్య ఫైనాన్సింగ్ పరిస్థితులకు దారితీసింది
• 2021 జనవరి, 8వ తేదీ నాటికి, భారతదేశం యొక్క విదేశీ నిల్వలు 586.1 బిలియన్ అమెరికా డాలర్ల గరిష్ట స్థాయికి చేరాయి; ఇది 18 నెలలకు సమానమైన దిగుమతులను కలిగి ఉంది
• 2019-20 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికం నుంచి బి.ఓ.పి. మిగులుకు దారితీసే బలమైన మూలధన ప్రవాహంతో పాటు కరెంట్ అకౌంట్ మిగులును భారత్ ఎదుర్కుంటోంది.
• మూలధన ఖాతాలో నిల్వ బలమైన ఎఫ్.డి.ఐ. మరియు ఎఫ్.పి.ఐ. ప్రవాహాల తో పటిష్టంగా ఉంది :
o ఏప్రిల్-అక్టోబర్, 2020 లో నికర ఎఫ్.డి.ఐ. ప్రవాహం 27.5 బిలియన్ అమెరికా డాలర్లు: ఇది 2019-20 ఆర్ధిక సంవత్సరం మొదటి ఏడు నెలలతో పోలిస్తే 14.8 శాతం ఎక్కువ
o 2020 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో నికర ఎఫ్.పి.ఐ ప్రవాహం 28.5 బిలియన్ అమెరికా డాలర్లు కాగా, గత ఏడాది ఇదే కాలంలో 12.3 బిలియన్ అమెరికా డాలర్లుగా ఉంది
• ఎఫ్.వై-21 : హెచ్-1 లో, వస్తువుల దిగుమతుల్లో భారీ తగ్గుదల, ప్రయాణ సేవల తగ్గుదల కారణంగా -
o ప్రస్తుత ఆదాయం (15.1 శాతం) కంటే, ప్రస్తుత చెల్లింపులు (30.1 శాతం) బాగా తగ్గాయి
o కరెంట్ అకౌంట్ మిగులు 34.7 బిలియన్ అమెరికా డాలర్లు (జి.డి.పి. లో 3.1 శాతం) గా ఉంది
• 17 సంవత్సరాల వ్యవధి తర్వాత, భారతదేశం వార్షిక కరెంట్ అకౌంట్ మిగులుతో ముగియనుంది
• 2020 ఏప్రిల్-డిసెంబరు మధ్య కాలంలో భారతదేశ వాణిజ్య లోటు 57.5 బిలియన్ అమెరికా డాలర్లు కాగా, ఇది గత ఏడాది ఇదే కాలంలో 125.9 బిలియన్ అమెరికా డాలర్లుగా ఉంది
• 2019, ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో 238.3 బిలియన్ అమెరికా డాలర్ల మేర సరుకుల ఎగుమతులు నమోదుకాగా, 2020, ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో సరుకుల ఎగుమతులు 15.7 శాతం తగ్గి, 200.8 బిలియన్ అమెరికా డాలర్ల మేర జరిగాయి
o పెట్రోలియం, చమురు మరియు కందెనలు (పి.ఒ.ఎల్) ఎగుమతులు, ఈ సమీక్షా కాలంలో ఎగుమతి పనితీరుకు ప్రతికూలంగా దోహదపడ్డాయి
o పి.ఒ.ఎల్. కాని ఇతర వస్తువుల ఎగుమతులు సానుకూలంగా మారాయి; 2020-21 ఆర్ధిక సంవత్సరం 3వ త్రై మాసికంలో ఎగుమతి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడ్డాయి
o వ్యవసాయం, అనుబంధ ఉత్పత్తులు, మందులు, ఔషధాలు, ముడి లోహాలు, ఖనిజాలు వంటి పి.ఒ.ఎల్. కాని ఇతర వస్తువుల ఎగుమతుల్లో పెరుగుదల నమోదు అయ్యింది.
• 2020, ఏప్రిల్-డిసెంబర్ కాలంలో మొత్తం వాణిజ్య వస్తువుల దిగుమతులు (-) 29.1 శాతం మేర తగ్గి 258.3 బిలియన్ అమెరికా డాలర్లకు చేరుకున్నాయి; కాగా, గత ఏడాది ఇదే కాలంలో, మొత్తం వాణిజ్య వస్తువుల దిగుమతులు, 364.2 బిలియన్ల అమెరికా డాలర్లుగా నమోదయ్యాయి:
o పి.ఓ.ఎల్. వస్తువుల దిగుమతులు బాగా తగ్గడంతో, మొత్తం వస్తువుల దిగుమతుల వృద్ధి రేటు తగ్గింది.
o 2020-21 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రై మాసికంలో దిగుమతులు బాగా తగ్గాయి; బంగారం, వెండి దిగుమతుల్లో సానుకూల వృద్ధి కారణంగా సంకోచం యొక్క వేగం తరువాతి త్రైమాసికాల్లో, తగ్గింది; అదేవిధంగా, పి.ఓ.ఎల్. కాని, బంగారం, వెండి మినహా, ఇతర దిగుమతుల్లో సంకోచం కూడా తగ్గింది
o పి.ఓ.ఎల్. కాని, బంగారం, వెండి మినహా, ఇతర వస్తువుల దిగుమతుల పెరుగుదలకు, ఎరువులు, కూరగాయల నూనె, మందులు, ఔషధాలు, కంప్యూటర్ హార్డ్-వేర్, హార్డ్వేర్, పెరిఫెరల్సు, సానుకూలంగా దోహదపడ్డాయి
• దిగుమతులు తగ్గడంతో, చైనా, అమెరికా దేశాలతో వాణిజ్య సమతుల్యత మెరుగుపడింది
• 2020, ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో, 41.7 బిలియన్ అమెరికా డాలర్ల నికర సేవల రసీదులు స్థిరంగా ఉన్నాయి; ఏడాది క్రితం ఇదే కాలంలో, ఈ నికర సేవల రసీదులు 40.5 బిలియన్ అమెరికా డాలర్లు గా నమోదయ్యాయి
• సేవల రంగం యొక్క స్థితిస్థాపకత ప్రధానంగా సాఫ్ట్‌వేర్ సేవలచే నడపబడుతోంది; ఇది మొత్తం సేవల ఎగుమతుల్లో 49 శాతంగా ఉంది
• నికర ప్రైవేట్ బదిలీ రసీదులు, ప్రధానంగా విదేశాలలో పనిచేసే భారతీయుల చెల్లింపులను సూచిస్తాయి, ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి త్రై మాసికంలో, గత ఏడాది మొదటి త్రై మాసికంలో కంటే, 6.7 శాతం తక్కువగా, మొత్తం 35.8 బిలియన్ అమెరికా డాలర్ల మేర, నికర ప్రైవేట్ బదిలీ రసీదులు నమోదయ్యాయి
• 2020, సెప్టెంబర్ చివరలో, భారతదేశ బాహ్య రుణం 556.2 బిలియన్ అమెరికా డాలర్లుగా ఉంది; ఇది, 2020, మార్చి చివరితో పోలిస్తే, 2.0 బిలియన్ అమెరికా డాలర్ల (0.4 శాతం) మేర తగ్గింది
• రుణ బలహీనత సూచికలలో మెరుగుదల:
o ఫారెక్స్ నిల్వలతో, మొత్తం మరియు స్వల్పకాలిక రుణాలకు (అసలు మరియు అవశేష) నిష్పత్తి
o బాహ్య రుణ మొత్తం స్టాక్ తో, స్వల్పకాలిక రుణ నిష్పత్తి (అసలు మెచ్యూరిటీ) నిష్పత్తి
o రుణ సేవా నిష్పత్తి (అసలు తిరిగి చెల్లించడంతో పాటు వడ్డీ చెల్లింపు) 2020 సెప్టెంబర్ చివరి నాటికి 9.7 శాతానికి పెరిగింది, కాగా , ఇన్ 2020, మార్చి చివరి నాటికి ఇది 6.5 శాతంగా ఉంది.
• రూపాయి పెరుగుదల / తరుగుదల :
o 6 - కరెన్సీ నామమాత్రపు ప్రభావవంతమైన మార్పిడి రేటు (ఎన్.ఈ.ఈ.ఆర్) (వాణిజ్య ఆధారిత గుర్తింపు) పరంగా, 2020, మార్చి తో పోలిస్తే, 2020, డిసెంబర్‌లో రూపాయి విలువ 4.1 శాతం తగ్గింది; రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్ (ఆర్.ఈ.ఈ.ఆర్) పరంగా 2.9 శాతం పెరిగింది
o 36-కరెన్సీ ఎన్.ఈ.ఈ.ఆర్. (వాణిజ్యం ఆధారంగా గుర్తింపు) పరంగా, 2020 మార్చి కంటే, 2020 డిసెంబర్ లో రూపాయి విలువ 2.9 శాతం క్షీణించింది; ఆర్.ఈ.ఈ.ఆర్. పరంగా 2.2 శాతం పెరిగింది.
* విదీశీ మార్కెట్లలో ఆర్.బి.ఐ. జోక్యం ఆర్థిక స్థిరత్వం, క్రమమైన పరిస్థితులను నిర్ధారిస్తుంది, రూపాయి యొక్క అస్థిరతను, ఏకపక్ష పెరుగుదలను నియంత్రిస్తుంది
* ఎగుమతులను ప్రోత్సహించడానికి చేపట్టిన కార్యక్రమాలు :
o ఉత్పత్తికి అనుగుణంగా ప్రోత్సాహక (పి.ఎల్.ఐ) పథకం
- ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల ఉపశమనం (ఆర్.ఓ.డి.టి.ఈ.పి)
- రవాణా మౌలిక సదుపాయాలు మరియు డిజిటల్ కార్యక్రమాలలో మెరుగుదల
మనీ మేనేజ్‌మెంట్ మరియు ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్
• 2020 సమయంలో వసతి ద్రవ్య విధానం: మార్చి 2020 నుండి రెపో రేటు 115 బిపిఎస్ తగ్గించబడింది
• 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యత ఇప్పటివరకు మిగులులో ఉంది. ఆర్బిఐ వివిధ సంప్రదాయ మరియు అసాధారణమైన చర్యలను చేపట్టింది:
o బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు
o దీర్ఘకాలిక రెపో ఆపరేషన్లు
o లక్ష్య ఆధారిత సుదీర్ఘ కాల రెపో ఆపరేషన్స్
• షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 2020 మార్చి చివరి నాటికి 8.21% నుండి 2020 సెప్టెంబర్ చివరి నాటికి 7.49% కి తగ్గింది
• 2020-21 ఆర్ధిక సంవత్సరంలో తక్కువ పాలసీ రేట్ల డిపాజిట్ మరియు రుణ రేట్ల ద్రవ్య ప్రసారం మెరుగుపడింది
• జనవరి 20, 2021 న నిఫ్టీ -50 మరియు బిఎస్ఇ సెన్సెక్స్ వరుసగా 14,644.7 మరియు 49,792.12 రికార్డులను సాధించాయి.
• ఐబిసి ద్వారా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల రికవరీ రేటు (ప్రారంభమైనప్పటి నుండి) 45% పైగా ఉంది
ధరలు మరియు ద్రవ్యోల్బణం
• హెడ్‌లైన్ సిపిఐ ద్రవ్యోల్బణం:
o 2020 ఏప్రిల్-డిసెంబరులో సగటున 6.6% మరియు 2020 డిసెంబరులో 4.6% వద్ద ఉంది. ఇది ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల (2019-20లో 6.7% నుండి 2020 ఏప్రిల్-డిసెంబర్ మధ్య 9.1% వరకు కూరగాయల ధరలు పెరిగాయి)
o సిపిఐ హెడ్‌లైన్ మరియు దాని ఉప సమూహాలు 2020 ఏప్రిల్-అక్టోబర్ కాలంలో ద్రవ్యోల్బణాన్ని నమోదుచేశాయి. కొవిడ్ -19 లాక్‌డౌన్ వల్ల కలిగే ప్రారంభ అంతరాయాల కారణంగా
ధరల వేగం గణనీయంగా పెరిగింది.
o సానుకూల ఉప ప్రభావంతో పాటు చాలా ఉప సమూహాలకు నవంబర్ 2020 నాటికి మోడరేట్ ధరల వేగం ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి సహాయపడింది
• నవంబర్ 2019 నుండి, సిపిఐ-పట్టణ ద్రవ్యోల్బణం సిపిఐ-గ్రామీణ ద్రవ్యోల్బణంతో అంతరం తొలగించబడింది
o ఆహార ద్రవ్యోల్బణం ఇప్పుడు దాదాపుగా కలుస్తుంది
o సిపిఐ యొక్క ఇతర భాగాలలో ఇంధనం మరియు కాంతి, దుస్తులు మరియు పాదరక్షలు, ఇతరాలు మొదలైన వాటిలో గ్రామీణ-పట్టణ ద్రవ్యోల్బణంలో విభేదిస్తోంది.
o 2019 ఏప్రిల్-డిసెంబర్, అలాగే ఏప్రిల్-డిసెంబర్, 2020-21 మధ్యకాలంలో సిపిఐ-సి ద్రవ్యోల్బణం యొక్క ప్రధాన చోదకం ఆహార మరియు పానీయాల సమూహం:
o 2019 ఏప్రిల్-డిసెంబర్ సమయంలో 53.7% తో పోలిస్తే 2020 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో సహకారం 59% కి పెరిగింది.
o జూన్ 2020 మరియు నవంబర్ 2020 మధ్య థాలి ఖర్చు పెరిగింది. అయితే డిసెంబర్ నెలలో పదునైన పతనం అనేక ముఖ్యమైన ఆహార వస్తువుల ధరల తగ్గుదలను ప్రతిబింబిస్తుంది
• రాష్ట్ర వారీగా ఉన్న ప్రభావం:
o ప్రస్తుత సంవత్సరంలో చాలా రాష్ట్రాల్లో సిపిఐ-సి ద్రవ్యోల్బణం పెరిగింది
o ప్రాంతీయ వైవిధ్యం కొనసాగుతుంది
o జూన్-డిసెంబర్ 2020 లో ద్రవ్యోల్బణం రాష్ట్రాలు / యుటిలలో 3.2% నుండి 11% వరకు ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో (-) 0.3% నుండి 7.6% వరకు నమోదయింది.
• సూచికలోని ఆహార పదార్థాల బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆహార ద్రవ్యోల్బణం మొత్తం సిపిఐ-సి ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.
• ఆహార పదార్థాల ధరలను స్థిరీకరించడానికి తీసుకున్న చర్యలు:
o ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించడం
o ఉల్లిపాయల స్టాక్‌పై పరిమితి విధించడం
o పప్పుధాన్యాల దిగుమతులపై పరిమితిని తగ్గించడం
• బంగారం ధరలు:
o కొవిడ్-19 ప్రేరేపిత ఆర్థిక అనిశ్చితుల మధ్య పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మారారు.
o ఇతర ఆస్తులతో పోలిస్తే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో బంగారం చాలా ఎక్కువ రాబడిని కలిగి ఉంది
• దిగుమతి విధానంలో స్థిరత్వం అవసరం:
o ఆహార నూనెల దిగుమతులపై ఎక్కువ ఆధారపడటం దిగుమతి ధరలలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది.
o దేశీయ ఆహార నూనెల మార్కెట్ ఉత్పత్తి మరియు ధరలను ప్రభావితం చేసే దిగుమతులు, పప్పుధాన్యాలు మరియు ఆహార నూనెల దిగుమతి విధానంలో తరచూ మార్పులతో పాటు, రైతులు / ఉత్పత్తిదారులలో గందరగోళం మరియు దిగుమతులను ఆలస్యం చేస్తుంది
సుస్థిర అభివృద్ధి మరియు వాతావరణ మార్పు
• విధానాలు, పథకాలు మరియు కార్యక్రమాలలో ఎస్‌డిజిలను ప్రధాన స్రవంతిగా చేయడానికి భారతదేశం అనేక చురుకైన చర్యలు తీసుకుంది
• సుస్థిర అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి హై-లెవల్ పొలిటికల్ ఫోరం (హెచ్‌ఎల్‌పిఎఫ్) కు స్వచ్ఛంద జాతీయ సమీక్ష (విఎన్‌ఆర్) సమర్పించబడింది.
• 2030 అజెండా కింద లక్ష్యాలను సాధించే లక్ష్యంతో ఏదైనా వ్యూహానికి ఎస్‌డిజిల స్థానికీకరణ చాలా ముఖ్యమైనది
o అనేక రాష్ట్రాలు / యుటిలు ఎస్‌డిజిల అమలు కోసం సంస్థాగత నిర్మాణాలను సృష్టించాయి మరియు ప్రతి విభాగం మరియు జిల్లా స్థాయిలో మెరుగైన సమన్వయం మరియు కలయిక కోసం నోడల్ విధానాలను రూపొందించాయి.
• కొవిడ్-19 మహమ్మారి సంక్షోభం ఉన్నప్పటికీ సుస్థిర అభివృద్ధికి సంబంధించిన వ్యూహం ప్రధానమైనది
సుస్థిర అభివృద్ధి మరియు వాతావరణ మార్పు
వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్‌ఐపిసిసి) కింద ఎనిమిది జాతీయ మిషన్లు వాతావరణ ప్రమాదాలపై అనుసరణ, ఉపశమనం మరియు సంసిద్ధత యొక్క లక్ష్యాలపై దృష్టి సారించాయి.
• భారతదేశం యొక్క జాతీయంగా నిర్ణయించిన చర్యలు (ఎన్‌డిసీ) వాతావరణ మార్పులపై చర్యకు ఆర్ధికం ఒక కీలకమైన సహాయకారి అని పేర్కొంది
• అందువల్ల దేశం గణనీయంగా లక్ష్యాలను పెంచేటప్పుడు ఫైనాన్సింగ్ పరిగణనలు చాలా కీలకంగా ఉంటాయి
• అభివృద్ధి చెందిన దేశాల వాతావరణ ఫైనాన్సింగ్ కోసం 2020 సంవత్సరం నాటికి 100 బిలియన్ డాలర్లను సంయుక్తంగా సమీకరించే లక్ష్యం అస్పష్టంగానే ఉంది
• కాప్26 ను 2021 కు వాయిదా వేయడం కూడా 2025 తరువాత లక్ష్యాన్ని తెలియజేయడానికి చర్చలు మరియు ఇతర సాక్ష్య-ఆధారిత పనులకు తక్కువ సమయం ఇస్తుంది.
• ప్రపంచ బాండ్ మార్కెట్లలో మొత్తం వృద్ధి ఉన్నప్పటికీ, 2020 మొదటి అర్ధభాగంలో గ్రీన్ బాండ్ల జారీ 2019 నుండి మందగించింది. బహుశా కొవిడ్-19 ప్రభావ ఫలితం ప్రస్తుతం కొనసాగుతుండడం అందుకు కారణం కావొచ్చు.
• ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్‌ఏ) రెండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది - ‘వరల్డ్ సోలార్ బ్యాంక్’ మరియు ‘వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్’-కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా సౌర శక్తి విప్లవాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి.
వ్యవసాయం , ఫుడ్ మేనేజ్ మెంట్
- కోవిడ్ -19 కారణంగా విధించింన లాక్డౌన్ కారణంగా ఏర్పడిన వ్యతిరేకత ఉన్నప్పటికీ దేశ వ్యవసాయ అనుబంధ రంగాలు 2020-21 స్థిర ధరల వద్ద 34.4 శాతం పురోగతిని సూచించింది. ( తొలి ముందస్తు అంచనాలు)
- వ్యవసాయం అనుబంధరంగాల వాటా దేశంలో స్థూల విలువ జోడింపులో 2019-20 సంవత్సరానికి ప్రస్తుత ధరల వద్ద 17.8 శాతం గా ఉంది. ( సి.ఎస్.ఒ- జాతీయ ఆదాయ ప్రాథమిక అంచనాలు .29 మే 2020)
-జివిఎ కు సంబంధించి గ్రాస్ కాపిటల్ ఫార్మేషన్ (జిసిఎఫ్) 2013-14 లో 17.7 శాతం గా ఉండగా 2018-19 సంవత్సరంలో అది 16.4 శాతానికి 2015-16 లో అది 14.7 శాతానికి పడిపోయి హెచ్చుతగ్గులను సూచించింది.
2018-19 వ్యవసాయ సంవత్సరంలో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి (నాలుగవ ముందస్తు అంచనాల ప్రకారం ) 11.44 మిలియన్ టన్నులు. ఇది 2018-19 కంటే ఎక్కువ.
-వాస్తవ వ్యవసాయ రుణ సరఫరా 2019-20లో రూ 13,50,000 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా రూ 13,92,469.81 కోట్లు సరపరా జరిగింది. 2020 నవంబర్ 30 నాటికి రూ 9,73,517.80 కోట్ల రూపాయలను 2020 నవంబర్ వరకు పంపిణీ చేయడం జరిగింది.
--2020 ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రకటన అనంతరం ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ లో భాగంగా పాల సహకారసంఘాలకు చెందిన 1.5 కోట్ల డైరీ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు సమకూర్చేందుకు లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగింది.
--2021 జనవరి మధ్య నాటికి మొత్తం 44,673 కిసాన్ క్రెడిట్ కార్డులు ( కెసిసిలు) మత్స్యకారులు, మత్స్యరైతులకు జారీ చేయడం జరిగింది. అదనంగా 4.04 లక్షల దరఖాస్తులు క్రెడిట్ కార్డుల జారీ కోసం బ్యాంకుల వద్ద వివిధ దశలలో ఉన్నాయి.
--ప్రధానమంత్రి పసల్ బీమా యోజన ఏటికేడాది 5.5 కోట్ల రైతుల దరఖాస్తులను కవర్‌చేస్తుంది.
--2021 జనవరి 12 నాటికి 90,000 కోట్ల రూపాయల క్లెయిమ్‌లు పరిష్కరించడం జరిగింది.·
--సత్వర క్లెయిమ్ సెటిల్మెంట్ నేరుగా రైతుల ఖాతాలలోకి ఆధార్ లింకేజ్ ద్వారా పంపడం జరుగుతోంది.
--దీనిద్వారా 70 లక్షల మంది రైతలు ప్రయోజనం పొందారు. 8741.30 కోట్ల రూపాయల మేరకు కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో వారి ఖాతాలకు బదలీ చేయడం జరిగింది.
--2020 డిసెంబర్‌లో పి.ఎం -కిసాన్ పథకం కింద 7 వ విడత ఆర్ధిక ప్రయోజనం కింద 9 కోట్ల మంది రైతు కుటుంబాల వారికి వారి ఖాతాలలో 18,000 కోట్ల ర ఊపాయలు డిపాజిట్ చేయడం జరిగింది.
--2019-20 సంవత్సరంలో మత్స్య ఉత్ప్ త్తి రికార్డు స్థౄయిలో 14.16 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది.
--మత్స్యరంగం జివిఎ దేశ ఆర్ధిక వ్యవస్థకు 2,12,915 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది దేశ మొత్తం జివిఏ లో 1.24 శాతం, వ్యవసాయ జివిఎ లో 7.28 శాతం.
- తో అంతమైన 5 సంవత్సరాల కాలానికి చూసినపుడు ఫుడ్ ప్రాసెసింగ్ రంగం 2011-12 ధరలతో పోల్చినపుడు వ్యవసాయరంగంలో 3.12 శాతం, తయారీ రంగంలో 8.25 శాతంతో సగటు వార్సిక వృద్ధి రేటు (ఎఎజిఆర్) 9.99 కలిగి ఉంది.
-ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన:
--2020 నవంబర్ వరకు 80.96 కోట్ల మంది లబ్ధిదారులకు ఎన్.ఎఫ్.ఎస్.ఎ నిర్దేశిత అవసరాలకు మించి ఉచితంగా ఆహారధాన్యాలు అందించడం జరిగింది.
-200 లశ్రీోల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు లబ్ధిదారులకు అందించడం జరిగింది. దీనివల్ల 75,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది.
--ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజ్ : ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద నాలుగు నెలల కాలానికి ( మే నుంచి ఆగస్టు వరకు) ప్రతి నెలకు ఐదు కేజిల వంతున సుమారు 8 కోట్ల మంఇ వలసకూలీలకు ( ఎన్ ఎఫ్.ఎస్ ఎ కింది మినహాయించిన లేదా రాష్ట్ర రేషన్ కార్డు కింద మినహాయించిన వారి కి రేషన్ అందించడం జరిగింది. ఇందుకు సంబంధించిన సబ్సిడీ మొత్తం సుమారు యరూ య3109 కోట్ల రూపాయలు.
- , మౌలిక సదుపాయాలు
- ఐఐపి డాటా ప్రకారం బలమైన వి ఆకారపు ఆర్ధిక కార్యకలాపాల రికవరీ దృవీపకరింపబడింది.
-ఐఐపి, ఎనిమిది కీలకరంగాల ఇండెకస్ కోవిడ్ ముందస్తు స్థాయికి ముందుకు వెళ్లింది.
- ఐఐపిలో స్థూల రికవరీ నవంబర్ 2020 లో (-) 1.9 శాతం ఉండగా 2019 నంబంర్‌లో గ్రోత్ రేట్ 2.1 శాతంగా ఉంది. 2020 ఏప్రిల్‌లో ఇది (-) 57.3 శాతం
- ప్రభుత్వం మూలధన వ్యయం పెంచడంతో పారిశ్రామిక కార్యకలాపాలు మరింత మెరుగు పడ్డాయి. వాక్సినేషన్ కార్యక్రమం, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సంస్కరణలు ఊపందుకున్నాయి.
- ఆత్మనిర్భర్‌భారత్భియాన్‌ను ఇండియా జిడిపిలో 15 శాతం మొత్తంతో ఉద్దీపన ప్యాకేజ్‌ని ప్రకటించడం జరిగింది.
- 2019 కి సంబంధించి సులభతర వాణిజ్యం విషయంలో ఇండియా ర్యాంకు 2018లో 77 గా ఉండగా 2020లో ఇది 63వ ర్యాంకుకు ఎగువకు పాకింది. దీనిని డూయింగ్ బిజినెస్ రిపోర్టు వెల్లడించింది.
-ఇండియా తన స్థాయిని పది సూచికలలో 7 సూచికల విషయంలో మెరుగుదల కనబరచింది.
- బాగా మెరుగుపడుతున్న దేశాలలో ఇండియా ఒకటిగా గుర్తింపు పొందింది. వరుసగా మూడవ సారి ఈ గుర్తింపు పొందింది. మూడు సంవత్సరాల వ్యవధిలో 67 ర్యాంకుల మెరుగుదల సాధించింది.
- 2011 తర్వాత మరే దేశమూ ఇంతటి భారీ మెరుగుదల ను సాధించలేదు.
-విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక 2020 ఆర్ధిక సంవత్సరంలో 49.98 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. 2019 ఆర్ధిక సంవత్సరంలో ఇది 44.37 బిలియన్ అమెరికన్ డాలర్లు.
2021 ఆర్థిక సంవత్సరానికి 30.0 బిలియన్ అమెరికన్ డాలర్లు (2020 సెప్టెంబర్ వరకు )
-ఎఫ్‌డిఐ బల్క్ ఈక్విటీ ఫ్లో తయారీ యేతర రంగంలో ఉంది.
--తయారీరంగంలో తిరిగి ఆటోమొబైల్స్,టెలికమ్యూనికేషన్,మెటలర్జికల్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, కెమికల్ ఇతర ఫర్టిలైజర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోలియం , నాచురల్ గ్యాస్ రంగాలలో బల్క్ ఎఫ్.డి.ఐ లు వచ్చాయి.
- ఆత్మనిర్భర్ భారత్ కింద తయారీ రంగ సామర్ధ్యం, ఎగుమతులు పెంచేందుకు ప్రభుత్వం ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకం (పిఎల్ఐ)ను పది కీలక రంగాలకు ప్రకటించింది.
--· దీనిని సంబంధిత మంత్రిత్వ శాఖలు అమలు చేస్తాయి. దీని మొత్తం వ్యయ అంచనా 1.46 లక్షల కోట్ల రూపాయలు, దీనికి ఆయా రంగాలకు ప్రత్యేకంగా ఆర్ధిక పరిమితులు ఉన్నాయి
- -దీనిని 146 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సంబంధిత మంత్రిత్వశాఖ ల ఆధ్వర్యంలో ఆయారంగాల ప్రత్యేక ఆర్ధిక పరిమితులతో దీనిని అమలు చేస్తారు
సేవల రంగం:
-ఇండియా సేవల రంగం 2020-21 ఆర్ధిక సంవత్సరం తొలి అర్థ సంవత్సరంలో సుమారు 16 శాతం వరకు తగ్గుదల కనిపించింది కోవిడ్ -19 మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధింపు, కాంటాక్ట్ తీవ్రత స్వభావం కలిగినది కావడంతో ఈ తగ్గుదల కనిపించింది
-సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్ల ఇండెక్స్, రెయిల్ ఫ్రయిట్ ట్రాఫిక్, పోర్టు ట్రాఫిక్, వంటివి అన్నీ వి షేప్ రికవరీని సూచిస్తున్నాయిలాక్‌డౌన్ సమయంలో ఇవి భారీగా పతనమయ్యాయి. ఆ తర్వాత పుంజుకుంటున్నాయి.
-అంతర్జాతీయంగా వివిధ రంగాలలో ఒడుదుడుకులు ఏర్పడినప్పటికీ ఇండికు సేవల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక అద్భుతంగా పెరిగింది ఇది ఇయర్ ఆన్ ఇయర్ కు సంబంధించి 2020 ఏప్రిల్ -సెప్టెంబర్ కు 236 బిలియన్‌డాలర్లకు చేరుకుంది
-భారతదేశజివిఎలో సేవల రంగం 54 శాతానికి పైగా ఉంటుంది. భారతదేశంలో ఐదింట నాలుగువంతుల మేరకు భారత్‌లోకి వస్తున్న ఎఫ్‌డి.ఐ ఈరంగానికి చెందినదే.
-జివిఎ సెక్టర్‌షేరు 33 రాష్ట్రాల కు గాను 15 రాష్ట్రాలలో 50 శాతానికి మించి ఉంది.ఢిల్లీ , చండీఘడ్‌లలో ఇది 85 శాతం కంటే ఎక్కువ ఉంది.
-మొత్తం ఎగుమతులలో సేవల రంగం 48 శాతం,ఇటీవలి కాలంలో సరకు ఎగుమతులు అద్భుత పనితీరు ను కనబరుస్తున్నాయి.
--షిప్పింగ్ రంగం మంచిపనితీరు కనబరుస్తోంది. వీటిలో టర్న్‌రౌండ్ టైమ్ 2010లో 4.67 రోజులు ఉండగా 2019-20 నాటికి ఇఇది 2.62 రోజులకు తగ్గింది.
-- భారతీయ స్టార్టప్ ఎకో సిస్టమ్ అద్భుతంగా పురోగమిస్తున్నది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలోనూ ఇవి పురోగమిస్తున్నాయి. 38 యూనికార్న్‌లు ఉన్నాయి.గత ఏడాది రికార్డు సంఖ్యలో 12 స్టార్టప్‌లు యూనికార్న్ జాబితాలో చేరాయి.
- గడచిన ఆరు దశాబ్దాలలో భారతదేశ అంతరిక్ష రంగం అద్భుత అభివృద్ధిని సాధించింది.
--2019-20 సంవత్సరంలో అంతరిక్ష కార్యక్రమానికి 1.8 బిలియన్ అమెరికన్ డాలర్లను వెచ్చించడం జరిగింది.
- అంతరిక్ష రంగంలో పలు విధానపరమైన సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేటు రంగానికి అవకాశంకల్పించడం,ఆవిష్కరణలు, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సామాజిక మౌలిక సదుపాయాలు, ఉపాధి, మానవాభివృద్ధి:
-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం సామాజిక రంగాల వ్యయం జిడిపిలో 2020-21 సంవత్సరానికి , అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే పెరిగింది.
హెచ్‌డిఐ 2019లో ఇండియా ర్యాంకు 189 దేశాలలో 131 గా రికార్డు అయింది:
ఇండియా జిఎన్ ఐ తలసరిఆదాయం ( 2017 పిపిపి డాలర్లు)2018లో 6,427 అమెరికన్ డాలర్ల నుంచి2019లో 6,681 అమెరికన్ డాలర్లకు పెరిగింది.
-జననాలకు సంబంధించి ఆయుర్దాయం 2018లో 69.4 గా ఉండగా 2019కి అది 69.7 కు చేరింది.
-డాటా నెట్‌వర్క్,ఎలక్ట్రానిక్ పరికరాలైన కంప్యూటర్, లాప్‌టాప్,స్మార్ట్‌ఫోన్ తదితరాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.కోవిడ్ మహమ్మారికారణంగా ఆన్‌లైన్ చదువులు, ఇంటినుంచే పనిచేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
-2019 జనవరి - 2019 మార్చి మధ్య ( పిఎల్ఎఫ్ ఎస్ త్రైమాసిక సర్వే) శ్రమికులలో ప్రధాన వాటా రెగ్యులర్ వేతనదారులు, జీతాలు అందుకునేవారు ఉన్నారు.
-ఆత్మనిర్భర్ భారత్‌రోజ్‌గార్ యోజన కింద ఉపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. అలాగే ప్రస్తుత లేబర్‌కోడ్‌లను నాలుగు కోడ్‌లుగా సులభతరంచేసింది.
ఇండియాలో తక్కువ స్థాయిలో మహిళా ఎల్ ఎఫ్ పి ఆర్:
-- మహిళలు ఇంటి పనులకు, కుటుంబ సభ్యుల సంరక్షణ సేవలకు తమ పురుష భాగస్వాములతో పోలిస్తే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు ( టైమ్ యూజ్ సర్వే 2019)
-పనిప్రదేశంలో వివక్ష లేకుండా వేతనాలు, కెరీర్‌లో ఎదిగే అవకాశాలలో వివక్ష లేకుండా పనినిమెరుగుపరిచే ప్రోత్సాహకాలు ఇతర వైద్య, సామాజిక భద్రతా ప్రయోజనాలను మహిళా వర్కర్లకు కల్పించడం.
- 2020 మార్చిలో ప్రకటించిన పిఎంజికెపి కింద ప్రస్తుతం వయోధికులు, వితంతువులు, దివ్యాంగులైన లబ్ధిదారులకు జాతీయ సామాజిక సహాయతా పధకంకింద వెయ్యిరూపాయల వరకు నగదు బదిలీ.
-ప్రధానమంత్రి జన్‌ధన్‌యోజన కింద మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరి బ్యాంక్ ఖాతాలో 500 రూపాయల వంతున మూడు నెలలపాటు జమ చేయడం జరిగింది. దీని మొత్తం రూ 20.64 కోట్ల రూపాయలు.
- మూడు నెలల పాటు 8 కోట్ల కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ.
-63 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు పూచీకత్తులేని ఉచిత రుణ సదుపాయ పరిమితిని 10 లక్షలర ఊపాయలనుంచి20 లక్షల రూపాయలకు పెంపు. ఇది 6.85 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తుంది.
- మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీపథకం ఎం.ఎన్ ఆర్.ఇ.జి.ఎ కింద వేతనాలను 2020 ఏప్రిల్1 నుంచి20 రూపాయలు పెంచి రూ 182నుంచి 202 రూపాయలు చేయడం జరిగింది.
కోవిడ్ పై ఇండియా పోరాటం:
- ఆదిలోనే లాక్‌డౌన్‌కు సంబంధించినచర్యలు, సామాజికదూరం పాటించడం, ప్రయాణాలకు సంబంధించిన సూచలను, చేతులు శుభ్రంచేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించడం, ముఖానికి మాస్కులు ధరించడంపై అవగాహన పెంపు వంటి వాటివల్ల కోవిడ్‌వ్యాప్తి గణనీయంగా తగ్గింది.
-అత్యావశ్యక మందుల విషయంలో దేశం స్వావలంబన సాధించింది. అలాగే చేతులు శుబ్రపరుచుకునే శానిటైజర్లు, రక్షణ పరికరాలు,మాస్కులు,పిపిఇ కిట్లు, వెంటిలేటర్లు ,కోవిడ్ టెస్టింగ్ ట్రీట్‌మెంట్ ఫెసిలీటలలో స్వావలంబన సాధించడం జరిగింది.
- ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమం 2021 జనవరి 16న ప్రారంభమైంది. దేశీయంగా తయారైన రెండు వాక్సిన్‌లను ఇందులో ఉ పయోగిస్తున్నారు.
***
(Release ID: 1693351)
Visitor Counter : 8197
Read this release in:
Odia
,
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada