ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మరో మైలురాయి చేరిన భారత్, కోటికిపైగా కోలుకున్న కోవిడ్ బాధితులు

చికిత్సలో ఉన్నవారికి 44 రెట్లు కోలుకున్నవారు

కోలుకున్నవారిలో 51% మంది 5 రాష్ట్రాలవారే

Posted On: 07 JAN 2021 12:11PM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భారతదేశం ఈరోజు మరో కీలకమైన మైలురాయి దాటింది. ఇప్పటివరకు కోవిడ్ బారినుంచి కోలుకొని బైటపడిన వారి సంఖ్య కోటి దాటి 1,00,16,859 కి చేరింది. భారత్ లో నమోదైన కోలుకున్నశాతం ప్రపంచంలోనే అత్యధికం.  గడిచిన 24 గంటలలో 19,587  మంది కోలుకున్నారు. జాతీయ స్థాయి కోలుకున్న శాతం మరింత తగ్గి 96.36% కు చేరింది. చికిత్సలో ఉన్నవారికి, కోలుకున్నవారికి మధ్య తేడా పెరుగుతూ 97,88,776 అయింది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001P24H.jpg

కోలుకున్నవారి సంఖ్య ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారికంటే 44 రెట్లు అధికం. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు ఈ రోజు 2,28,083 కాగా ఇవి మొత్తం ఇప్పటిదాకా వచ్చిన పాజిటివ్ కేసులలో  2.19% మాత్రమే.

 

.http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002C4B3.jpg

కోలుకున్నవారిలో 51% మంది కేవలం ఐదు రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యారు. ఆ రాష్ట్రాలు : మహారాష్ట, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ.  

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00397E4.jpg

జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 96.36% కు చేరుకుంది. అదే మార్గాన్ని అనుసరిస్తూ అన్ని రాష్ట్రాలలోనూ, కోలుకున్నవారి శాతం 90 దాటింది.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00427WL.jpg

కోలుకోవటంలో భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్థాయిలో ఉంది. ఎక్కువ కేసులున దేశాలు భారత్ కంటే తక్కువ శాతంలో కోలుకుంటున్నట్టు నమోదు చేసుకుంటున్నాయి.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0059JMR.jpg

పరీక్షలకు మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించటంతో భారతదేశంలో పాజిటివ్ శాతం కూడా తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల శాతం 3% లోపే కొనసాగుతోంది.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006A9HR.jpg

17 రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో జాతీయ స్థాయికంటే ఎక్కువ పాజిటివ్ శాతం నమోదైంది.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007VIAE.jpg

కొత్తగా కోలుకున్నవారిలో 79.08% మంది 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదయ్యారు. కేరళలో అత్యధికంగా ఒక రోజులో 5,110 మంది కోలుకోగా, మహారాష్ట్రలో  2,570 మంది కోలుకున్నారు. 

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008WRT5.jpg

కొత్తగా కోవిడ్ పాజిటివ్ గా నమోదైన కేసులలో 83.88% మంది పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు. కేరళలో అత్యధికంగా గత 24 గంటలలో  6,394 కేసులు రాగా , మహారాష్ట్రలో 4,382 మంది, చత్తీస్ గఢ్ లో 1,050 మంది కోవిడ్ బారిన పడ్దారు.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009GYMK.jpg

గడిచిన 24 గంటలలో 222 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వాటిలో 67.57% కేవలం ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక రోజులో 66 మరణాలు నమోదు కాగా కేరళలో 25 మంది, పశ్చిమబెంగాల్ లో 22 మంది చనిపోయారు.  .

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image010W5BL.jpg 

 

****



(Release ID: 1686777) Visitor Counter : 201