ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో చికిత్సపొందుతున్న కోవిడ్ కేసులు 3.08 లక్షలకు తగ్గుదల
భారీగా పెరిగి మొత్తం 16 కోట్లు దాటిన కోవిడ్ పరీక్షలు
జాతీయ స్థాయిలో పాజిటివ్ శాతం 6.25%కు తగ్గుదల
జాతీయ స్థాయి కంటే తక్కువ శాతం పాజిటివ్ నమోదైన రాష్ట్రాలు
Posted On:
19 DEC 2020 11:17AM by PIB Hyderabad
గత కొన్ని వారాలుగా సాగుతున్న ధోరణిలోనే భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు మొత్తం పాజిటివ్ ల సంఖ్యలో 3.09% కు తగ్గింది. రోజూ వస్తున్న కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆ విధంగా కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉండటం వల్ల చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ ప్రస్తుతం 3,08,751 కి చేరింది.
గడిచిన 24 గంటలలో దేశంలో 25,152 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ జరగగా 29,885 మంది తాజాగా కోలుకున్నారు. దీంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. ఫలితంగా నికరంగా 5080 కేసులు తగ్గాయి. అలా చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య తగ్గుతూ భారత్ లో ప్రతి పది లక్షల కేసుల్లో 223 మాత్రమే అయ్యాయి. ఇది అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా తక్కువ సంఖ్య.
కోవిడ్ సంక్షోభం మీద భారత్ జరుపుతున్న పోరులో భాగంగా భారత్ మరో మైలురాయి దాటింది. ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షలు 16 కోట్లు దాటి 16,00,90,514 కు చేరాయి. గడిచిన 24 గంటలలో 11,71,868 శాంపిల్స్ కు పరీక్షలు జరిగాయి. పరీక్షించే సామర్థ్యం రోజుకు 15 లక్షలకు పెరిగింది.
స్థిరంగా, సమగ్రంగా కోవిడ్ పరీక్షలు చేస్తూ ఉండటం వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. ఆ విధంగా నేటికి పాజిటివ్ శాతం 6.25% కు చేరింది.
15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జాతీయ సగటు కంటే తక్కువ పాజిటివ్ కేసుల శాతం నమోదైంది.
మొత్తం కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 95.5 లక్షలు దాటి నేటికి 95,50,712 కు చేరింది. కోలుకున్నవారి శాతం 95.46% కు పెరిగింది. ఇది అంతర్జాతీయంగా అత్యుత్తమ స్థాయి. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అది 92,41,961గా నమోదైంది. 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 90% పైగా కోలుకున్న వారి శాతం నమోదైంది.
గడిచిన 24 గంటలలో కోలుకున్నవారిలో 74.97% మంది పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. కేరళలో అత్యధికంగా 4,701 మంది కోలుకోగా మహరాష్ట్రలో 4,467 మంది, పశ్చిమ బెంగాల్ లో 2,729 మంది నిన్న కోలుకున్నారు.
గత 24 గంటలలో నిర్థారణ అయిన పాజిటివ్ కేసులలో 73.58% కేవలం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వచ్చాయి. కేరళలో అత్యధికంగా 5,456 కేసులు రాగా, పశ్చిమ బెంగాల్ లో 2,239, మహారాష్ట్రలో 1,960 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటలలో 347 మంది మరణించగా అందులో 78.96% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 75మరణాలు నమోదు కాగా పశ్చిమ బెంగాల్ లో 42 మంది చనిపోయారు.
****
(Release ID: 1681952)
Visitor Counter : 272
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam