సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

51వ అంతర్జాతీయ భారత చలన చిత్ర ఉత్సవాల (ఐఎఫ్ఎఫ్ఐ)కు మీడియా నమోదు

ఆన్ లైన్ లో పాల్గొడానికి ప్రోత్సహం

Posted On: 30 DEC 2020 11:13AM by PIB Hyderabad

గోవాలో 2021 జనవరి 16 నుంచి 24వ తేదీవరకు జరగనున్న51 అంతర్జాతీయ భారత చలన చిత్ర ఉత్సవాలకు (ఐఎఫ్ఎఫ్ఐ) మీడియా ప్రతినిధుల నమోదు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. కొవిడ్-19ను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్సవాలను మిశ్రమ పద్దతిలో నిర్వహించనున్నారు. ​కొవిడ్ -19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఉత్సవాలకు గతంలో కంటే తక్కువ మంది మీడియా ప్రతినిధులను అనుమతించాలని నిర్ణయించారు.

ఉత్సవాలకు ప్రత్యక్షంగా హాజరై వార్తలను సేకరించవలసి ఉన్న మీడియా ప్రతినిధులు తమ వివరాలను https://my.iffigoa.org/extranet/media/ లోనమోదు చేసుకోవలసి వుంటుంది. 2020 జనవరి ఒకటవ తేదీనాటికి 21 సంవత్సరాల వయస్సు కలిగి, ఐఎఫ్ఎఫ్ఐ లాంటి అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల వార్తా సేకరణలో కనీసం మూడు సంవత్సరాలు అనుభవం ఉన్న ప్రతినిధులు నమోదు చేసుకోవచ్చును. పిఐబి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్

ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం మీడియా అక్రిడిటేషన్ మంజూరు చేయబడుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2021 జనవరి 10వ తేదీతో ముగుస్తుంది.

*****

ఆన్ లైన్ లో పాల్గొనే అవకాశం:

ఐఎఫ్ఎఫ్ఐకి సంబందించిన అన్ని పత్రికా సమావేశాలను పిఐబి తన యు ట్యూబ్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. youtube.com/pibindia ప్రసారం అయ్యే ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ప్రశ్నలను అడగడానికి అవకాశం ఉంటుంది.

ఆన్ లైన్ లో పాల్గొనడానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.

***

 


(Release ID: 1684616) Visitor Counter : 170