ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ లో కీలకమైన ప్రాజెక్టులను ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
ఎవరైనా మారుతున్న కాలాలకు తగినట్లు నడుచుకోవాలి, ప్రపంచంలో గల ఉత్తమమైన పద్ధతులను పాటించాలి: ప‌్రధాన మంత్రి
మేము రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము, మేము వారికి హామీ ని ఇస్తూ, వారి ఆందోళనలను పరిష్కరిస్తుంటాము: ప‌్రధాన మంత్రి
కచ్ఛ్ కొత్తతరం సాంకేతికతలోను, కొత్త తరం ఆర్థికవ్యవస్థలోను ఒక పెద్ద అడుగు ను వేసింది: ప‌్రధాన మంత్రి
Posted On:
15 DEC 2020 3:22PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లో వివిధ అభివృద్ధి పథకాలను ఈ రోజు న ఆవిష్కరించారు. ఈ పథకాల లో ఒక నిర్లవణీకరణ ప్లాంటు, ఒక హైబ్రిడ్ రిన్యూయబుల్ ఎనర్జీ పార్కులతో పాటు పూర్తి గా యంత్రాల సహాయం తో పని చేసే మిల్క్ ప్రోసెసింగ్, ప్యాకింగ్ ప్లాంటులు భాగం గా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఎవరైనా మారుతున్న కాలాలకు తగ్గట్లుగా నడుచుకోవాలని, ప్రపంచం లోని ఉత్తమ పద్ధతులను అక్కున చేర్చుకోవాలన్నారు. ఈ విషయం లో కచ్ఛ్ రైతులను ఆయన ప్రశంసించారు; కచ్ఛ్ రైతులు పండ్ల ను ప్రస్తుతం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇది మన రైతుల లోని నూతనోత్సాహాన్ని సూచిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. గుజరాత్ లో గడచిన రెండు దశాబ్దాలకు పైగా కాలం లో వ్యవసాయం, పాడి రంగాలు, మత్స్య పరిశ్రమ సుసంపన్నం అయ్యాయని, ప్రభుత్వం వైపు నుంచి కనీస స్థాయి ప్రమేయం ఉండటమే దీనికి కారణమని ఆయన చెప్పారు. గుజరాత్ చేసిందేమిటంటే రైతులకు, సహకార సంఘాలకు సాధికారిత ను కల్పించడమే అని ఆయన అన్నారు.
వ్యవసాయ సంస్కరణల విషయంలో రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. అమల్లోకి వచ్చిన వ్యవసాయ సంస్కరణలు రైతు సంఘాలు కోరుకున్నవే, ప్రతిపక్షాలు సైతం కొన్నేళ్లుగా కోరుతూ వచ్చినవే అని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది, మేం రైతులకు హామీని ఇస్తూనే ఉంటాం, వారి ఆందోళనలను మేం తీరుస్తూనే ఉంటాం అని ఆయన పునరుద్ఘాటించారు.
వర్తమానం లో కచ్ఛ్ నూతన తరం సాంకేతికత పరంగాను, నూతన తరానికి చెందిన ఆర్థిక వ్యవస్థ పరంగాను ఒక పెద్ద అడుగు ను వేసింది అని ప్రధాన మంత్రి అన్నారు. శంకుస్థాపన జరిగిన ఖరేరా లోని నవీకరణ యోగ్య శక్తి పార్కు , మాండవీ లోని నిర్లవణీకరణ ప్లాంటు, అంజార్ ప్రాంత పరిధి లో సర్ హద్ డేహ్ రీ లోని కొత్త ఆటోమేటిక్ ప్లాంటు లు కచ్ఛ్ అభివృద్ధి యాత్ర లో కొత్త మైలురాళ్ళు గా నిలువనున్నాయని ఆయన అన్నారు. ఈ పథకాల ప్రయోజనాలు కచ్ఛ్ ప్రాంతం ఆదివాసీలకు, రైతులకు, పశువుల పెంపకందారులకు, అలాగే సామాన్య ప్రజలకు అందివస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశం లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రాంతాలలో కచ్ఛ్ ఒక ప్రాంతం గా ఉందని ఆయన చెప్పారు. ఇక్కడ సంధానం రోజు రోజు కు మెరుగుపడుతోందని ఆయన అన్నిరు.
గుజరాత్ లో ప్రజలు ఒక ‘సీదా సాదా’ కోర్కె ను వ్యక్తం చేసే ఘడియ అంటూ ఒకటి ఉండేది.. అది- భోజన వేళ లో విద్యుత్తు సరఫరా- అనేదేనని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. గుజరాత్ లో ఎన్నో మార్పులు జరిగాయి అని ఆయన అన్నారు. గుజరాత్ లోని నేటి యువతరానికి అసౌకర్యం తాలూకు ఆరంభిక రోజులను గురించి తెలియనైనా తెలియదు అని ఆయన అన్నారు. కచ్ఛ్ లోని ప్రజానీకం నకారాత్మకమైన వృద్ధి ని చవిచూసిందని ఆయన జ్ఞప్తి కి తెచ్చారు. ప్రస్తుతం ప్రజలు బయటికి వెళ్ళడం మానుకున్నారు, బయటి వారు తిరిగి వస్తున్నారు.. ఈ కారణంగా జనాభా పెరుగుతోంది అని ఆయన అన్నారు. భారీ భూకంపం వాటిల్లిన తరువాత కచ్ఛ్ లో నాలుగింతల అభివృద్ధి చోటుచేసుకోవడంపై ఒక అధ్యయనాన్ని చేపట్టవలసిందిగా పరిశోధకులకు, విశ్వవిద్యాలయాలకు ఆయన పిలుపునిచ్చారు.
గత 20 సంవత్సరాల కాలం లో రైతులకు అనుకూలంగా ఉండే అనేక పథకాలను ప్రవేశపెట్టినందుకుగాను గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. సౌర శక్తి ఉత్పత్తి సామర్ధ్యాలను పటిష్టం చేసే దిశ గా కృషియడం లో గుజరాత్ ఒక మార్గదర్శిగా నిలచింది అని ఆయన అన్నారు.
శక్తి భద్రత, జల భద్రత అనేవి 21 వ శతాబ్దం లో కీలకమైనవి అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. నీటి ఎద్దడి సమస్య ను పరిష్కరించడానికి కచ్ఛ్ కు నర్మద జలాలను తీసుకువస్తామని చెప్పిన ఇదివరకటి బృందాలను గేలి చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఇప్పుడు, నర్మద జలాలు కచ్ఛ్ కు చేరుకొన్నాయని, కచ్ఛ్ ప్రగతి పథంలో పయనిస్తోందని ఆయన చెప్పారు.
***
(Release ID: 1680801)
Visitor Counter : 151
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam