ప్రధాన మంత్రి కార్యాలయం
వ్యవస్థలు మరియు ప్రక్రియల సమన్వయం ద్వారా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ ను గురించి వివరించిన ప్రధాన మంత్రి
దేశవ్యాప్తంగా ఏకీకృత సేవల ద్వారా ‘కనీస ప్రభుత్వం-గరిష్ఠ పాలన’ ఒక ఆకృతిని పొందుతోంది
Posted On:
28 DEC 2020 1:25PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొట్టమొదటి డ్రైవర్ రహిత మెట్రో కార్యకలాపాలను ఈ రోజున ప్రారంభిస్తూనే, ఢిల్లీ మెట్రో తాలూకు ఎయర్‌పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్ కు నేశనల్ కామన్ మొబిలిటీ కార్డు సేవల విస్తరణకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ కార్డును కిందటి ఏడాదిలో అహమదాబాద్ లో మొదలుపెట్టడమైంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో శ్రీ మోదీ తన ‘కనీస ప్రభుత్వం మరియు గరిష్ఠ పాలన’ సూత్రం తాలూకు ఒక అత్యంత ముఖ్యమైన దృష్టి కోణం గురించి సుదీర్ఘంగా విడమరచి చెప్పారు. దీనిలో ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ దార్శనికతను బలపరచడానికి గాను వ్యవస్థలు, ప్రక్రియల కలబోత ఇమిడి ఉంది.
ఆధునికీకరణ కోసం ఒకే రకమైన సదుపాయాలను, ప్రమాణాలను అందించడం అనేది ఎంతో ముఖ్యమైన విషయమని ప్రధాన మంత్రి అన్నారు. దేశమంతటా కామన్ మొబిలిటీ కార్డు అనేది ఈ దిశలో ఒక ప్రధానమైన అడుగు. ఈ ఒకే కార్డు ప్రయాణికులకు వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ విధమైన సార్వజనిక రవాణా మాధ్యమాన్ని ఎంచుకొన్నా ఏకీకృతమైన అందుబాటును ప్రసాదిస్తుంది.
-PMO India
@PMOIndia
आज तमाम व्यवस्थाओं को एकीकृत करके देश की ताकत को बढ़ाया जा रहा है, एक भारत-श्रेष्ठ भारत को मजबूत किया जा रहा है।
वन नेशन, वन मोबिलिटी कार्ड की तरह ही बीते वर्षों में हमारी सरकार ने देश की व्यवस्थाओं का एकीकरण करने के लिए अनेक काम किए हैं: PM
కామన్ మొబిలిటీ కార్డు ఉదాహరణ ను గురించి ప్రధాన మంత్రి మరింత సవివరంగా మాట్లాడుతూ, ‘జీవించడంలో సౌలభ్యాన్ని’ మెరుగుపరచడానికి వ్యవస్థలు, ప్రక్రియల సమన్వయ విధానాన్ని గురించి వివరించారు. ఆ కోవకు చెందిన వ్యవస్థల సమన్వయం ద్వారా దేశ బలాన్ని మరింత ఎక్కువగాను, మరింత ప్రభావవంతమైన పద్ధతిలోను వినియోగించుకోవడం జరుగుతోంది. ’’ ‘ఒక దేశం, ఒక మొబిలిటీ కార్డు’ మాదిరిగా, మా ప్రభుత్వం దేశం లోని వ్యవస్థల ఏకీకరణ కోసం గత కొన్నేళ్ళలో ఎన్నో పనులను చేపట్టిందని’’ శ్రీ మోదీ అన్నారు.
-PMO India
@PMOIndia
आधुनिकीकरण के लिए एक ही तरह के मानक और सुविधाएं उपलब्ध कराना बहुत जरूरी है।
राष्ट्रीय स्तर पर कॉमन मोबिलिटी कार्ड इसी दिशा में एक बड़ा कदम है।
आप जहां कहीं से भी यात्रा करें, आप जिस भी public transport से यात्रा करें, ये एक कार्ड आपको integrated access देगा: PM
‘వన్ నేశన్, వన్ ఫాస్ట్ ట్యాగ్’ అనేది దేశం లోని హైవేల పైన నిరంతరాయ ప్రయాణానికి బాట పరిచింది. ఇది ప్రయాణికులకు ట్రాఫిక్ జామ్, జాప్యాల బారి నుండి రక్షణను కల్పించింది. ‘వన్ నేశన్, వన్ టాక్స్’.. జిఎస్‌టి పన్నుల విధానంలో ఇబ్బందులకు స్వస్తి పలికింది. అంతేకాకుండా, పరోక్ష పన్ను వ్యవస్థలో ఏకరూపతను తీసుకువచ్చింది. ఇక ‘ఒకే దేశం, ఒకే పవర్ గ్రిడ్’ అనేది దేశం లోని ప్రతి ప్రాంతంలోను విద్యుత్తు లభ్యత కు పూచీ పడింది. విద్యుత్తు పరంగా ఎదురయ్యే నష్టాన్ని తగ్గించడం జరిగింది
-PMO India
@PMOIndia
वन नेशन, वन Fastag से देशभर के हाइवे पर ट्रैवल सीमलेस हुआ है।
वन नेशन, वन टैक्स यानि GST से देशभर में टैक्स का जाल समाप्त हुआ है ।
वन नेशन, वन पावर ग्रिड, से देश के हर हिस्से में पर्याप्त और निरंतर बिजली की उपलब्धता सुनिश्चित हो रही है। बिजली का नुकसान कम हुआ है: PM
‘వన్ నేశన్, వన్ గ్యాస్ గ్రిడ్’ తో ఇంతకుముందు గ్యాస్ ఆధారిత జీవనం, ఆర్థిక వ్యవస్థ ఒక కల లాగా ఉంటూ వచ్చిన ప్రాంతాలకు హామీ లభించినట్లు అయింది. ‘వన్ నేశన్, వన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్’.. ఆయుష్మాన్ భారత్ ద్వారా భారతదేశం లోని లక్షల కొద్దీ ప్రజలు దేశంలో ఎక్కడైనా సరే ప్రయోజనాలను పొందుతున్నారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వళ్ళే పౌరులు కొత్త రేషన్ కార్డులను తయారు చేయించుకోవడంలో ఇబ్బందుల బారి నుంచి ‘వన్ నేశన్, వన్ రేషన్ కార్డు’ ద్వారా స్వేచ్ఛను పొందారు. అదే విధంగా దేశం కొత్త వ్యావసాయిక చట్టాలు, తమ ఇ-నామ్ (e-NAM) ఏర్పాట్ల ద్వారా ‘ఒకే దేశం, ఒకే వ్యావసాయక విపణి’ దిశలో ముందుకు పోతోంది.
- PMO India
@PMOIndia
वन नेशन, वन गैस ग्रिड से, उन हिस्सों की Seamless Gas Connectivity सुनिश्चित हो रही है, जहां गैस आधारित जीवन और अर्थव्यवस्था पहले सपना हुआ करता था।
वन नेशन, वन हेल्थ एश्योरेंस स्कीम यानि आयुष्मान भारत से देश के करोड़ों लोग पूरे देश में कहीं भी इसका लाभ ले रहे हैं: PM
PMO India
@PMOIndia
वन नेशन, वन राशनकार्ड, से एक स्थान से दूसरे स्थान जाने वाले नागरिकों को नया राशनकार्ड बनाने के चक्करों से मुक्ति मिली है।
इसी तरह नए कृषि सुधारों और e-NAM जैसी व्यवस्थाओं से वन नेशन, वन एग्रीकल्चर मार्केट की दिशा में देश आगे बढ़ रहा है: PM
***
(Release ID: 1684117)
Visitor Counter : 185
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam