ప్రధాన మంత్రి కార్యాలయం

ఐఐఎస్ఎఫ్-2020 లో ప్రారంభోపన్యాసాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి


భారతదేశం దగ్గర ప్రపంచ శ్రేణి విజ్ఞాన శాస్త్ర సంబంధిత పరిష్కార మార్గాలను కనుగొనడానికి సమాచార రాశి, జనాభాపరమైన సానుకూలత, డిమాండ్, ప్రజాస్వామ్య వ్యవస్థ లు ఉన్నాయి: ప్రధాన మంత్రి


దేశాభివృద్ధి కోసం విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధిపరచవలసిన అవసరం ఉందని స్పష్టీకరణ

భారతదేశ ప్రతిభావంతులపైన, భారతదేశంలో నూతన ఆవిష్కరణలు చేయడంపైన పెట్టుబడులు పెట్టాలంటూ ప్రపంచ సముదాయానికి ఆయన విజ్ఞప్తి చేశారు


Posted On: 22 DEC 2020 5:51PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) 2020 లో ప్రారంభోపన్యాసాన్ని ఇచ్చారు. కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

ఈ సందర్భం లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారతదేశానికి విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, నూతన ఆవిష్కరణలలో సంపన్న వారసత్వమంటూ ఒకటి ఉందన్నారు.  మన శాస్త్రవేత్తలు కొత్త మార్గాన్ని ఆవిష్కరించేటటువంటి పరిశోధనలను చేశారు; మన సాంకేతిక విజ్ఞాన పరిశ్రమ ప్రపంచ సమస్యలను పరిష్కరించడం లో ముందుభాగాన నిలిచింది.  అయితే, భారతదేశం ఇంతకు మించిన పనులను కూడా చేయాలని కోరుకొంటోంది.  మనం మన గతానికేసి గర్వంగా చూసుకొంటున్నాం, కానీ మనం మరింత మెరుగైన భవిష్యత్తు ను కోరుకొంటున్నాం అని శ్రీ మోదీ అన్నారు. 

విజ్ఞాన శాస్త్ర సంబంధిత పాండిత్యం లో అత్యంత విశ్వసనీయమైన కేంద్రం గా భారతదేశాన్ని తయారు చేయడమే మన సకల ప్రయత్నాల లక్ష్యం అని ప్రధాన మంత్రి అన్నారు.  అదే సమయం లో, మనం మన విజ్ఞాన శాస్త్ర సంబంధ సముదాయం ప్రపంచం లోని అత్యుత్తమ ప్రతిభ తో తన జ్ఞానాన్ని పంచుకొంటూ, ఎదగాలి అని కూడా కోరుకొంటున్నాం అని ఆయన అన్నారు.  దీనిని సాధించడానికి  తీసుకున్న చర్యలలో ఒక చర్యే హ్యాకథన్ ల నిర్వహణ, హ్యాకథన్ లలో పాలుపంచుకోవడమూ, తద్వారా భారతీయ శాస్త్రవేత్తలకు తత్సంబంధిత అవకాశాన్ని, జ్ఞానానుభవాన్ని అందించడమూను అని ఆయన వివరించారు. 

నూతన జాతీయ విద్య విధానం చిన్న వయస్సు నుంచే విజ్ఞాన శాస్త్ర సంబంధ స్వభావాన్ని వర్ధిల్లజేయడం లో సహాయకారి కానుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  ప్రస్తుతం వ్యయాల నుంచి ఫలితాలకు, పాఠ్య పుస్తకాల నుంచి పరిశోధన కు, అలాగే అప్లికేషన్ కు శ్రద్ధ బదిలీ అయింది అని ఆయన చెప్పారు. ఈ విధానం అత్యున్నత ప్రతిభ కలిగిన ఉపాధ్యాయుల సమూహాన్ని తయారు చేయడాన్ని ప్రోత్సహిస్తుందని, ఈ దృష్టి కోణం వర్ధమాన శాస్త్రవేత్తలకు తోడ్పడుతుందని ఆయన చెప్పారు.  దీనికి అటల్ ఇన్నోవేషన్ మిషన్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లు పూరకంగా ఉంటున్నాయి అని శ్రీ మోదీ చెప్పారు.

నాణ్యమైన పరిశోధనల కోసం,  ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ రిసెర్చ్ ఫెలోస్ స్కీము ను నడుపుతున్నదని, దేశం లో సర్వోన్నత ప్రతిభావంతుల ను ప్రతిభ పరంగా, ఆసక్తి పరంగా పరిశోధనలను చేపట్టేటట్టు ప్రోత్సహించడం కోసం ఇలా చేయడం జరుగుతోందన్నారు.  ఈ పథకం అగ్రగామి సంస్థలలో శాస్త్రవేత్తలకు సహాయకారిగా ఉంది అని ప్రధాన మంత్రి తెలిపారు. 

విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం తాలూకు లాభాలను అందరికీ అందుబాటు లోకి తీసుకు రావడానికి గల ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. కొరత కు, ప్రభావానికి మధ్య ఉన్న అంతరానికి విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం సేతువు వలె నిలుస్తున్నాయని ఆయన అన్నారు.  ఇది నిరుపేదలను ప్రభుత్వం తో జోడిస్తున్నదని ఆయన చెప్పారు.  డిజిటల్ పురోగమనాల వల్ల భారతదేశం పరిణామ కేంద్రం గాను, గ్లోబల్ హై-టెక్ పవర్ తాలూకు విప్లవ కేంద్రం గాను మారుతోందని ప్రధాన మంత్రి అన్నారు. 

ఈ తరహా ప్రపంచ శ్రేణి విద్య, ఆరోగ్యం, సంధానం, గ్రామీణ ప్రాంతాలకు పరిష్కార మార్గాలను సాధించడానికి నేటి భారతదేశం లో సమాచార రాశి, జనాభా పరమైన సానుకూలత, డిమాండు లు ఉన్నాయని ప్రధాన మంత్రి చెప్పారు.  అన్నిటి ని మించి, భారతదేశం ఈ అన్ని విషయాలను సమతౌల్యం చేసుకుంటూ, వీటిని పరిరక్షించడానికి ప్రజాస్వామ్య వ్యవస్థ ను కలిగి ఉంది అని ఆయన అన్నారు. ఈ కారణంగానే ప్రపంచం భారతదేశాన్ని విశ్వసిస్తోందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. 

మన దేశంలో నీటిఎద్దడి, కాలుష్యం, నేల నాణ్యత, ఆహార భద్రత ల వంటి అనేక సవాళ్లు ఉన్నాయని, వీటికి ఆధునిక విజ్ఞాన శాస్త్రం వద్ద ఒక పరిష్కార మార్గం  ఉందని ప్రధాన మంత్రి అన్నారు.  మన సముద్రం లో నీటి ని, శక్తి ని, ఆహార వనరులను త్వరిత గతి న అన్వేషించడం లో విజ్ఞాన శాస్త్రానికి కూడా ఒక ప్రధానమైన పాత్ర ఉంది అని ఆయన అన్నారు.  దీనికి గాను భారతదేశం డీప్ ఓషన్ మిషన్ ను నిర్వహిస్తోందని, దీనిలో భారతదేశం సఫలత ను సాధించిందని ఆయన చెప్పారు.  విజ్ఞాన శాస్త్రం లో నూతన ఆవిష్కరణల లబ్ధి ఒక రకంగా చూస్తే వాణిజ్యం లో, వ్యాపారం లో కూడా చోటు చేసుకుంటుంది అని ఆయన అన్నారు. 

మన యువత ను, ప్రైవేటు రంగాన్ని నింగిని తాకడానికి ఒక్కదానికే కాకుండా రోదసి లో మూల మూలలకు చొచ్చుకొని పోయేటట్టు ప్రోత్సహించడానికి అంతరిక్ష రంగం లో ప్రస్తుతం సంస్కరణలను చేపట్టినట్లు ప్రధాన మంత్రి తెలిపారు.  కొత్త గా ప్రారంభించిన ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం పథకం విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞాన రంగాల పైన కూడా శ్రద్ధ తీసుకొంటుంది అని ఆయన చెప్పారు.  ఆ తరహా చర్యలు విజ్ఞాన శాస్త్ర సంబంధిత సముదాయానికి ఒక ఉత్తేజాన్ని ఇవ్వగలుగుతాయని, విజ్ఞాన శాస్త్రానికి, సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన ఈకో సిస్టమ్ మరింత మెరుగై నూతన ఆవిష్కరణలకు మరిన్ని వనరులను ఉత్పత్తి చేస్తుందని, విజ్ఞాన శాస్త్రానికి, పరిశ్రమకు మధ్య ఒక కొత్త భాగస్వామ్య సంస్కృతి ని రూపొందిస్తుందని ఆయన చెప్పారు.  ఈ ఉత్సవం విజ్ఞాన శాస్త్రాని కి, పరిశోధన కు మధ్య సమన్వయం, సహకారాల స్ఫూర్తి కి కొత్త కోణాలను సంతరిస్తుందని, నూతనంగా ఏర్పడే సమన్వయాలు, కొత్త అవకాశాలకు దారి తీస్తాయని ఆయన అభిలషించారు. 

విజ్ఞాన శాస్త్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు బహుశా కోవిడ్ మహమ్మారి కి ఒక టీకామందు ను రూపొందించడమే కావచ్చు అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.  అయితే విజ్ఞాన శాస్త్రం ఎదుర్కొనే అతి ప్రధానమైన దీర్ఘకాలిక సవాలు ఉన్నత శ్రేణి యువజనులను ఆకర్షించడం తో పాటు వారిని అట్టిపెట్టుకోవడం కూడాను అని ఆయన అన్నారు.  సాంకేతిక విజ్ఞానం, ఇంజినీరింగ్ డమేన్ ల పట్ల యువత ఆకర్షితులు కావడం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేస్తూ, దేశాభివృద్ధి కోసం విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధిపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.  ప్రస్తుతం విజ్ఞాన శాస్త్రం గా దేనినైతే వ్యవహరిస్తున్నారో అది రేపటి కి సాంకేతిక విజ్ఞానం గా రూపుదాల్చుతుంది, అటు తరువాత అది ఒక ఇంజినీరింగ్ సొల్యుషన్ గా లెక్క కు వస్తుందని కూడా ఆయన చెప్పారు.  మన విజ్ఞాన శాస్త్ర రంగం పరిధిలోకి చక్కటి ప్రతిభ కలిగిన వర్గాలను ఆకర్షించడానికి గాను ప్రభుత్వం వివిధ స్థాయులలో ఉపకార వేతనాలను ప్రకటించిందని ఆయన అన్నారు.  అయితే ఇది విజ్ఞాన శాస్త్ర సంబంధిత సముదాయం లోపల సైతం ఒక పెద్ద వ్యాప్తి ని కోరుతుంది అని ఆయన తెలిపారు.  చంద్రయాన్ మిషన్ పట్ల రేకెత్తిన ఉత్సాహం యువజనుల వైపు నుంచి వ్యక్తం అయిన ఆసక్తి పరంగా చూస్తే ఒక గొప్ప ఆరంభిక స్థానం అని చెప్పవచ్చును అని ఆయన అన్నారు. 

భారతదేశానికి చెందిన ప్రతిభ పైన, అలాగే భారతదేశం లో నూతన ఆవిష్కరణల పైన పెట్టుబడి పెట్టాలంటూ ప్రపంచ సముదాయానికి ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.  భారతదేశం లో అత్యంత కుశాగ్ర బుద్ధులు ఉన్నారని, అంతేకాక భారతదేశం స్వేచ్ఛాయుతమైన, పారదర్శకత్వంతో కూడిన సంస్కృతి ని చూసుకొని గర్విస్తోందని సభికులతో ఆయన చెప్పారు.  ఇక్కడ పరిశోధనల సంబంధిత వాతావరణాన్ని మెరుగుపరచడానికి ఎలాంటి సవాలును అయినా గాని పరిష్కరించడానికి భారత ప్రభుత్వం సర్వ సన్నద్ధం గా ఉంటుందన్నారు.  విజ్ఞాన శాస్త్రం ఒక వ్యక్తి లోపలి శ్రేష్ఠత్వాన్ని బయటకు తీసుకువస్తుందని, భేదం తాలూకు శక్తి ని ఉపయోగించుకొంటుందని ఆయన అన్నారు.  కరోనా పై పోరాటం లో భారతదేశాన్ని ముందు భాగంలో నిలబెడుతున్నందుకు, అది కూడాను ఒక ఉత్తమమైన స్థానం లో నిలబెడుతున్నందుకు మన శాస్త్రవేత్తలను ఆయన ప్రశంసించారు. 


***


(Release ID: 1682794) Visitor Counter : 273