ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ మీద పోరులో మరో మైలురాయి దాటిన భారత్

95% దాటిన కోలుకున్నవారి శాతం, ప్రపంచస్థాయిలో అత్యధిక సాధనలలో ఒకటి

3.4 లక్షలకంటే తగ్గిన చికిత్సలో ఉన్న కేసులు

161 రోజుల తరువాత రోజువారీ కేసులు 22,065 కి చేరిక

Posted On: 15 DEC 2020 10:42AM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భారత్ అనేక మైలురాళ్ళు దాటుతూ ముందుకు సాగుతోంది. తాజాగా గత 24 గంటలలో నమోదైన కేసులు 22,100 లోపుకు పడిపోయి 161 రోజుల తరువాత 22,065 కు చేరాయి. 2020 జులై 7న నమోదైన 22,252 కేసులే అప్పట్లో అత్యధికం.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YN82.jpg

రోజువారీ కోలుకుంటున్న కోవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో బాటు మరణాల సంఖ్య కూడా స్థిరంగా తగ్గుతూ రావటం వలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుదలబాటలో సాగుతోంది.  ఇదే క్రమంలో చికిత్సలో ఉన్న బాధితుల సంఖ్య తగ్గుతూ 3.4 లక్షలకంటే తగ్గి ప్రస్తుతం దేశంలో 3,39,820 మంది చికిత్సలో ఉన్నారు. ఇది మొత్తం కోవిడ్ కెసులలో 3.43% మాత్రమే.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002115Q.jpg

చికిత్సలో ఉన్నవారు తగ్గుతూ ఉండటానికి తోడు కోలుకుంటున్నవారు పెరుగుతూ ఉన్నారు. ఇప్పటిదాకా కోలుకున్నవారి మొత్తం సంఖ్య 94 లక్షలు పైబడి నేటికి  94,22,636 కు చేరింది. చికిత్సలో ఉన్నవారికి, కోలుకున్నవారికి మధ్య తేడా ప్రస్తుతం  90,82,816 కు చేరింది. ఫలితంగా కోలుకున్నవారి శాతం 95.12% కు చేరింది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003O4OW.jpg

ఎక్కువమంది కోవిడ్ బాధితులున్న దేశాలతో పోల్చుకున్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత్ లో కోలుకున్నవారిశాతం గణనీయంగా మెరుగైన స్థితిలో ఉంది.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00428EZ.jpg

గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 34,477 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారిలో 74.24% మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలొనే కేంద్రీకృతమయ్యారు.  అందులో మహారాష్ట్రలో అత్యధికంగా  4,610  మంది, ఆ తరువాత స్థానంలో కేరళలో 4,481 మంది కోలుకోగా, పశ్చిమ బెంగాల్ లో 2,980 మంది కోలుకున్నారు. 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005AO38.jpg

కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో 73.52% మంది 10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా  2,949 కేసులు నమోదు కాగా ఆ తరువాత స్థానంలో ఉన్న కేరళలో 2,707 కొత్త కేసులు వచ్చాయి. 

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006PI4E.jpg

గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 354 మంది కోవిడ్ బాధితులు చనిపోయారు. అందులో  79.66%  మంది పది రాష్ట్రాలలోనే నమోదయ్యారు. వారిలో మహారాష్ట్రలోనూ, ఢిల్లీలోనూ అత్యధికంగా 60 మంది చొప్పున చనిపోగా, పశ్చిమ బెంగాల్ లో 43 మరణాలు నమోదయ్యాయి.  

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007IQ9Y.jpg

****



(Release ID: 1680740) Visitor Counter : 165