ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు లో బడ్జెటు సమావేశాలు ప్రారంభం కావడాని కంటే ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు
Posted On:
29 JAN 2021 11:12AM by PIB Hyderabad
మిత్రులారా నమస్కారం,
ఈ దశాబ్దం లో తొలి సమావేశాలు శుక్రవారం నాడు ఆరంభమవుతున్నాయి. ఈ దశాబ్దం భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కు చాలా ముఖ్యమైంది. మరి ఈ కారణం గా మన స్వాతంత్య్ర సమరయోధులు కన్న కలల ను వేగవంతంగా నిజం చేయడానికి ఒక సువర్ణావకాశం దేశం ముంగిట కు వచ్చి నిలచింది. ఈ దశాబ్దాన్ని సరి అయిన విధంగా ఉపయోగించుకోవాలి. అందుకని ఈ మొత్తం దశాబ్దాన్ని దృష్టిలో పెట్టుకొని చర్చలు జరగాలి. అర్థవంతమైన ఫలితాల కోసం భిన్నాభిప్రాయాల ను వ్యక్తం చేయాలి. దేశం తాలూకు అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.
Narendra Modi
@narendramodi
Speaking at the start of the Budget Session.
Speaking at the start of the Budget Session.
pscp.tv
10:38 AM · Jan 29, 2021
20.6K
5.3K
Copy link to Tweet
https://t.co/qhQMTEXOsG?amp=1
దేశ ప్రజలు ఏ విధమైన ఆశ తో, అంచనా తో మనందరినీ పార్లమెంటు కు పంపించారో, ఆ ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడానికి ఈ పవిత్ర ప్రదేశమైన పార్లమెంటును పూర్తిగా వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య మర్యాద ను పాటించడం ద్వారా మనం మన వంతు తోడ్పాటును అందించడానికి వెనుకాడబోమన్న విశ్వాసం నాలో ఉంది. ఎమ్‌పి లంతా కలిసికట్టుగా ఈ సమావేశాల ను ఫలప్రదంగా తీర్చిదిద్దుతారన్న పూర్తి నమ్మకం నాలో ఉంది.
ఇవి బడ్జెటు సమావేశాలు కూడాను. బహుశా భారతదేశం చరిత్ర లో మొట్టమొదటి సారిగా మన ఆర్థిక మంత్రి 2020వ సంవత్సరం లో నాలుగైదు మినీ బడ్జెటు లను- దేనికదే ప్రత్యేక ప్యాకేజీ రూపం లో- సమర్పించవలసి వచ్చింది. అంటే 2020వ సంవత్సరం లో ఒక విధంగా మినీ బడ్జెటు ల పరంపర కొనసాగిందన్న మాట. మరి ఈ కారణంగా, ఈ బడ్జెటును కూడా ఆ నాలుగైదు బడ్జెటు ల పరంపరలో ఒక భాగంగానే చూస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.
నేను మరొక్క సారి ఈ రోజు న మాన్య రాష్ట్రపతి మార్గదర్శకత్వం లో ఉభయ సభల ఎమ్‌పి లు అందరితో కలిసి రాష్ట్రపతి సందేశాన్ని ఆచరణ లోకి తీసుకు రావడం కోసం కంకణం కట్టుకుని మరీ పాటుపడతాము.
అనేకానేక ధన్యవాదాలు.
అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి దాదాపు గా చేసిన అనువాదం. ప్రధాన మంత్రి మూల ప్రసంగం హిందీ భాష లో కొనసాగింది.
***
(Release ID: 1693160)
Visitor Counter : 228
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam