ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ మీద మంత్రుల బృందం 23వ సమావేశానికి డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షత
భారతదేశంలో కోవిడ్ నామమాత్రంగా మారింది : 146 జిల్లాల్లో 7 రోజులుగా, 18 జిల్లాల్లో 14 రోజులుగా, 6 జిల్లాల్లో 21 రోజులుగా, 21 జిల్లాల్లో 28 రోజులుగా ఒక్క కేసు కూడా రాలేదు

కీలక సమయంలో స్వదేశీ తయారీ వాక్సిన్ అందించటం ద్వారా భారత్

ప్రపంచ ప్రజల విశ్వాసం చూరగొన్నది: డాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 28 JAN 2021 12:24PM by PIB Hyderabad

కోవిడ్ మీద ఈ రోజు జరిగిన మంత్రుల బృందం 23వ సమావేశానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో విదేశ వ్యవహారాల శాఖామంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, పౌర విమానయానశాఖామంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే , హోం శాఖ సహాయమంత్రి శ్రీ నిత్యానంద్ రాజ్, ఓడలు, నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాలు, రసాయనాలు, ఎరువుల శాఖల సహాయమంత్రి శ్రీ మాన్ సుఖ్ మందవ్య కూడా పాల్గొన్నారు. డాక్టర్ వినోద్ కె పాల్. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వినోద్ కె పాల్ కూడా హాజరయ్యారు.  

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZNBR.jpg

కోవిడ్ నియంత్రణ దిశలో మంత్రుల బృందం ఏర్పాటై కార్యకలాపాలు మొదలుపెట్టి ఏడాది పూర్తయిన సంగతి ప్రస్తావిస్తూ డాక్టర్ హర్షవర్ధన్ తన ప్రసంగం ప్రారంభించారు. “ మొదటి కేసు నిరుడు జనవరి 30న బైటపడింది. ఈ విషయమై ఏర్పాటైన మంత్రుల బృందం  మొదటి సారిగా ఫిబ్రవరి 3న సమావేశమైంది. మొత్తం ప్రభుత్వం మొత్తం సమాజం కోసం కృషి చేయాలన్న దృక్పథంతో ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారతదేశం కోవిడ్ ను సమర్థంగా నియంత్రించగలిగింది. గత 24 గంటలలో 12,000 కంటే తక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 1.73 లక్షలు మాత్రమే. “ అన్నారు.

కోవిడ్ మీద పోరులో భారత్ సాధించిన విజయాలను మంత్రి ప్రస్తావించారు. “ 146 జిల్లాల్లో గత 7 రోజులుగా,18 జిల్లాల్లో 14 రోజులుగా, 6 జిల్లాల్లో 21 రోజులుగా, 21 జిల్లాల్లో 28 రోజులుగా ఒక్క కేసు కూడా రాలేదు. ఇది చురుగ్గా మరిన్ని కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరపటం వల్ల మాత్రమే సాధ్యమైంది. ఇప్పటివరకు 19.5 కోట్ల మందికి కోవిడ్ పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం పరీక్షలు నిర్వహించగల సామర్థ్యం రోజుకు 12 లక్షలు అయింది.”  అన్నారు.

ఇప్పుడు కోవిడ్ చికిత్స అందుకుంటున్నవారిలో కేవలం 046% మాత్రమే వెంటిలేటర్ మీద ఉన్నారని, 2.26% మంది ఐసియు లో చికిత్సపొందుతూ ఉన్నారని, 3.02% మంది ఆక్సిజెన్ మీద ఉన్నారని కూడా ఆయన చెప్పారు.   యుకె తరహా వైరస్ సోకినవారి సంఖ్య ఇప్పటివరకు 165 కాగా వారందరినీ క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షిస్తున్న సంగతి కూడా తెలియజేశారు.

అంతర్జాతీయ సంక్షోభ సమయంలో భారతదేశం ఇతరదేశాలకు కూడా కోవిడ్ టీకా మందు అందించగలిగే స్థితిలో ఉండటం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు గర్వకారణమనన్నారు. వాక్సిన్ ఇవ్వటంలో జాగ్రత్తలు, మెలకువలమీద అనేక దేశాల సిబ్బందికి కూడా శిక్షణ ఇచ్చామన్నారు.  ప్రపంచదేశాలకు మిత్ర దేశంగా భారతదేశం స్వదేశీ ఔషధాలను ఈ కీలక సమయంలో అందించటం ద్వారా అందరి విశ్వాసం చూరగొన్నదని డాక్టర్ హర్షవర్ధన్ అభివర్ణించారు. 

ఎన్ సి డి సి డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కె సింగ్ భారతదేశంలో కోవిడ్ ప్రస్తుత పరిస్థితి మీద, భవిష్యత్ మీద సవివరమైన నివేదికను మంత్రుల బృందానికి సమర్పించారు. ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు ఎంత వేగంగా కోవిడ్ అదుపులోకి వచ్చిందో కూడా వివరించారు. భారతదేశంలో కేసుల పెరుగుదల ప్రపంచంలో అతి తక్కువగా నమోదైన దేశాల్లో భారత్ ఒకటి అని, వారానికి కేవలం 0.90% మాత్రమే ఉందని గుర్తు చేశారు.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002R2Y9.jpg

రోజువారీ కొత్త కెసులు, కోలుకున్నవారి సంఖ్య, పాజిటివ్ శాతం, ఎప్పటికప్పుడు చికిత్సలో ఉన్నవారి సంఖ్య తదితర అంశాలను ఆయన మంత్రుల బృందానికి వివరించారు.  ఏయే జిల్లాల్లో కేసులు ఎక్కువ కేంద్రీకృఅతమయ్యాయిఒ, ఎక్కడ మరణాలు ఎక్కువ సంభవించాయి అనే విషయాలమీద కూడా సమగ్ర నివేదిక ఇచ్చారు. అదే విధంగా యుకె వైరస్ సోకినప్పుడు ఎలా అదుపుచేయగలిగామన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.  2020 జూన్ మధ్యలో మరణాల శాత   3.4 % ఉండగా ప్రస్తుతం అది 1.4 % కావటం,  దేశంలో అత్యధికంగా దాద్రా, నాగర్ హవేలి లో 99.79% కోలుకోవటం గురించి ప్రత్యేకంగా గుర్తు చేశారు.  3.4%.  అరుణాచల్ ప్రదేశ్ (99.58%) ఒడిశా (99.07%) కేరళ (91.61% ) లో కోలుకున్నశాతాన్ని ప్రస్తావించారు.

డాక్టర్ వినోద్ కె పాల్ ( నీతి ఆయోగ్), కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్ టీకాల రూపకల్పన మొదలు టీకాలు వేసే కార్యక్రమం అమలు వరకు  సవివరమైన నివేదిక అందజేశారు. టీకాల కార్యక్రమంలో ఎలాంటి ఒడిదుడుకులు  లేకుందా చేపడుతున్న విధానాన్ని వివరించారు. రాష్ట్రాలకు మొదటి మూడు రోజుల్లోనే  నమూనా పంపిణీకింద 112.4 లక్షల డోసుల పంపిణీ జరిగిందని ఆ తరువాత పూర్తి స్థాయి పంపిణీ జరిగిందని 93,76,030 మంది ఆరోగ్య సిబ్బందికి టీకాలివ్వటంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కొంతమంది టీకాలపట్ల దుష్ప్రచారం చేస్తుండగా  దానిని ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోగలిగిన అంశం ప్రస్తావించారు. కో-విన్ పోర్టల్ ద్వారా టీకాల రిజిస్ట్రేషన్లకు తగిన స్పందన రావటం పట్ల సమావేసం సంతృప్తి వ్యక్తం చేసింది.

ప్రస్తుతం భారతదేశం టీకాలివ్వటంలో ఆరవ స్థానంలో ఉందని, కొద్ది రోజుల్లోనే 3వ స్థానికి ఎగబాకుతుందని డాక్టర్ పాల్ తెలియజేసారు.  ఇప్పటివరకు మొత్తం 23 లక్షలమందికి టీకాలివ్వగా అందులో కేవలం 16 మంది మాత్రమే టీకా ప్రభావం వల్ల ఆస్పత్రి పాలయ్యారని చెప్పారు. ఇది 0.0007%  మాత్రమే అని గుర్తు చేశారు.  రోజువారీ కొత్త కెసులు ఎలా తగ్గుతూ వస్తున్నాయో కూడా ఆయన మంత్రుల బృందానికి వివరించారు. 

స్వదేశంలో టీకాలకు సరిపడా మందు ఉంచుకోవటం, విదేశాలనుంచి వచ్చే అభ్యర్థలకు స్పందించటం మధ్య సమన్వయం చేసుకోవటం మీద కూడా సమావేశం స్పందించింది. ఔషధ విభాగం కార్యదర్శి కుమారి ఎస్. అపర్ణ ఈ విషయంలో తీసుకున్న చర్యలను మంత్రుల బృందానికి వివరించారు.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003AR9A.jpg

పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ ప్రదీప్ సింగ్ ఖరోలా, డిపిఐఐటి కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్ మహాపాత్ర, వైద్య పరిశోధన కార్యదర్శి, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ,  విదేశాంగశాఖ అదనపు కార్యదర్శి  శ్రీ దమ్ము రవి, బలరామ్ భార్గవ, హోమ్ వ్యవహారాల అదనపు కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి నీరజా శేఖర్, విదేశ వర్తక విభాగం డైరెక్టర్ జనరల్ శ్రీ అమిత్ యాదవ్, డిజిహెచ్ ఎస్ డాక్తర్ సునీల్ కుమార్ పలువురు సీనియర్ ప్రభుత్వఅధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.  

***(Release ID: 1692952) Visitor Counter : 119