ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు

2.81 లక్షలు, మొత్తం కేసుల్లో 2.78% మాత్రమే

మొత్తం కోలుకున్న కోవిడ్ బాధితులు 97 లక్షల పైనే

Posted On: 25 DEC 2020 11:35AM by PIB Hyderabad

దేశంలో కోవిడ్ తో చికిత్స పొందుతున్నవాళ్ల సంఖ్య వేగంగా తగ్గుతూ మొత్తం కేసుల్లో 3% లోపుకు తగ్గి 2.78% కు చేరింది. రోజూ వస్తున్న కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్య పెరగటం, కారణంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య బాగా తగ్గుతూ వస్తున్నది.  ప్రస్తుతం బాధితుల సంఖ్య 2,81,919 కు చేరింది.

 

గత 28 రోజులుగా కనిపిస్తున్న ధోరణినే కొనసాగిస్తూ గత 24 గంటలలో కూడా రోజువారీ కొత్త కేసులకంటే  కోలుకున్నవారే ఎక్కువగా నమోదయ్యారు.  కొత్తగా  23,067 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ కాగా అదే సమయంలో   24,661 మంది కోలుకొని బైటపడ్డారు. దీంతో నికరంగా చికిత్సలో ఉన్నవాళ్ల సంఖ్య గత 24 గంటలలోనే 1,930 తగ్గింది.

ప్రపంచ వ్యాప్తంగా సగటున ప్రతి పది లక్షలమందిలో 9931 మంది కోవిడ్ బారిన పడగా భారతదేశంలో మాత్రం ప్రతి పది లక్షల్లో  7352 మందికి కోవిడ్ సోకింది. ఇది పశ్చిమార్థ గోళంలోని అనేక దేశాలకంటే తక్కువ.

కోలుకోవటం పెరగటంతో ఇప్పటివరలు కోలుకున్నవారి శాతం 95.77% కు చేరింది. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 97 లక్షలు దాటి 97,17,834 గా నమోదైంది.  కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా  బాగా పెరుగుతూ ప్రస్తుతం  94,35,915 కి చేరుకుంది. కొత్తగా గత 24 గంటలలో కోలుకున్నవారిలో 75.86% మందికేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా 4801 మంది, ఆ తరువాత  మహారాష్ట్రలో అత్యధికంగా 3,171 మంది, పశ్చిమ బెంగాల్ లో  2,054 మంది కోలుకున్నారు.

 

కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ అయిన కేసుల్లో 77.38% పది రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోనే నమోదు కాగా,  కేరళలో అత్యధికంగా 5,177 మందికి, ఆ తరువాత మహారాష్ట్రలో  3,580 మందికి, పశ్చిమ బెంగాల్ లో 1,590 మందికి కరోనా సోకింది.

 

గడిచిన 24 గంటలలో 336 మంది కోవిడ్ తో చనిపోయారు. వీరిలో  81.55% మంది పది రాష్ట్రాలవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్కరోజులోనే 26.48% (89) మరణాలు నమోదు కాగా  ఢిల్లీలో 37, పశ్చిమ బెంగాల్ లో . 32 మరణాలు నమోదయ్యాయి.

ప్రపంచ గణాంకాలతో పోల్చుకున్నప్పుడు కోవిడ్ మరణాలు భారత్ లో చాలా తక్కువగా ఉన్నాయి. ప్రతి పది లక్షల జనాభాలో ప్రపంచ స్థాయిలో 106 మంది మరణించగా భారతదేశంలో అతి తక్కువగా 1.45% మాత్రమే.

***


(Release ID: 1683574) Visitor Counter : 166