ప్రధాన మంత్రి కార్యాలయం
పిఎమ్-ఎఫ్‌బివై కి 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో ఆ పథకం లబ్ధిదారులను అభినందించిన ప్రధాన మంత్రి
Posted On:
13 JAN 2021 11:37AM by PIB Hyderabad
‘పిఎమ్ ఫసల్ బీమా యోజన’ అయిదు సంవత్సరాలను పూర్తి చేసుకొన్న సందర్భం లో ఆ పథకం తాలూకు లబ్ధిదారులందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో తన అభిప్రాయాన్ని పొందుపరుస్తూ, ‘‘కష్టపడి పనిచేసే రైతులకు ప్రకృతి అస్థిరత్వం బారి నుంచి భద్రత ను కల్పించడానికి చేపట్టిన ఒక ముఖ్య కార్యక్రమమైన ‘పిఎమ్ ఫసల్ బీమా యోజన’ కు ఈ రోజు తో అయిదేళ్ళు పూర్తి అయ్యాయి. ఈ పథకం కోట్ల కొద్దీ రైతులకు రక్షణ ను పెంచి, నష్ట భయాన్ని తగ్గించి, ప్రయోజనాన్ని అందించింది. ఈ పథకం లబ్ధిదారులందరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
పిఎమ్ ఫసల్ బీమా యోజన రైతులకు అధిక ప్రయోజనాన్ని ఇచ్చేందుకు ఏ విధంగా పూచీ పడింది?
క్లెయిము ల పరిష్కారం లో పారదర్శకత్వాన్ని ఏ విధంగా ప్రోత్సహించడం జరిగింది?
వీటితో పాటు పిఎమ్-ఎఫ్‌బివై కి సంబంధించిన ఇతర అంశాలను - ‘నమో యాప్’ (NaMo App) లో గల ‘యువర్ వాయిస్ సెక్షన్’ (Your Voice Section) లో వినూత్న విషయాన్ని పొందుపరచడం ద్వారా- వివరించడమైంది.’’
***
(Release ID: 1688177)
Visitor Counter : 201
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam