ప్రధాన మంత్రి కార్యాలయం

ఈ నెల 24 న  విశ్వ భారతి విశ్వ విద్యాలయం శతాబ్ధి ఉత్సవాల లో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

Posted On: 22 DEC 2020 2:58PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 24 న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శాంతినికేతన్ లోని విశ్వ భారతి విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పశ్చిమ బంగాల్ గవర్నర్, కేంద్ర విద్యా మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

విశ్వ భారతి ని గురించి

గురుదేవులు శ్రీ రవీంద్రనాధ్ టాగోర్ 1921 వ సంవత్సరం లో స్థాపించిన విశ్వభారతి దేశం లో అతి ప్రాచీనమైన కేంద్రీయ విశ్వవిద్యాలయం గా కూడా పేరు తెచ్చుకొంది. 1951 వ సంవత్సరం మే నెల లో విశ్వ భారతి ని ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం గా ఉంటుందని, అంతేకాకుండా ‘‘జాతీయ ప్రాముఖ్యం కలిగిన ఒక సంస్థ’’గా కూడా ఉంటుందని పార్లమెంటు లో చట్టాన్ని చేయడం ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ విశ్వ విద్యాలయం గురుదేవులు శ్రీ టాగూర్ రూపకల్పన చేసిన శిక్షణ ప్రణాళిక ను అవలంబించింది.  అయితే ఆ తరువాతి కాలం లో ఇతర చోట్ల రూపకల్పన జరిగిన ఆధునిక విశ్వవిద్యాలయాలు పాటిస్తున్న పద్ధతి ని ఈ విశ్వవిద్యాలయం తాను కూడా పాటించసాగింది. ప్రధాన మంత్రి ఈ విశ్వవిద్యాలయానికి కులపతి గా ఉన్నారు.



 

***



(Release ID: 1682689) Visitor Counter : 125