హోం మంత్రిత్వ శాఖ

నేవీ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా భారత నావికాదళానికి శుభాకాంక్షలు తెలిపారు

"నేవీ రోజున, భారత నావికాదళంలోని మన సాహసోపేత సిబ్బందికి, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను"

"మన సముద్ర సరిహద్దులను రక్షించడంలో, విపత్తుల సమయంలో దేశానికి సేవ చేయడంలో వారి అచంచలమైన నిబద్ధతకు ప్రతీకగా నిలిచే
మహోన్నతమైన జల సైన్యాన్ని చూసి భారత్ గర్విస్తుంది"

Posted On: 04 DEC 2020 1:47PM by PIB Hyderabad

నేవీ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా భారత నావికాదళానికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్బంగా ఆయన ఒక ట్వీట్‌లో ఆయన ఇలా అన్నారు, “నేవీ రోజున, భారత నావికాదళానికి చెందిన మా సాహసోపేత సిబ్బందికి, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన సముద్ర సరిహద్దులను పరిరక్షించడంలో మరియు విపత్తుల సమయంలో దేశానికి సేవ చేయడంలో వారి అచంచలమైన నిబద్ధతకు భారతదేశం  గర్విస్తుంది. ”

ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 ను నేవీ డేగా జరుపుకుంటారు. 1971 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధంలో, ఆపరేషన్ ట్రైడెంట్ సమయంలో భారత నావికాదళం క్షిపణి పడవలు విజయవంతంగా తమ క్షిపణులను కరాచీలో పాకిస్తాన్ చమురు, తీర రక్షణ కేంద్రాలపై, ఓడలపైకి పేల్చినిర్ణయాత్మక విజయాన్ని సాధించిన భారత నావికాదళ చరిత్రలో ఈ రోజు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. 1971 కార్యకలాపాల సమయంలో, భారత నావికాదళం అనేక పాకిస్తాన్ నౌకలను ముంచివేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ డెక్ నుండి యుద్ధ విమానం, చిట్టగాంగ్, ఖుల్నా వద్ద శత్రు నౌకాశ్రయాలు మరియు వైమానిక క్షేత్రాలపై దాడి చేసి, ఓడలు, రక్షణ సౌకర్యాలు మరియు వ్యూహాత్మక కేంద్రాలను నాశనం చేసింది. కరాచీపై క్షిపణి దాడులు మరియు విక్రాంత్ నుండి వైమానిక దాడులు రెండూ అప్పటి తూర్పు పాకిస్తాన్‌లో పాకిస్తాన్ దళాల ఓటమికి దారితీశాయి.

***


(Release ID: 1678299)