ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోలుకున్న శాతం అత్యధికంగా నమోదైన దేశాల్లో భారత్ కు స్థానం, ప్రస్తుతం 97% 31 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చికిత్సలో ఉన్నవారు 5వేల లోపు

Posted On: 28 JAN 2021 11:02AM by PIB Hyderabad

కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో భారత్ లో కోలుకున్నవారి శాతం దాదాపు 97% కు చేరుకుంది. భారత్ లో నమోదైన కోలుకున్న శాతం అతికొద్ది ప్రపంచదేశాల్లో మాత్రమే నమోదైంది .

ఇప్పటివరకు మొత్తం 1,03,73,606 మంది కొవిడ్ బాధితులు కోలుకోగా, గత 24 గంటల్లోనే  14,301 మంది కోలుకున్నారు.

దేశంలో ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య ఇంకా తగ్గి ప్రస్తుతం1,73,740 కు చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో  1.62% మాత్రమే.

 

 

జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ధోరణికి అద్దం పడుతూ 31 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో   5,000 కంటే తక్కువమంది కోవిడ్ తో బాధపడుతూ చికిత్సపొందుతున్నారు.  

చికిత్సపొందుతూ ఉన్నవారిలో 78% మంది కేవలం 5 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. ఆ రాష్ట్రాలు కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమబెంగాల్.

2021 జనవరి 28వ తేదీ ఉదయం 7.30 వరకు 23,55,979 మంది దేశవ్యాప్తంగా కోవిడ్-19 టీకాలు వేయించుకున్నారు. గడిచిన 24 గంటలలో మొత్తం 6,102 శిబిరాలలో 3,26,499 మంది టీకాలు అందుకున్నారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా  42,674 శిబిరాలు నిర్వహించారు.

 

సంఖ్య

రాష్టం/కేంద్రపాలితప్రాంతం

టీకా లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

2,385

2

ఆంధ్ర ప్రదేశ్

1,63,727

3

అరుణాచల్ ప్రదేశ్

7,307

4

అస్సాం

19,945

5

బీహార్

89,074

6

చండీగఢ్

2,355

7

చత్తీస్ గఢ్

51,647

8

దాద్రా, నాగర్ హవేలి

345

9

డామన్, దయ్యూ

320

10

ఢిల్లీ

39,764

11

గోవా

2,311

12

గుజరాత్

94,524

13

హర్యానా

1,09,782

14

హిమాచల్ ప్రదేశ్

14,054

15

జమ్మూ కశ్మీర్

16,331

16

జార్ఖండ్

24,020

17

కర్నాటక

2,67,811

18

కేరళ

82,970

19

లద్దాఖ్

818

20

లక్షదీవులు

746

21

మధ్యప్రదేశ్

1,31,679

22

మహారాష్ట

1,79,509

23

మణిపూర్

2,855

24

మేఘాలయ

3,249

25

మిజోరం

6,142

26

నాగాలాండ్

3,973

27

ఒడిశా

1,78,227

28

పుదుచ్చేరి

1,813

29

పంజాబ్

44,708

30

రాజస్థాన్

2,37,137

31

సిక్కిం

1,320

32

తమిళనాడు

82,039

33

తెలంగాణ

1,30,425

34

త్రిపుర

19,698

35

ఉత్తరప్రదేశ్

1,23,761

36

ఉత్తరాఖండ్

14,690

37

పశ్చిమ బెంగాల్

1,58,193

38

ఇతరములు

46,325

మొత్తం

23,55,979

 

కొత్తగా గత 24 గంటలలో కోలుకున్నవారిలో 77.84% మంది  7 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యారు. కేరళలో అత్యధికంగా ఒకే రోజులో 5,006 మంది కోలుకోగా, మహారాష్టలో 2,556 మంది, కర్నాటకలో

944 మంది కోలుకున్నారు.

 

గత 24 గంటలలో 11,666 మందికి కొత్తగా కోవిడ్ నిర్థారణ అయింది. వారిలో  81.96% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారు.  కొత్త కేసులలో కేరళ 5,659 మందితో మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్రలో 2,171 కేసులు,

తమిళనాడులో  512 కేసులు కొత్తగా నమోదయ్యాయి.   

గడిచిన 24 గంటలలో 123 మంది కోవిడ్ బాధితులు మరణించారు. వీరిలో 75.61% మంది ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు. మహారాష్ట్రలో అత్యధికంగా 32 మంది చనిపోగా, కేరళలో 20, పంజాబ్ లో

 10 మరణాలు నమోదయ్యాయి.

 

                                                                                                                                               

****



(Release ID: 1692911) Visitor Counter : 224