ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో చికిత్స పొందితున్న కోవిడ్ బాధితులు 163 రోజుల దిగువన 3 లక్షలకు చేరిక

మొత్తం కేసుల్లో 3 శాతానికి తగ్గిన చికిత్సపొందుతున్న వారు

173 రోజుల్లో అతు తక్కువగా కొత్త కేసులు 20 వేలలోపు

Posted On: 22 DEC 2020 11:54AM by PIB Hyderabad

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్ మహమ్మారిమీద పోరులో భారత్ అనేక మైలురాళ్ళు దాటుతూ వస్తోంది. చికిత్సలో ఉన్నవారి సంఖ్య 3 లక్షలకంటే దిగువకు పడిపోయి నేడు 2,92,518 కు చేరింది. దీంతో మొత్తం పాజిటివ్ కెసులలో ఇంక చికిత్సపొందుతున్నవారి వాటా 3% నుంచి 2.9శాతానికి పడిపోయింది.   ఇది గడిచిన 163  రోజుల్లో అత్యల్పం. ప్రస్తుతం చికిత్సలో ఉన్న మొత్తం బాధితుల సంఖ్య 2,92,258 కాగా ఇంత తక్కువ ఉండతం 2020 జులై 12 న మాత్రమే జరిగింది. చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా గత 24 గంటలలో 11,121 తగ్గింది.   

 

రోజువారీ కొత్త కేసులలో కూడా భారత్ సరికొత్త సంఖ్య సాధించింది. గడిచిన 24 గంటలలో 20 వేల లోపు, అంటే 19,556 కేసులు జాతీయ స్థాయిలో నిర్థారితమయ్యాయి. ఇది 173 రోజులకిందట జులై 2న  నమోదైన  19,148 కు దగ్గరగా ఉంది.

ప్రతి పదిలక్షలలో చికిత్సలో ఉన్నది ప్రపంచసగటు 218 కాగా భారత లో అంతకంటే తక్కువగా ఉంది. అమెరికా, ఇటలీ, బ్రెజిల్, టర్కీ, రష్యా లాంటి దేశాల్లొ ఈ సంఖ్య మరింత ఎక్కువ.

 

మొత్తం కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 96 లక్షలు దాటి 96,36,487కు చేరింది. అంటే, కోలుకున్న శాతం 95.65%.  కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా ప్రస్తుతం 93,43,969 గా ఉంది. గత 24 గంటల్లో కోలుకున్నవారు 30,376 గా తేలారు. కొత్తగా నిర్థారణ అయినవారికంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం గత 25 రోజులుగా సాగుతూనే ఉంది.  

రోజువారీ కోవిడ్ నిర్థారణ పరీక్షలు చాలా ఎక్కువగా ఉండటం, కోలుకునేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం వలన కొత్త కేసులు తక్కువగా రావటం ఫలితంగా మరణాల శాతం చాలా తక్కువగా ఉంటోంది.

కొత్తగా కోలుకున్నవారిలో 75.31% మంది కేవలం పది రాష్ట్రాలలో కేంద్రీకృతమై ఉండగా మహారాష్ట్రలో అత్యధికంగా   6,053 మంది, కేరళలో 4,494 మంది, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో  2,342 మంది గత 24 గంటల్లో కోలుకున్నారు. 

Image

తాజాగా కోవిడ్ బారిన పడిన వారిలో 75.69% మంది పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదు కాగా, అందులో కేరళలో   అత్యధికంగా 3,423 కొత్త కేసులు, మహారాష్ట్రలో 2,834, పశ్చిమ బెంగాల్ లో  1,515 గత 24 గంటల్లో నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 301 మరణాలు నమోదు కాగా అందులో 76.74% మరణాలు పది రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అందులో మహారాష్ట్రలో అత్యధికంగా 18.27% (55 మరణాలు) సంభవించగా, పశ్చిమ బెంగాల్ లో 41 మంది, కేరళలో 27 మంది చనిపోయారు.   

***



(Release ID: 1682685) Visitor Counter : 153