ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొత్త కోవిడ్ కేసుల తగ్గుదలలో భారత్ 7 నెలల్లో సరికొత్త

రికార్డ్ ; గత 24 గంటల్లో10,064 కొత్త కేసులు

చికిత్సలో ఉన్నవారికి రెట్టింపుకంటే ఎక్కువమందికి టీకాలు

Posted On: 19 JAN 2021 11:29AM by PIB Hyderabad

కోవిడ్ వలన ఏర్పడిన అంతర్జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో భారతదేశం ఒక కీలకమైన మైలురాయిని దాటింది. రోజువారీ కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. గత 24 గంటలలో కేవలం 10,064  కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇంత తక్కువ సంఖ్యలో కొత్త కేసులు రావటం గడిచిన 7 నెలల్లొ ఇదే మొదటి సారి. నిరుడు జూన్ 12 న మాత్రమే 10,956 కేసులు నమోదయ్యాయి. అదే విధంగా దేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య 2 లక్షల స్థాయికి పడిపోయి ప్రస్తుతం 2,00,528 గా నమోదైంది.  దీంతో మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా కేవలం  1.90% కు పరిమితమైంది. 

 

ఒకవైపు రోజువారీ నమోదవుతున్న కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుతూ రావటం, మరోవైపు అన్ని రాష్ట్రాలలోనూ, కేంద్ర పాలిత ప్రాంతాలలోనూ టీకాలు తీసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ రావటం వలన టీకాలు తీసుకున్నవారి సంఖ్య పాజిటివ్ కేసులకు రెట్టింపు నమోదైంది.  గత 24 గంటలలో  3930 చోట్ల 2,23,669 మందికి టీకాలు వేయగా ఇప్పటివరకు మొత్తం 7860 ప్రదేశాలలో టీకాలు తీసుకున్నవారి మొత్తం సంఖ్య 4,54,049 కి చేరింది.  

రాష్ట్రాల వారీగా టీకాల లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి.:

వరుస సంఖ్య

రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం

టీకా లబ్ధిదారులు

1

అండమాన్ నికోబార్ దీవులు

442

2

 ఆంధ్రప్రదేశ్

46,680

3

అరుణాచల్ ప్రదేశ్

2,805

4

అస్సాం

5,542

5

బీహార్

33,389

6

చండీగఢ్

265

7

చత్తీస్ గఢ్

10,872

8

దాద్రా, నాగర్ హవేలి

80

9

డామన్, డయ్యూ

43

10

ఢిల్లీ

7,968

11

గోవా

426

12

గుజరాత్

10,787

13

హర్యానా

17,642

14

హిమాచల్ ప్రదేశ్

4,817

15

జమ్మూ, కశ్మీర్

3,375

16

జార్ఖండ్

6,059

17

కర్నాటక

66,392

18

కేరళ

15,477

19

లద్దాఖ్

119

20

లక్షదీవులు

201

21

మధ్య ప్రదేశ్

18,174

22

మహారాష్ట

18,582

23

మణిపూర్

978

24

మేఘాలయ

530

25

మిజోరం

554

26

నాగాలాండ్

1,436

27

ఒడిశా

46,506

28

పుదుచ్చేరి

554

29

పంజాబ్

3,318

30

రాజస్థాన్

23,546

31

సిక్కిం

120

32

తమిళనాడు

16,462

33

తెలంగాణ

17,408

34

త్రిపుర

1,736

35

ఉత్తరప్రదేశ్

22,644

36

ఉత్తరాఖండ్

4,237

37

పశ్చిమ బెంగాల్

29,866

38

ఇతరములు

14,017

  

వ్యాధి నిర్థారణ పరీక్షల మౌలిక సదుపాయాల పెంపుదల కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది. భారత్ లో వారపు సగటు పాజిటివ్ శాతం 1.97% కాగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.

13  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో వారపు పాజిటివ్ శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. 

దేశంలో గత 24 గంటలలో 140 కంటే తక్కువగా 137 మరణాలు నమోదయ్యాయి. ఇది గడిచిన 8 నెలల్లో తక్కువ స్థాయి. 

 

భారత్ లో కోలుకున్నవారి శాతం 96.66% దాటింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,02,28,753 కి చేరింది. ఈరోజుకు చికిత్సలో ఉన్న వారి సంఖ్య 2,08,012 కు చేరింది.  గత 24 గంటలలో 17,411 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కోలుకున్నవారిలో 80.41%  మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచే నమోదయ్యారు. కేరళలో అత్యధికంగా ఒక్క రోజులో 3,921 మంది కోలుకోగా,  మహారాష్ట్రలో 3,854  మంది, చత్తీస్ గఢ్ లో 1,301 మంది కోలుకున్నారు.  

 

కొత్త కేసులలో 71.76% మంది ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా   3,346 మంది, మహారాష్టలో 1,924 మంది, తమిళనాడులో 551 మంది పాజిటివ్ గా తేలారు.

గత 24 గంటలలో నమోదైన మరణాలలో 72.99% ఎనిమిది రాష్ట్రాలకు చెందినవే కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 35 మంది, కేరళలో 17 మంది, పశ్చిమ బెంగాల్ లో 10 మంది చనిపోయారు.

 

****



(Release ID: 1689975) Visitor Counter : 132