ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితులు

6 నెలల తరువాత 2 లక్షల లోపుకు తగ్గుదల

గత వారం రోజులుగా ప్రతి పది లక్షల్లో

రోజువారీ కేసుల్లో అత్యల్పం నమోదు

మొత్తం 6,74,835 మందికి కోవిడ్ టీకాలు

గత 24 గంటల్లో 3860 చోట్ల

2,20,786 మందికి కోవిడ్ టీకా

Posted On: 20 JAN 2021 12:34PM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భారతదేశం ఈ రోజు ఒక చెప్పుకోదగిన మైలురాయికి చేరింది. చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య 2 లక్షల కంటే దిగువకు జారి 1,97,201 కి చేరింది. ఇది మొత్తం కేసుల్లో కేవలం 1.86% మాత్రమే.  ఇది గడిచిన 207 రోజులలో అత్యల్పం.   చికిత్సలో ఉన్నవారి సంఖ్య గత జూన్ లో 1,97,387 గా నమోదైంది.  గడిచిన 24 గంటలలో  16,988 మంది కోలుకున్నారు.  దీనివలన చికిత్స పొందుతున్న వారి సంఖ్య నికరంగా 3327 తగ్గింది.  

 

చికిత్సపొందుతున్నవారిలో 72% మంది కేవలం ఐదు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. 

 

34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో చికిత్సలో ఉన్నవారు 10 వేలమందికి లోపే ఉన్నారు.   

 

               

భారత్ లో రోజూ వస్తున్న కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీనివలన చికిత్సపొందుతూ ఉనవారి సంఖ్య కూడా తగ్గుతోంది. 

 

ప్రపంచవ్యాప్తంగా గమనించినప్పుడు భారత్ లోనే రోజువారీ కేసులు తక్కువగా వస్తున్నాయి. ప్రతి పది లక్షల జనాభాలో భారత్ లో నమోదవుతున్న కేసులు వారంరోజులుగా బాగా తగ్గుతూ ఉన్నాయి.

 

జనవరి 20 న ఉదయం 7 గంటలవరకు మొత్తం 6,74,835 మందికి టీకాలు వేశారు. గత 24 గంటలలో 2,20,786 మందికి 3868 కేంద్రాలలో టీకాలు వేశారు. ఇప్పటిదాకా మొత్తం 11,720 ప్రదేశాలలో టీకాల కార్యక్రమం పూర్తయింది.  

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

టీకాల లబ్ధిదారులు

1

అండమాన్ నికోబార్ దీవులు

644

2

అంధ్రప్రదేశ్

65,597

3

అరుణాచల్ ప్రదేశ్

2,805

4

అస్సాం

7,585

5

బీహార్

47,395

6

చండీగఢ్

469

7

చత్తీస్ గఢ్

10,872

8

దాద్రా, నాగర్ హవేలి

125

9

డామన్, డయ్యూ

94

10

ఢిల్లీ

12,902

11

గోవా

426

12

గుజరాత్

21,832

13

హర్యానా

28,771

14

హిమాచల్ ప్రదేశ్

5,049

15

జమ్మూ కశ్మీర్

4,414

16

జార్ఖండ్

8,808

17

కర్నాటక

82,975

18

కేరళ

24,007

19

లద్దాఖ్

119

20

లక్షదీవులు

369

21

మధ్యప్రదేశ్

18,174

22

మహారాష్ట్ర

33,484

23

మణిపూర్

1111

24

మేఘాలయ

1037

25

మిజోరం

1091

26

నాగాలాండ్

2,360

27

ఒడిశా

60,797

28

పుదుచ్చేరి

759

29

పంజాబ్

5,567

30

రాజస్థాన్

32,379

31

సిక్కిం

358

32

తమిళనాడు

25,908

33

తెలంగాణ

69,405

34

త్రిపుర

3,734

35

ఉత్తరప్రదేశ్

22,644

36

ఉత్తరాఖండ్

6,119

37

పశ్చిమ బెంగాల్

43,559

38

ఇతరములు

21,091

 

ఇప్పటిదాకా మొత్తం కోటీ రెండు లక్షలకు పైగా   (10,245,741 మంది) కోలుకున్నారు. చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారి సంఖ్య ఇప్పుడు 1,00,48,540  కి చేరింది. దీంతో కోలుకున్నవారి శాతం 96.70%  కి చేరింది. ఈ తేడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.

కొత్తగా గత 24 గంటలలో కోలుకున్నవారిలో 80.43% మంది 10 రాష్ట్రాలకు చెందినవారు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా  4,516 మంది, కేరళలో  4,296 మంది, కర్నాటకలో 807 మంది కోలుకున్నారు.  

కొత్తగా కోవిడ్ బారిన పడినవారిలో 79.2% మంది ఏడు రాష్ట్రాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా 6,186 మంది, ఆ తరువాత మహారాష్ట్రలో 2,294  మంది పాజిటివ్ గా తేలారు.

 

రోజువారీ మరణాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటలలో162 మంది చనిపోయారు.   

 

గడిచిన 24 గంటలలో మరణించినవారిలో 71.6% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారే.  మహారాష్టలో అత్యధికంగా 50 మంది మరణించగా, కేరళలో 26 మంది, పశ్చిమ బెంగాల్ లో 11 మంది  చనిపోయారు.  

 

***(Release ID: 1690469) Visitor Counter : 152