ప్రధాన మంత్రి కార్యాలయం

తిరువ‌ళ్లువ‌ర్ దినోత్స‌వం సంద‌ర్భంగా తిరువ‌ళ్లువ‌ర్‌కు శిర‌సు వంచి న‌మ‌స్క‌రించిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 15 JAN 2021 9:01AM by PIB Hyderabad

తిరువ‌ళ్లువ‌ర్ దినోత్స‌వం సంద‌ర్భంగా తిరువ‌ళ్లువ‌ర్‌కు శిర‌సువంచి అంజ‌లి ఘ‌టించిన‌ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర‌మోదీ.
ఇందుకు సంబంధించి ప్ర‌ధాన‌మంత్రి ఒక ట్వీట్ చేస్తూ,  నేను తిరువ‌ళ్లువ‌ర్ దినోత్స‌వం సంద‌ర్భంగా తిరువ‌ళ్లువ‌ర్‌కు శిర‌సు వంచి అంజ‌లి ఘ‌టిస్తున్నాను. ఆయ‌న ఆలోచ‌న‌లు, ఆయ‌న చేసిన కృషి ఆయ‌న‌కు గ‌ల అధ్భుత విజ్ఞానాన్ని ప్ర‌తిఫ‌లింప‌చేస్తాయి.త‌ర‌త‌రాలుగా ప్ర‌జ‌ల‌ను ఆయ‌న ఆలోచ‌న‌లు సానుకూల దృక్ప‌థంతో ప్ర‌భావితం చేశాయి. దేశవ్యాప్తంగా గ‌ల యువ‌త మ‌రింత మంది తిరుక్కుర‌ల్‌ను చ‌ద‌వాల‌ని నేను కోరుకుంటున్నాను... అని ప్ర‌ధాన‌మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***


(Release ID: 1688798) Visitor Counter : 214