ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

తగ్గుదలబాటలోనే రోజువారీ కొత్త కేసులు, గత 24 గంటల్లో 16,504 నమోదు
ప్రపంచంలోనే అత్యధికంగా భారత్ లో కోలుకున్నవారు 99.5 లక్షల మంది

గత 11 రోజులలో జరిపిన కోవిడ్ పరీక్షలు కోటి

Posted On: 04 JAN 2021 10:50AM by PIB Hyderabad

సుస్థిరమైన చర్యలు తీసుకుంటూ సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్న ఫలితంగా భారతదేశంలో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటలలో కొత్తగా 16,504 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి.

ఆ విధంగా రోజూ కోవిడ్ కేసులు తగ్గుతూ రావటం వలన చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య కూడా తగ్గుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 2,43,953. ఇప్పటిదాకా నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో వీరిది 2.36%  మాత్రమే. గత 24 గంటలలో చికిత్సపొందుతున్నవారి సంఖ్య నికరంగా 3,267 తగ్గింది. 

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం కోవిడ్ పరీక్షలు 17 కోట్లు దాటి 17,56,35,761 కు చేరింది. గత 24 గంటలలో 7,35,978 శాంపిల్స్ పరీక్షించారు. దేశంలో పరీక్షలు జరపటానికి మౌలిక వసతులు గణనీయంగా పెరిగాయి. అందులో భాగంగానే ఇప్పుడు లాబ్ ల సంఖ్య  2,299 కి చేరింది. గత 11 రోజుల్లో దేశవ్యాప్తంగా కోటి కోవిడ్ పరీక్షలు జరిగాయి. పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ పాజిటివ్ కేసుల శాతం తగ్గుతూ ప్రస్తుతం 5.89% కు చేరింది. 

 

కోలుకుంటున్నవారు పెరుగుతూ ఉండటం, రోజూ వచ్చే కొత్త కేసులు తగ్గుదలబాటలో ఉండటం కారణంగా ఇప్పటిదాకా కోలుకున్నవారి మొత్తం సంఖ్య  కోటికి దగ్గరవుతోంది. ఈ రోజుకు అది 99,46,867 కు చేరింది. దీన్నిబట్టి చూస్తే కోలుకున్నవారి శాతం 96.19% అయింది. గడిచిన 24 గంటల్లో 19,557 మంది బాధితులు కోలుకున్నారు.  

కొత్తగా కోలుకున్న వారిలో 76.76% మంది కేవలం 10 రాష్టాలలోనే కేంద్రీకృతమయ్యారు. కేరళలో ఒక్కరోజులో అత్యధికంగా 4,668 మంది కోలుకోగా, మహారాష్ట్రలో  2,064 మంది, పశ్చిమ బెంగాల్ లో  1,432 మంది కోలుకున్నారు.

తాజాగా నిర్థారణ జరిగిన పాజిటివ్ కేసులలో 83.90% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారు. అందులో కేరళలో అత్యధికంగా 4,600 కేసులు రాగా మహారాష్ట్రలో 3,282, పశ్చిమ బెంగాల్ లో 896 వచ్చాయి.

గత 24 గంటలలో 214 మంది కోవిడ్ బాధితులు మరణించారు. అందులో పది రాష్ట్రాలకు చెందినవారే 77.57% మంది ఉన్నారు. నిన్నటి మరణాలలో 16.35% (35 మరణాలు) కేవలం మహారాష్ట్ర నుంచే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో 26 మంది, కేరళలో 25 మంది చనిపోయారు.  

****(Release ID: 1685983) Visitor Counter : 83