ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన - ప్రధానమంత్రి

Posted On: 02 JAN 2021 8:05PM by PIB Hyderabad

శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా, ఆయనకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఘనంగా నివాళులర్పించారు. 

ఈ మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, సామాజిక మాధ్యమం ద్వారా, ఒక ట్వీట్ చేస్తూ, "సమాజ సేవ, సామాజిక న్యాయం, సాంస్కృతిక పునరుజ్జీవనానికి మార్గదర్శక సహకారం అందించినందుకు, భవిష్యత్ తరాలు, శ్రీ మన్నాతు పద్మనాభన్ గారికి కృతజ్ఞతతో ఉంటారు. ఆయన జీవితం పూర్తిగా ఇతరుల శ్రేయస్సు కోసమే అంకితం చేయబడింది.  పద్మనాభన్ గారి జయంతి సందర్భంగా, ఆయనకు నా వినయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను." అని పేర్కొన్నారు.

*****(Release ID: 1685718) Visitor Counter : 116