ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు 6 నెలల తరువాత 18,732 కి తగ్గుదల

చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 170 రోజుల తరువాత 2.78 లక్షలకు తగ్గుదల

Posted On: 27 DEC 2020 10:53AM by PIB Hyderabad

ప్రపంచాన్ని సంక్షోభం లోకి నెట్టిన మహమ్మారి మీద భారత్ జరుపుతున్న పోరాటం అనేక కీలకమైన మైలురాళ్ళు దాటుతూ ముందుకు వెళుతోంది. అందువల్లనే రోజువారీ కొత్త కేసులు 6 నలల అనంతరం 19 వేల లోపుకు పడిపోయాయి.  గత 24 గంటలలో కొత్తగా నిర్థారణ జరిగిన కోవిడ్ పాజిటివ్ కేసులు 18,732 . ఈ ఏడాది జులై 1న 18,653 కేసులు నమోదై ఉండటం గమనార్హం.  .

 

WhatsApp Image 2020-12-27 at 10.00.34 AM.jpeg

దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ నేడు 2,78,690 కు చేరింది. ఇది గత 170 రోజులలో అత్యల్పం.   ఈ ఏడాది జులై 10 న  2,76,682 మందిగా నమోదు కావటం తరువాత ఇప్పుడు ఆ స్థాయిలో ఉంది. ఇలా  దేసమంతటా ఈ ధోరణి కొనసాగటం వలన  మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్న కేసుల వాటా 2.74% కు పడిపోయింది. గత 24 గంటలలో 21,430 మంది కోవిడ్ నుంచి కోలుకొని బైటపడటంతో నికరంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య  2,977 మేర తగ్గింది.

 WhatsApp Image 2020-12-27 at 10.08.20 AM.jpeg

ఇప్పటివరకూ కోలుకున్న వారి మొత్తం సంఖ్య 97,61,538. కోలుకున్నవారికీ, ఇంకా చికిత్సలో ఉన్నవారికీ మధ్య అంతరం పెరుగుతూ 95 లక్షలకు దగ్గరై 94,82,848 కు చేరుకుంది. మొత్తంగా చూసినప్పుడు కోలుకున్న వారి శాతం 95.82% కు పెరిగింది. కొత్తకేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటం వల్లనే  ఈ తేడా పెరుగుతూ వస్తోంది.

గత 24 గంలలో కోలుకున్నవారిలో 72.37% మంది 10 రాష్ట్రాలకు చెందినవారే. అందులో కేరళలో అత్యధికంగా 3,782 మంది కోలుకోగా, ఆ తరువాత స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (1,861), చత్తీస్ గఢ్  (1,764) ఉన్నాయి.  

WhatsApp Image 2020-12-27 at 9.54.24 AM.jpeg

కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ జరిగిన కేసులలో 76.52% పది రాష్ట్రాల్లో కేంద్రీకృతం అయ్యాయి. కేరళలో అత్యధికంగా  3,527 కొత్త కేసులు రాగా 2,854 కొత్త కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది.

 

WhatsApp Image 2020-12-27 at 9.51.45 AM.jpeg

గత 24 గంటలలో 279 మరణాలు నమోదయ్యాయి. అందులో  75.27%  మరణాలు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోనే కేంద్రీకృతమయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 60 మంది చనిపోగా, ఆ తరువాత స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (33), ఢిల్లీ (23) ఉన్నాయి.   

WhatsApp Image 2020-12-27 at 9.53.14 AM.jpeg

***



(Release ID: 1683984) Visitor Counter : 161