ప్రధాన మంత్రి కార్యాలయం

వ‌ర‌ల్డ్ టాయిలెట్ డే నాడు ‘అంద‌రికీ టాయిలెట్’ అనే తన సంక‌ల్పాన్ని భార‌త‌దేశం బ‌ల‌ప‌ర‌చుకొంటోంది: ప‌్ర‌ధాన మంత్రి

ఆరోగ్య ర‌క్ష‌క టాయిలెట్ లు గౌర‌వం తో పాటు మహత్తర స్వాస్థ్య ప్ర‌యోజ‌నాల‌ను, ప్రత్యేకించి మన నారీ శ‌క్తి కి అందించాయి: ప‌్ర‌ధాన మంత్రి

Posted On: 19 NOV 2020 1:41PM by PIB Hyderabad

ఈ రోజు వ‌ర‌ల్డ్ టాయిలెట్ డే సంద‌ర్భం లో  ‘అంద‌రికీ టాయిలెట్’ అనే త‌న సంక‌ల్పాన్ని దేశం ప‌టిష్ట ప‌ర‌చుకొంటోంద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. 

“వ‌ర‌ల్డ్ టాయిలెట్ డే సంద‌ర్భంలో భార‌త‌దేశం త‌న #Toilet4All  సంక‌ల్పాన్ని బలపరచుకొంటోంది.  కోట్ల కొద్దీ భార‌తీయుల‌కు ఆరోగ్య ర‌క్ష‌క మ‌రుగుదొడ్డి స‌దుపాయాల‌ను స‌మ‌కూర్చ‌డం లో గ‌డ‌చిన కొన్ని సంవ‌త్స‌రాలు సాటిలేని విజ‌యానికి సాక్షిగా నిలచాయి.  ఇది గౌర‌వంతో పాటు గొప్ప స్వాస్థ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించింది.  ప్రత్యేకించి మ‌న నారీ శ‌క్తి కి ఇది ఎంతో తోడ్ప‌డింది’’ అని ట్విట‌ర్ లో న‌మోదు చేసిన ఒక సందేశం లో శ్రీ న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు.

***


(Release ID: 1674014) Visitor Counter : 203